Home /News /jobs /

JEE 2022 HERE IS IMPORTANT TIPS FOR JEE ASPIRANTS NS VSP

JEE Preparation Tips: జేఈఈకి ప్రిపేర్ అవుతున్నారా? అయితే.. ఈ టిప్స్ మీ కోసమే.. తెలుసుకోండి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

జాతీయ స్ధాయిలో నిర్వహించే అతి పెద్ద ఇంజనీరింగ్ పరీక్ష అయిన జేఈఈ మెయిన్ ను ప్రతీ ఏడాది 2 సెషన్స్ లో నిర్వహిస్తారు. సాధారణంగా ప్రతీ ఏటా జేఈఈ మెయిన్ రెండు విడతలుగా జనవరి, ఏప్రిల్ నెలల్లో జరుగుతాయి. కానీ..

    సేకరణ: ఆనంద్ మోహన్, న్యూస్18 కరస్పాండెంట్, విశాఖ‌ప‌ట్నం

    నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ(NTA) జేఈఈ మెయిన్స్ (JEE) షెడ్యూల్‌ను విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న ఐఐటీ, ఐఐఐటీ, ఎన్ఐటీల్లో ప్రవేశం కోసం నిర్వహించే జేఈఈ మెయిన్స్ పరీక్షలు జరగనున్నాయి. జాతీయ స్ధాయిలో నిర్వహించే అతి పెద్ద ఇంజనీరింగ్ పరీక్ష అయిన జేఈఈ మెయిన్ ను ప్రతీ ఏడాది 2 సెషన్స్ లో నిర్వహిస్తారు. సాధారణంగా ప్రతీ ఏటా జేఈఈ మెయిన్ రెండు విడతలుగా జనవరి, ఏప్రిల్ నెలల్లో జరుగుతాయి. కానీ, కోవిడ్ కారణంగా ఈ ఏడాది నిర్వహించే జేఈఈ మెయిన్-2022 (JEE Main 2022) పరీక్షల‌ను జూన్, జూలై నెలల్లో నిర్వ‌హిస్తున్నారు. ఇప్పటికే జేఈఈ మెయిన్- 2022లో అర్హత సాధించడం కోసం అభ్య‌ర్థుల‌ు సిద్దమవుతున్నారు.

    దేశవ్యాప్తంగా 23 ఐఐటీలలలో ఉన్న 12 వేల సీట్లను, ఈ జేఈఈ అడ్వాన్సడ్ ఎగ్జామ్ లో వచ్చిన మార్కుల ద్వారా సాధించడానికి వీలుంటుంది. ఇక 31 ఎన్ఐటీ లు, 25 ట్రిపుల్ ఐటీ లలో కూడా ఈ జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షలో క్వాలిఫ్ అయ్యి మంచి మార్కులు సాధించిన వారు సీట్లు సాధించవచ్చు. ప్రతీ ఏటా ఈ జేఈఈ మెయిన్ పరీక్షలకు సుమారు 12 లక్షల మంది విద్యార్ధులు హాజరవుతుంటారు. మొదట జేఈఈ మెయిన్ ఎగ్జామ్ రాసి క్వాలిఫ్ అయిన వాళ్లలో సుమారు రెండున్నర లక్షల మంది విద్యార్ధులు జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షకు ప్రిపేర్ అవుతుంటారు. ఇలా జేఈఈ అడ్వాన్స్ పరీక్ష క్వాలిఫై అయ్యి.. అత్యధిక మార్కులు సాధించిన వారికి ఐఐటీలలో సీట్లు లభిస్తాయి. కానీ ఐఐటీలలో సీట్లను సాధించాలంటే చాలా ప్రిపరేషన్, మెంటల్ గా స్ట్రాంగ్ గా వుండటం అవసరం.
    JEE Mains 2022: జేఈఈ మెయిన్ టిప్స్.. ఇలా చ‌దివితే బెస్ట్ స్కోర్ సాధించ‌వ‌చ్చు!

