హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

IIT New Courses: జేఈఈ అడ్వాన్స్‌డ్​లో ఉత్తీర్ణులైన విద్యార్థులకు శుభవార్త​.. వివరాలివే

IIT New Courses: జేఈఈ అడ్వాన్స్‌డ్​లో ఉత్తీర్ణులైన విద్యార్థులకు శుభవార్త​.. వివరాలివే

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఇటీవలి కాలంలో ఐఐటీ సంస్థలు(IIT) కాలానికి అనుగుణంగా నూతన యుగం కోర్సులను (Courses) విద్యార్థులకు పరిచయం చేస్తున్నాయి. ఇప్పటికే పలు ఐటీ సంస్థలు న్యూ-ఏజ్ కోర్సులను తీసుకొచ్చాయి. జేఈఈ అడ్వాన్స్‌డ్ 2021(JEE Advanced 2021)లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు ఈ కోర్సుల్లో జాయిన్ కావచ్చు.

ఇంకా చదవండి ...

ఇటీవలి కాలంలో ఐఐటీ (IIT) సంస్థలు కాలానికి అనుగుణంగా నూతన యుగం కోర్సులను (New Course) విద్యార్థులకు పరిచయం చేస్తున్నాయి. ఇప్పటికే పలు ఐటీ సంస్థలు న్యూ-ఏజ్ కోర్సులను తీసుకొచ్చాయి. జేఈఈ అడ్వాన్స్‌డ్ 2021 (JEE Advanced 2021) లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు ఈ కోర్సుల్లో జాయిన్ కావచ్చు. రాబోయే విద్యా సంవత్సరం నుంచి ఐఐటీల్లో ప్రారంభం కానున్న న్యూ-ఏజ్ కోర్సులకు(new-age courses) జేఈఈ ఉత్తీర్ణులు దరఖాస్తు పెట్టుకోవచ్చని సంబంధిత అధికారులు వెల్లడించారు. డేటా సైన్స్‌ (Data Science) లో బీటెక్ నుంచి బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ వరకు జేఈఈ ఉత్తీర్ణులు (JEE Advanced 2021 Qualifiers) దరఖాస్తు చేసుకోగల సరికొత్త ఐఐటీల కోర్సులు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.

1. ఐఐటీ గువహటి - డేటా సైన్స్ & ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో బీటెక్(IIT Guwahati’s BTech in Data Science & Artificial Intelligence):

ఐఐటీ గువహటి (IIT Guwahati)2021-22 విద్యా సంవత్సరం నుంచి డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో బీటెక్ కోర్సునిప్రారంభించింది. ఈ కోర్సులో బిగ్ డేటా అనలిటిక్స్, మేనేజ్‌మెంట్, మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్, ఏఐ, కంప్యూటర్ విజన్, నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్, ఫైనాన్స్, ఐఓఐ రంగాలలో అత్యాధునిక సవాళ్లను పరిష్కరించడానికి విద్యార్థులను సన్నద్ధం చేయడానికి థియరటికల్, ప్రాక్టికల్ విధానాల్లో ట్రైనింగ్ ఇస్తారు.

2. ఐఐటీ హైదరాబాద్- కంప్యూటేషనల్లో బీటెక్, బయోటెక్ & ఇండస్ట్రియల్ ఇంజ‌నీరింగ్‌(IIT Hyderabad’s  BTech in Computational, Biotech & Industrial Engineering):

ఈ అకడమిక్ సెషన్ నుంచి బయోటెక్నాలజీ & బయోఇన్ఫర్మేటిక్స్, కంప్యూటేషనల్ ఇంజనీరింగ్, ఇండస్ట్రియల్ కెమిస్ట్రీ అనే మూడు కొత్త బీటెక్ ప్రోగ్రామ్‌లను ఐఐటీ హైదరాబాద్ పరిచయం చేసింది. అయితే విద్యార్థులు ఎంటర్​ప్రెన్యూర్​షిప్​(entrepreneurship), కంప్యూటర్ సైన్స్ వంటి ఏదైనా ఇతర డిపార్ట్‌మెంట్ నుంచి బీటెక్ ప్రోగ్రామ్‌లతో పాటు నిర్దేశిత కోర్సును కూడా చేయాల్సి ఉంటుంది.

