Home /News /jobs /

JEE 2020 FROM JULY 19 TO JULY 23 AND NEET 2020 ON JULY 26 HRD MINISTER ANNOUNCES EXAM DATES SS

Exam Dates: నీట్, జేఈఈ పరీక్ష తేదీలు వెల్లడి... ఎప్పుడంటే

Exam Dates: నీట్, జేఈఈ పరీక్ష తేదీలు వెల్లడి... ఎప్పుడంటే
(ప్రతీకాత్మక చిత్రం)

Exam Dates: నీట్, జేఈఈ పరీక్ష తేదీలు వెల్లడి... ఎప్పుడంటే (ప్రతీకాత్మక చిత్రం)

JEE NEET Exam Dates | కరోనా వైరస్ లాక్‌డౌన్ కారణంగా నీట్, జేఈఈ మెయిన్, ఇతర ఎంట్రెన్స్ ఎగ్జామ్స్, అడ్మిషన్లు, బోర్డ్ ఎగ్జామ్స్ వాయిదా పడ్డ సంగతి తెలిసిందే.

    జేఈఈ 2020, నీట్ 2020 పరీక్ష తేదీలను వెల్లడించింది కేంద్ర ప్రభుత్వం. కేంద్ర మానవ వనరులు, అభివృద్ధి మంత్రిత్వ శాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ సోషల్ మీడియాలో విద్యార్థులతో నిర్వహించిన లైవ్ ఇంటరాక్షన్‌లో ఈ కాంపిటీటీవ్ పరీక్షల తేదీలను వెల్లడించారు. 2020 జూలై 18 నుంచి జూలై 23 వరకు జేఈఈ మెయిన్ ఎగ్జామ్ నిర్వహిస్తామని ప్రకటించారు. జూలై 1 నుంచి ఈ పరీక్షల ప్రక్రియ ప్రారంభమవుతుందని తెలిపారు. ఆగస్టులో సెషన్ మొదలవుతుందన్నారు. జేఈఈ అడ్వాన్స్‌డ్ ఆగస్టులో ఉంటుందని మంత్రి ప్రకటించారు. ఇక మెడికల్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్ నీట్ జూలై 26న ఉంటుందని తెలిపారు.


    విద్యార్థుల సందేహాలు తీర్చేందుకు, సమస్యల్ని పరిష్కరించేందుకు ప్రతీ యూనివర్సిటీలో కోవిడ్ 19 టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేయాలని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్-UGC అడిగినట్టు మంత్రి తెలిపారు. ప్రస్తుతం దొరికిన ఈ ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని విద్యార్థులను ప్రోత్సహించారు. ఇక ఇప్పటికే పూర్తైన పరీక్షల్ని మళ్లీ నిర్వహించమని క్లారిటీ ఇచ్చారు. సీబీఎస్ఈ పరీక్షలకు సంబంధించిన వివరాలను రాబోయే రోజుల్లో బోర్డు అప్‌డేట్ చేస్తుందని చెప్పారు.

    కరోనా వైరస్ లాక్‌డౌన్ కారణంగా నీట్, జేఈఈ మెయిన్, ఇతర ఎంట్రెన్స్ ఎగ్జామ్స్, అడ్మిషన్లు, బోర్డ్ ఎగ్జామ్స్ వాయిదా పడ్డ సంగతి తెలిసిందే. పరీక్షలు ఎప్పుడు నిర్వహిస్తారన్న ఆందోళన విద్యార్థుల్లో నెలకొంది. పరీక్ష షెడ్యూల్ కోసం ఎదురుచూస్తున్నారు. విద్యార్థుల ఆందోళనలు తొలగించేందుకే కేంద్ర మంత్రి సోషల్ మీడియాలో వారితో ఇంటరాక్ట్ అయ్యారు.

    Job News: మరిన్ని జాబ్స్ &ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

    ఇవి కూడా చదవండి:

    Andhra Pradesh Jobs: ఆంధ్రప్రదేశ్‌లో 1,070 జాబ్స్... 2 రోజులే గడువు

    Free Course: రూ.6800 విలువైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్సు ఉచితం... అప్లై చేయండిలా

    Andhra Pradesh Jobs: ఆంధ్రప్రదేశ్‌లో 235 జాబ్స్... ఖాళీల వివరాలు ఇవే
    Published by:Santhosh Kumar S
    First published:

    Tags: CAREER, Corona, Corona virus, Coronavirus, Covid-19, Exams, Jee, Job notification, JOBS, Lockdown, NEET, NEET 2020, NOTIFICATION

    తదుపరి వార్తలు