    జేఈఈ మెయిన్ ఎగ్జామ్ ఎలా వుంటుంది. ఎగ్జామ్ ప్యాట్రన్ ఏంటి? (EXAM PATTERN)
    జేఈఈ మెయిన్ -2022 ఆన్ లైన్ ఎగ్జామ్ గురించి పూర్తీ వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ప్రతీ ఏడాదిలా కాకుండా ఈ ఏడాది ఎగ్జామ్ ప్రాట్రన్ కాస్త మారింది. గత ఏడాది వరకూ మొత్తం 75 ప్రశ్నలు ఇచ్చి, అన్ని సమాధానాలు రాయాల్సి ఉండేది. ప్రతీ ప్రశ్నకు జవాబు రాయాల్సి ఉండేది. కానీ ఈ ఏడాది 5 ఛాయిస్ ప్రశ్నలు కూడా ఇచ్చి 25 ప్రశ్నలకు సమాధానాలు మాత్రమే రాయాల్సి ఉంటుంది.

    1. జేఈఈ మెయిన్ ఎగ్జామ్ మూడు సెక్షన్లుగా వుంటుంది. ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమేటిక్స్ అనే సెక్షన్లు ఉంటాయి. 2.ఈ మూడు సెక్షన్లు ఒక్కొక్కటి 30 ప్రశ్నలు చొప్పున, 90 ప్రశ్నలు వస్తాయి. వీటిలో ఒక్కో సబ్జెక్ట్ లో 25 ప్రశ్నలు రాస్తే సరిపోతుంది. 5 ప్రశ్నలు ఛాయిస్ కింద వదిలేయవచ్చు. అంటే 75 ప్రశ్నలకు గానూ 4 మార్కుల చొప్పున 300 మార్కులకు పరీక్ష ఉంటుంది. 3. ఒక్కో సబ్జెక్ట్ లో ఇచ్చే 30 ప్రశ్నల్లో సెక్షన్-ఏ లో మొదటి 20 ప్రశ్నలు మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు, సెక్షన్-బీ లో తర్వాతి 10 ప్రశ్నలు న్యూమరికల్ ప్రశ్నలు వుంటాయి. ఈ న్యూమరికల్ ప్రశ్నలకు 0 నుండి 9 మధ్య జవాబులు ఉంటాయి. వాటిలో సరైన ఆన్సర్ ను ఎంచుకొని రాయాల్సి ఉంటుంది. 4.ఈ న్యూమరికల్ ప్రశ్నల్లో ఐదు ప్రశ్నలు ఛాయిస్ కింద వదిలేయవచ్చు. మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు మాత్రం అన్ని రాయాల్సి ఉంటుంది. 5. ఒక్కో సరైన సమాధానానికి 4 మార్కులు ఉంటాయి. నెగెటివ్ మార్కులు కూడా ఉంటాయి. ఒక్కో తప్పు ఆన్సర్ కు -1 చొప్పున కట్ చేస్తారు. అంటే 4 తప్పు ఆన్సర్లు రాస్తే.. 4 మార్కులు పోతాయి.

