JEE Advanced Admit Card: జేఈఈ అడ్వాన్స్‌డ్- 2021 అడ్మిట్ కార్డులు విడుదల.. ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలంటే..

(ప్రతీకాత్మక చిత్రం)

ఐఐటీల్లో ప్రవేశానికి నిర్వహించనున్న జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (JEE) అడ్వాన్స్‌డ్- 2021 అర్హత పరీక్ష అడ్మిట్ కార్డులు విడుదలయ్యాయి. అధికారిక వెబ్‌సైట్ అయిన jeeadv.ac.in లో విద్యార్థులు వీటిని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

  • Share this:
ఐఐటీల్లో ప్రవేశానికి నిర్వహించనున్న జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (JEE) అడ్వాన్స్‌డ్- 2021 అర్హత పరీక్ష అడ్మిట్ కార్డులు విడుదలయ్యాయి. అధికారిక వెబ్‌సైట్ అయిన jeeadv.ac.in లో విద్యార్థులు వీటిని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ లాగిన్ వివరాలతో హాల్ టికెట్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. JEE అడ్వాన్స్‌డ్- 2021 పరీక్షను ఐఐటీ ఖరగ్‌పూర్‌ నిర్వహిస్తోంది. జేఈఈ మెయిన్స్‌లో అర్హత సాధించినవారు అడ్వాన్స్‌డ్ ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. దేశవ్యాప్తంగా అక్టోబర్ 3న ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ జరగనుండగా, అక్టోబర్ 15న ఫలితాలు వెలువడనున్నాయి.

HDFC Bank: హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్ గుడ్ న్యూస్.. నిరుద్యోగులకు తీపికబురు..! పూర్తి వివరాలివే..!


JEE అడ్వాన్స్‌డ్ అడ్మిట్ కార్డ్స్‌ ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి?
పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్‌ను డౌన్‌లోడ్ చేసుకోవడానికి విద్యార్థులు ముందు JEE అడ్వాన్స్‌డ్ అధికారిక వెబ్‌సైట్‌ ఓపెన్ చేయాలి. తరువాత హోమ్‌పేజీలో కనిపించే అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్ లింక్‌పై క్లిక్ చేయాలి. ఇక్కడ ఓపెన్ అయ్యే విండోలో విద్యార్థుల రిజిస్ట్రేషన్ నంబర్, పాస్‌వర్డ్‌ ఎంటర్ చేసి, సబ్‌మిట్ చేయాలి. అనంతరం JEE అడ్వాన్స్‌డ్- 2021 హాల్ టికెట్ కనిపిస్తుంది. దీన్ని డౌన్‌లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోవచ్చు.

అడ్మిట్ కార్డును డౌన్‌లోడ్ చేసిన తర్వాత, అందులో రిజిస్ట్రేషన్ ఐడీ, అభ్యర్థి పేరు, పుట్టిన తేదీ, ఫోటో, సంతకం.. వంటి వివరాలను విద్యార్థులు తప్పనిసరిగా క్రాస్ చెక్ చేయాలి. ఏదైనా తప్పు కనిపిస్తే వెంటనే సమస్య గురించి అధికారులకు ఫిర్యాదు చేయాలి. ఈ అడ్మిట్ కార్డులో ఎలాంటి తప్పులు ఉన్నా పరీక్ష కేంద్రంలో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. అందువల్ల అన్ని వివరాలను ముందుగానే ధ్రువీకరించుకోవాలి. అడ్మిట్ కార్డులోని వివరాల్లో తప్పులు ఉంటే.. సంబంధిత జోనల్ కోఆర్డినేటింగ్ IIT లోని JEE (అడ్వాన్స్‌డ్) 2021 విభాగం ఛైర్మన్‌ను సంప్రదించాలి.

HPCL Recruitment: హెచ్‌పీసీఎల్ బ‌యోఫ్యూయ‌ల్‌లో 255 ఉద్యోగాలు..


జేఈఈ అడ్వాన్స్‌డ్ ఎగ్జామ్ ప్యాటర్న్..
దేశవ్యాప్తంగా ఉన్న ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీల్లో (ఐఐటీల్లో) ప్రవేశానికి నిర్వహించే ఈ పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి. ప్రతి పేపర్‌కు మూడు గంటల సమయం ఉంటుంది. ఈ రెండు పేపర్లలో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ వంటి మూడు విభాగాల నుంచి ప్రశ్నలు ఉంటాయి. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT) విధానంలో ఈ పరీక్ష జరగనుంది. ఇంగ్లీష్, హిందీలో ప్రశ్నపత్రం ఉంటుంది.
Published by:Krishna Adithya
First published: