ఐఐటీ (IITs)ల్లో అడ్మిషన్ కోసం జాతీయ స్థాయిలో నిర్వహించే ప్రవేశ పరీక్ష, జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్(JEE) అడ్వాన్స్డ్-2022 త్వరలోనే జరగనుంది. దీంతో ఉన్న తక్కువ సమయాన్ని అభ్యర్థులు ఎంతో తెలివిగా ఉపయోగించుకోవాలి. ప్రతి అంశంపై స్పష్టమైన అవగాహన కోసం ఆన్లైన్ ప్రాక్టీస్ టెస్ట్‌లు (Online Practice Tests) రాయాలి. జేఈఈ మెయిన్ (JEE Main)ను అభ్యర్థి కచ్చితత్వాన్ని నిర్ధారించడానికి డిజైన్ చేశారు. ఇక్కడ ప్రశ్నలు సింగిల్ కాన్సెప్ట్స్, డైరెక్ట్ అప్లికేషన్ ఆధారంగా ఉంటాయి. అదే జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో మల్టిపుల్ కాన్సెప్టువల్గా ఉంటాయి. వీటిని సాల్వ్ చేయాలంటే సబ్జెక్టులపై పట్టు, హై IQ, అనలిటికల్ స్కిల్, రిసాల్వింగ్ పవర్, స్ట్రైక్ రేట్‌తో పాటు కాన్సెప్ట్ క్లారిటీ కూడా అవసరమే.
ఐఐటీ ప్రవేశ పరీక్షలో సక్సెస్ కోసం మంచి వ్యూహాన్ని అనుసరించాలి. దీనికి పోటీ తీవ్రంగా ఉంటుంది. దీంతో ప్రతి సబ్జెక్టుపై ప్రిపరేషన్ స్థిరంగా ఉండాలి. మంచి ర్యాంకింగ్‌తో ఐఐటీకి అర్హత సాధించాలంటే అభ్యర్థులకు ఉన్నత స్థాయి క్రమశిక్షణ, అంకితభావం అవసరం.
* ఫోకస్ చేయాల్సిన టాపిక్స్
* మ్యాథమెటిక్స్
కాంప్లెక్స్ నంబర్స్, క్వార్డట్రిక్ ఈక్వేషన్స్ అండ్ ఎక్స్ప్రెషన్స్, వెక్టర్స్ అండ్ 3డీ జామెట్రి, ప్రాబబులిటీ, మ్యాట్రిక్స్ ఇన్ ఆల్జీబ్రా, సర్కిల్, పారాబోలా, హైఫర్బోలా ఇన్ కో ఆర్డినేట్ జామెట్రి, ఫంక్షన్స్, లిమిట్స్, కంటిన్యూటీ అండ్ డిఫరెంటబులిటీ, అప్లికేషన్స్ ఆఫ్ డెరివేటీవిస్, డెఫినైట్ ఇంటిగ్రల్ ఇన్ క్యాల్కులస్, వెక్టార్స్ అండ్ 3-డీ వంటి టాఫిక్స్పై ఫోకస్ చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా కాంప్లెక్స్ నంబర్స్‌పై ప్రత్యేక దృష్టిసారించాలి. ప్రతి సంవత్సరం దీని నుంచి 2-3 ప్రశ్నలు వస్తుంటాయి.
* ఫిజిక్స్
ఫ్లూయిడ్స్, హీట్ అండ్ థర్మోడైనమిక్స్, మెకానిక్స్, ఆప్టిక్స్ అండ్ మోడ్రన్ ఫిజిక్స్, వేవ్స్ అండ్ సౌండ్, కెపాసిటర్స్ అండ్ ఎలెక్ట్రోస్టాటిక్స్, మాగ్నెటిక్స్, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ వంటివి కీలకమైన టాపిక్స్. ఫిజిక్స్‌లో తక్కువ స్కోర్ చేయడానికి ప్రధాన కారణం మెకానిక్స్ అని చాలా మంది భావిస్తుంటారు. అయితే జేఈఈ అడ్వాన్స్డ్ స్కోర్‌లో మెజారిటీకి సంబంధించిన అంశం కూడా ఇదే. దీంతో ఈ టాపిక్‌ను అసలు విస్మరించకూడదు. గత ట్రెండ్స్ పరిశీలిస్తే.. మెకానిక్స్, ఎలక్ట్రిసిటీ అండ్ మాగ్నెటిజం నుంచి జేఈఈలో అత్యధిక ప్రశ్నలు వచ్చాయి.
ఇది కూడా చదవండి : రేపు ఏపీలో మరో జాబ్ మేళా.. ప్రముఖ సంస్థలో టెన్త్, ఇంటర్, డిగ్రీ, డిప్లొమా, బీటెక్ అర్హతతో జాబ్స్ .. ఇలా రిజిస్టర్ చేసుకోండి
* కెమిస్ట్రీ
క్వాలిటేటివ్ అనాలిసిస్, కోఆర్డినేషన్ కెమిస్ట్రీ అండ్ కెమికల్ బాండింగ్ ఇన్ ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఎలక్ట్రోకెమిస్ట్రీ, థర్మోడైనమిక్స్, కెమికల్ ఈక్విలిబ్రియం ఇన్ ఫిజికల్ కెమిస్ట్రీ అండ్ ఆర్గానిక్ కెమిస్ట్రీ వంటివి కీలకమైన టాపిక్స్. ‘కార్బొనిల్ కాంపౌండ్స్’ చాప్టర్లోని రియాక్షన్స్ అయిన ఆల్డోల్ కండెన్సేషన్, కన్నిజారో రియాక్షన్, పెర్కిన్స్ రియాక్షన్స్ పై ప్రత్యేక దృష్టిసారించాలి. గత పది సంవత్సరాల JEE అడ్వాన్స్డ్ ప్రశ్నాప్రతాన్ని పరిశీలిస్తే... ఈ రియాక్షన్స్ ఆధారంగానే ప్రశ్నలు వస్తున్నాయి. అలాగే ఎలక్ట్రోకెమిస్ట్రీ, థర్మోడైనమిక్స్, కోఆర్డినేషన్ కెమిస్ట్రీ, కెమికల్ బాండింగ్ వంటివి కీలకమైన టాపిక్స్. వీటిపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి.
చాలా మంది అభ్యర్థులు తక్కువ స్కోర్ వస్తుందన్న భయంతో మాక్ టెస్ట్‌లను ప్రయత్నించరు. ఎగ్జామ్ అనాలిసిస్ సెషన్లకు హాజరు కావడం లేదా సలహాదారులను సంప్రదించడం ద్వారా ఈ సమస్యను అధిగమించవచ్చు. మాక్ టెస్టులు పేపర్ నమూనాను అర్థం చేసుకోవడంతో పాటు టైమ్ మేనేజ్‌మెంట్‌లోనూ సహాయపడతాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Career and Courses, EDUCATION, Jee main 2022, JOBS