    సబ్జెక్ట్ వైజ్ జేఈఈ పేపర్ టాపిక్స్ ఏం వుంటాయి.. వాటికి ఎలా చదవాలి.?(SUBJECT WISE TOPICS)
    1)Chemistry (కెమిస్ట్రీ)లో ప్రిపేర్ కావాల్సిన అంశాలు)జేఈఈ ఎగ్జామ్ లో మన ర్యాంకును నిర్ణయించే కీలకమైన సబెక్టుల్లో కెమిస్ట్రీ ఒకటి. ఇతర సబెక్టులతో పోల్చితే కెమిస్ట్రీలోమంచి స్కోర్ చేయడం చాలా సులభం. ఇందులో ఎక్కువగా మెమరీ ఆధారిత ప్రశ్నలే ఉంటాయి. అందువల్ల జేఈఈ ఎగ్జామ్ ను కెమిస్ట్నీ తో మొదలుపెడితే సక్సెస్ రేట్ ఎక్కువగా ఉంటుంది. మంచి మార్కులు సాధించవచ్చు. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ కెమిస్ట్రీ లలోని మొత్తం టాపిక్స్ ను 3 విభాగాలుగా చూడాలి. 1)ఫిజికల్ కెమిస్ట్రీ, 2)ఆర్గానిక్ కెమిస్ట్రీ, 3)ఇన్‌ఆర్గానిక్ కెమిస్ట్రీ వుంటాయి.  A)ఫిజికల్ కెమిస్ట్రీలో ఈక్విలిబ్రియం, థర్మోడైనమిక్స్, కెమికల్ కైనటిక్స్, ఎలెక్ట్రోకెమిస్ట్రీ వంటివి అతి ముఖ్యమైన చాప్టర్లు. దీంతో వీటిని ఎక్కువగా ప్రిపేర్ అవ్వాలి. వీటి నుంచి న్యూమరికల్ వ్యాల్యూ సంబంధిత ప్రశ్నలతో పాటు సింగిల్ చాయిస్ కరెంట్ MCQ ప్రశ్నలు ఎక్కువగా అడిగే అవకాశం ఉంది.

    అందుకే వీటి పై ఎక్కువగా ఫోకస్ పెట్టాలి..B)ఇక ఆర్గానిక్ కెమిస్ట్రీ నుండి రియాక్షన్ అండ్ మెకానిజం ఆఫ్ ఆర్గానిక్ రియాక్షన్, క్వశన్స్ ఆన్ నోమన్‌క్లేచర్, ఎలక్ట్రానిక్ డిస్‌ప్లేస్‌మెంట్ ఎఫెక్ట్స్, కన్వర్షన్స్, నేమ్ రియాక్షన్ నుంచి ఎక్కువగా ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. అలాగే GOC అండ్ కెమికల్ రియాక్షన్స్ ఆఫ్ కార్బోనల్ కాంపౌండ్స్, అమినస్, ఆల్కహాల్ కూడా కొన్ని ముఖ్యమైన టాఫిక్స్. వీటి నుంచి కూడా తరచుగా ప్రశ్నలు వస్తుంటాయి. బయోమాలిక్యూల్స్, కెమిస్ట్రీ ఇన్ ఎవ్రీ డే లైఫ్, పాలిమర్‌ల వంటి చాప్టర్లను కూడా విస్మరించకూడదు. ఎందుకంటే ఈ అంశాల నుంచి కూడా కొన్ని ప్రశ్నలు వస్తున్నాయి. సమ్మేళనాలు, లక్షణాలు, పోకడలు ఉంటాయి. విద్యార్థులు సరైన కారణాలతో వీటిని అర్థం చేసుకోవాలి.

    కెమిస్ట్రీకి చెందిన NCERT(ఎన్.సీ.ఈ.ఆర్.టీ) సిలబస్‌పై ఇంటెన్సివ్, ప్లాన్డ్ రీడింగ్‌తో ఉండాలి. అలాగే NCERT ఉదాహరణల నుండి ప్రశ్నలను సాల్వ్ చేయడాన్ని ప్రాక్టీస్ చేస్తుండాలి. పి-బ్లాక్, డి-బ్లాక్ వంటి చాప్టర్లకు ట్రెండ్‌లను నేర్చుకోవడం కూడా ముఖ్యమే. అలాగే మంచి స్కోర్ చేయడానికి కోఆర్డినేషన్ కాంపౌండ్‌లోని కాన్సెప్ట్‌లను పూర్తిగా అవగాహన పెంచుకోవాలి. గ్రాఫ్ లు మొదలగు వాటి గురించి పూర్తిగా తెలుసుకోవాలి.