3. ఐఐటీ ఢిల్లీ - ఎనర్జీ ఇంజినీరింగ్‌లో బీటెక్(IIT Delhi’s BTech in Energy Engineering):

ఎనర్జీ ఇంజనీరింగ్‌లో బీటెక్ అనే ఓ కొత్త అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్‌ను ఐఐటీ ఢిల్లీ ప్రారంభించింది. ఎనర్జీ రంగానికి సంబంధించిన అవసరమైన జ్ఞానం, నైపుణ్యాలను, సమస్యలకు పరిష్కారాలను విద్యార్థులకు అందించడానికి ఈ ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది.

4. ఐఐటీ జోధ్‌పూర్ - స్మార్ట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లో బీటెక్, ఎన్విరాన్‌మెంట్ ఇంజనీరింగ్(IIT Jodhpur’s BTech in Smart Infrastructure, Environment Engineering ):

ఐఐటీ జోధ్‌పూర్ సివిల్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇంజనీరింగ్ పాఠ్యాంశాలను మెరుగుపరిచింది. ఇప్పుడు ఈ సాంప్రదాయ కోర్సులో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్లానింగ్, డిజైనింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, స్మార్ట్ మెటీరియల్స్, సెన్సార్‌లు, ఫిజికల్, డిజిటల్ సమస్యలకు ఎదుర్కోగల ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ భద్రత వంటి కొత్త-యుగం అంశాలు ఉంటాయి.

5. ఐఐటీ ఖరగ్‌పూర్ - నాలుగేళ్ల బీఎస్ ప్రోగ్రామ్(IIT Kharagpur Four-Year BS Programme):

ఐఐటీ ఖరగ్‌పూర్ నాలుగేళ్ల బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ (BS) ప్రోగ్రామ్‌ను ఏడు సబ్జెక్టులలో ప్రారంభించింది. అప్లైడ్ జియోలజీ, కెమిస్ట్రీ, ఎకనామిక్స్, ఎక్స్‌ప్లోరేషన్ జియోఫిజిక్స్, మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్, ఫిజిక్స్ అనే ఏడు సబ్జెక్టులలో బీఎస్ కోర్సు పూర్తి చేయొచ్చు. ఈ ప్రోగ్రామ్ ఇప్పటికే ఉన్న ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ మాస్టర్ ఆఫ్ సైన్స్ (MS) ప్రోగ్రామ్‌కు అదనమని విద్యార్థులు గుర్తించాలి. దీనివల్ల విద్యార్థులు నాలుగేళ్ల తర్వాత బీఎస్ డిగ్రీని పూర్తి చెయ్యొచ్చు లేదా ఎంఎస్ డిగ్రీని కొనసాగించవచ్చు. ఎంఎస్ డిగ్రీని ఎంచుకోవడానికి వీలుగా ఆరవ సెమిస్టర్ చివరిలో ఆప్షన్ ని ఇస్తారు.

6. ఐఐటీ కాన్పూర్ - స్టాటిస్టిక్స్ & డేటా సైన్స్‌లో బ్యాచిలర్‌ ఆఫ్‌ సైన్స్‌(IIT Kanpur BS in Statistics & Data Science):

ఐఐటీ కాన్పూర్ స్టాటిస్టిక్స్, డేటా సైన్స్‌లోనాలుగేళ్ల బ్యాచిలర్‌ ఆఫ్‌ సైన్స్‌ కోర్సును ప్రారంభించింది. ఇది ఐదు సంవత్సరాల బీఎస్-ఎంఎస్ (BS-MS) ఇంటిగ్రేటెడ్ డిగ్రీ ప్రోగ్రామ్‌ను కూడా ప్రవేశపెట్టింది. ఐఐటీ కాన్పూర్ఈ కోర్సు ద్వారా విద్యార్థులకు హెల్త్, బయోమెడిసిన్, బయోఇన్ఫర్మేటిక్స్, డిజిటల్ హెల్త్, రిటైల్, బ్యాంకింగ్, ఆర్థిక డేటాకు సంబంధించిన డేటాతో సహా ఫండమెంటల్ స్టాటిస్టికల్, మ్యాథమెటికల్, కంప్యుటేషనల్, ఇమేజ్ ప్రాసెసింగ్ డేటా, డేటా సైన్స్ అప్లికేషన్‌ వంటి తదితర అంశాల గురించి బోధిస్తుంది.

Published by:Nikhil Kumar S
First published:

Tags: EDUCATION, IIT, JEE Main 2021

ఉత్తమ కథలు