స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) SSC జూనియర్ ఇంజనీర్(Junior Engineer) పేపర్ 2 పరీక్ష తేదీని ప్రకటించింది. జూనియర్ ఇంజనీర్ (సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్) పోస్టులకు సంబంధించి సెకండ్ పేపర్ ను 26 ఫిబ్రవరి 2023న నిర్వహించనున్నారు. SSC JE పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ssc.nic.inని సందర్శించడం ద్వారా పరీక్ష తేదీని తనిఖీ చేయవచ్చు. పేపర్ 2 తేదీలను ప్రకటించినప్పటి నుండి.. అభ్యర్థులు పేపర్ 1 ఫలితాలు ఎప్పుడు విడుదల అవుతాయా అని ఎదురుచూస్తున్నారు. పేపర్ 2 పరీక్ష తేదీ వెల్లడించడంతో త్వరలో పేపర్ 1 ఫలితాలు విడుదల కానున్నాయి. పేపర్ 1లో షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థులు మాత్రమే పేపర్ 2కు అర్హత ఉంటుంది.
SSC JE పేపర్ 1 దేశవ్యాప్తంగా 15 నవంబర్ 2022న నిర్వహించబడింది. పేపర్ 1కి సంబంధించిన ప్రొవిజనల్ ఆన్సర్ కీ నవంబర్ 22న విడుదలైంది. పేపర్ 1 కంప్యూటర్ ఆధారిత విధానంలో నిర్వహించబడింది. ఈ నోటిఫికేషన్ ద్వారా భారత ప్రభుత్వంలోని వివిధ విభాగాలలో జూనియర్ ఇంజనీర్ నియామకం జరుగుతుంది.
పేపర్ 2 ప్యాటర్న్
పేపర్ 1ని CBT మోడ్‌లో నిర్వహించారు. ఇక పేపర్ 2 గురించి మాట్లాడితే.. ఇది డిస్ట్రిబ్యూటివ్ మోడ్‌లో నిర్వహించబడుతుంది. పేపర్ 2ని మూడు భాగాలుగా విభజించారు. పార్ట్ ఏలో జనరల్ ఇంజనీరింగ్ (సివిల్ & స్ట్రక్చరల్), పార్ట్ బిలో జనరల్ ఇంజనీరింగ్ (ఎలక్ట్రికల్), పార్ట్ సి జనరల్ ఇంజనీరింగ్ (మెకానికల్) వీటికి గరిష్ట మార్కులు 300 ఉంటుంది. సమయం వ్యవధి 2 గంటలు. పేపర్ 2 కోసం వారు హిందీ లేదా ఆంగ్ల భాషను ఎంచుకోవాల్సి ఉంటుందని అభ్యర్థులు గుర్తుంచుకోవాలి. హిందీలో సగం, ఇంగ్లీషులో సగం సమాధానాలు రాస్తే వారికి సున్నా మార్కులు వస్తాయి. పరీక్షలో వచ్చిన మార్కులను తిరిగి చూసుకునే సదుపాయం లేదు.
ఇదిలా ఉండగా.. ఇప్పటికే తెలంగాణలో టీఎస్పీఎస్సీ నుంచి విడుదలైన డివిజినల్ అకౌంట్స్ ఆఫీసర్ కు సంబంధించిన పరీక్షను ఫిబ్రవరి 26నే నిర్వహించనున్నారు. పరీక్ష తేదీలను కూడా టీఎస్పీఎస్సీ ప్రకటించింది. దీంతో పాటు.. యూజీసీ నెట్ డిసెంబర్ 2022 సెషన్ పరీక్షలు కూడా ఫిబ్రవరి 21 నుంచి మార్చి 10 వరకు జరగనున్నాయి. ఇలా ఫిబ్రవరి 26నే కేంద్రానికి సంబంధించి యూజీసీ పరీక్ష, ఎస్సెస్సీకి సంబంధించి జూనియర్ ఇంజనీర్ పరీక్షలు ఉండటంతో.. టీఎస్పీఎస్సీ DAO పరీక్షను వాయిదా వేయాలని అభ్యర్థులు టీఎస్పీఎస్సీకి విజ్ఞప్తి చేస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.