    ఇన్‌ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఫిజికల్ కెమిస్ట్రీ, ఆర్గానిక్ కెమిస్ట్రీ లలో ఇన్ ఆర్గానిక్ కెమిస్ట్రీలో మంచి మార్కులు సాధించవచ్చు. తర్వాత ఫిజికల్ కెమిస్ట్రీలో, ఆర్గానిక్ కెమిస్ట్రీ లో మంచి మార్కులు సాధించవచ్చు. మొత్తం 25 ప్రశ్నల్లో ఇన్ ఆర్గానిక్ నుండి 8 నుండి 10 ప్రశ్నల వరకూ రావచ్చు. ఫిజికల్ కెమిస్ట్రీ నుండి 8 నుండి 10 ప్రశ్నలు రావచ్చు.

    2)Mathematics మ్యాధమేటిక్స్ లో ప్రిపేర్ కావాల్సిన అంశాలు
    1. Sets, relations, funtions 2. complex numbers and Quadratic equations 3. matrices and determinants 4. permutations and combinations 5. mathematical induction 6. binomial theorem and its simple applications 7. Sequences and series 8. Limit, continuity and differentiability 9. integral calculus 10. Differential equations 11. co-ordinate geometry 12. three-dimensional geometry 13. vector algebra 14. statastics and probability 15. Trigonometry 16. Mathematical reasoning.

    ఇలా ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ CBSE మ్యాధమేటిక్స్ల్ సిలబస్ లోని ముఖ్యమైన చాప్టర్లను, అందులోని సబ్ టాపిక్స్ ను కూడా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది.
    3)physics (ఫిజిక్స్ లోని ముఖ్యమైన అంశాలు)రెండేళ్ల CBSE ఫిజిక్స్ సిలబస్ ను జేఈఈ మెయిన్స్ కోసం  6 యూనిట్లుగా తీసుకొని, అందులో సబ్ చాప్టర్స్ ను లోతుగా ప్రిపేర్ కావాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఈ యూనిట్లను MECHANICS, ELECTRODYNAMICS, HEAT AND THERMODYNAMICS, WAVES, OPTICS, MODERN PHYSICS గా విభజించారు. ఈ ఆరు యూనిట్లలో వాటి సబ్ టాపిక్స్ ను క్షుణ్ణంగా పరిశీలిస్తే..
    MECHANICS 1. kinematics 2. laws of motion 3. work, power and energy 4. center of mass and collision 5. Rotational Motion)
    ELECTRODYNAMICS (6. Electrostatics and capacitance 7. Current Electricity 8. Magnetic Effects Of Current and Magnetism 9. Electro Magnetic induction and alternating currents)
    HEAT AND THERMODYNAMICS (10. Heat Transfer and calorimetry 11. Thermodynamics)
    WAVES (12. S.H.M 13. String Waves 14. Sound Waves)
    OPTICS (13. Ray optics 14. optical instruments 15. Wave optics)
    MODERN PHYSICS (16. Dual nature of matter and radiation 17. atoms and Nuclei) గా విభజించారు.

    వీటిని క్షుణ్ణంగా పరిశీలిస్తే.. మొదటి రెండు యూనిట్ల నుండి 50 శాతం ప్రశ్నలు రావొచ్చని సబ్జెక్ట్ నిపుణులు చెబుతున్నారు.
    జేఈఈ మెయిన్ పరీక్షలకు ఎలా ప్రిపేర్ అవ్వాలి. ( HOW TO PREPARE FOR JEE MAIN)ఇప్పటికే ఇంటర్మీడియట్ పరీక్షలను పూర్తి చేసిన విద్యార్థులు.. జేఈఈ మెయిన్స్ కోసం సిద్దమవుతున్నారు. అయితే ఎలా ప్రిపేర్ అయితే మంచి మార్కులు వస్తాయన్న విషయంపై సరైన అవగాహన కలిగివుండాలి. లేకపోతే జేఈఈ, నీట్ వంటి ఎగ్జామ్స్ కు సరిగ్గా ప్రిపేర్ కాలేక పరీక్షల్లో ఫెయిల్ అయ్యే ఛాన్స్ వుంది. అందువల్ల ఈ పరీక్షల్లో ఎలా ప్రిపేర్ కావాలన్న విషయంలో కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలని సబ్జెక్ట్ నిపుణులు చెబుతున్నారు

    1) పైన పేర్కొన్న కెమిస్ట్రీ, మ్యాధమేటిక్స్, ఫిజిక్స్ సెక్షన్లలో వచ్చే చాప్టర్లు, సబ్ టాపిక్స్ లను ప్రణాళిక ప్రకారం ప్రిపేర్ అయితే.. జేఈఈ క్రాక్ చేయడం పెద్ద విషయం కాదని నిపుణులు అంటున్నారు.2) 75 ప్రశ్నలు వరుసగా కెమిస్ట్రీ, మ్యాధమేటిక్స్, ఫిజిక్స్ ప్రశ్నలకు సమాధానాలు రాయగలిగితే.. ఈజీగా టైమ్ మేనేజ్ చేసుకుంటూ మంచి మార్కులు సాధించవచ్చు. 3) గ్రాండ్ టెస్ట్ లు, మాక్ టెస్ట్ లు రాయడం, జేఈఈ మోడల్ పేపర్లను రాయడం ద్వారా జేఈఈ మెయిన్ ఎగ్జామ్ ను ఎటువంటి తడబాటు లేకుండా రాసే అవకాశం ఉంటుంది. ఇలా ప్లాన్డ్ గా, సిస్టమేటిక్ గా చదవగలగాలి4) మిగిలిన అంశాలను కవర్ చేయడానికి ఒక మంచి స్ట‌డీ టైం టేబుల్ ను రూపొందించండి.

    స‌రైన ప్రణాళిక లేక‌పోతే చిన్న సులభమైన అధ్యాయాలపై చాలా సమయం వృధా అవ‌డ‌మే కాకుండా ముఖ్యమైన అంశాలు మిస్ అవుతారు5) JEE ముఖ్య‌మైన అంశాల‌ను కవర్ చేయడానికి NCERT పాఠ్యపుస్తకాలను చదవండి, ముఖ్యంగా కెమిస్ట్రీ (స్కోరింగ్ విభాగం). మ్యాథ్, ఫిజిక్స్ కోసం కోచింగ్ మాడ్యూల్స్ లేదా రిఫరెన్స్ బుక్స్‌లో వ‌చ్చే ప్రశ్నలు అడుగుతారు గుర్తుపెట్టుకోండి.6) ఒకే అంశాలు అధ్యాయాలను తెలుసుకోవడానికి నాలుగైదు పుస్తకాలు లేదా మెటీరియల్‌లను ఫాలో అవ్వ‌ద్దు ఎదో ఒక పుస్త‌కం ఫాలో అయితే స‌రిపోతుంది.

    7) థియరీ పాయింట్లు, నోట్స్, ఫార్ములాల కోసం ప్రత్యేక నోట్స్ ను రాసుకోండి. ప్రాక్టీస్ ప్రశ్నలు పరిష్కరించడం సరైన సమాధానం వ‌చ్చేలా ప్రాక్టీస్ చేయండి. తక్కువ సమయంలో మీరు ప్ర‌శ్న‌ల‌ను ఆన్ష‌ర్ చేస్తోన్నారో లేదో తెలుసుకోండి. 8) JEE మెయిన్ మునుపటి సంవత్సరాల పేపర్లు, ఆన్‌లైన్ మాక్ టెస్ట్‌లను త‌క్కువ స‌మ‌యంలో  పరిష్కరించ‌డం ప్రాక్టీస్ చేయండి.. జేఈఈ మెయిన్ ఎగ్జామ్ కోసం ఇలా అనేక అంశాలపై గురిపెట్టి ప్రిపేర్ అయితే.. జేఈఈ మెయిన్ లో మంచి మార్కులతో, ర్యాంక్ తో క్రాక్ చేయవచ్చు. మంచి ఇంజనీరింగ్ కాలేజీలో జాయిన్ కావొచ్చు. ఆల్ ది బెస్ట్.
    Published by:Nikhil Kumar S
    First published:

    Tags: Career and Courses, Exams, Jee main 2022, JOBS, National Testing Agency

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు