Jobs: జ్యూట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే

JCI Recruitment 2020 | జ్యూట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా-JCI లిమిటెడ్ పలు ఖాళీలను భర్తీ చేస్తోంది. నోటిఫికేషన్ వివరాలు తెలుసుకోండి.

news18-telugu
Updated: June 4, 2020, 2:36 PM IST
Jobs: జ్యూట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే
Jobs: జ్యూట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
జ్యూట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా-JCI లిమిటెడ్ ఉద్యోగాల భర్తీకి గతంలో విడుదల చేసిన నోటిఫికేషన్ దరఖాస్తు గడువును పొడిగించింది. ఈ పోస్టులకు దరఖాస్తు గడువు మార్చి 30న ముగిసింది. కానీ కరోనా వైరస్ సంక్షోభం కారణంగా దరఖాస్తు గడువును 2020 జూన్ 8 వరకు పొడిగించింది. హెచ్ఆర్, ఫైనాన్స్, లీగల్ విభాగాల్లో ఎగ్జిక్యూటీవ్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 17 ఖాళీలను ప్రకటించింది. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://www.jutecorp.in/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు. జ్యూట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్‌తో పాటు పశ్చిమ బెంగాల్, బీహార్, అస్సాం, త్రిపుర, ఒడిషా రాష్ట్రాల్లో జ్యూట్ ఉత్పత్తి చేస్తోంది.

JCI Recruitment 2020: నోటిఫికేషన్ వివరాలివే...



మొత్తం ఖాళీలు- 17
ఎగ్జిక్యూటీవ్ (హెచ్ఆర్)- 8
ఎగ్జిక్యూటీవ్ (ఫైనాన్స్)- 8
ఎగ్జిక్యూటీవ్ (లీగల్)- 1
దరఖాస్తుకు చివరి తేదీ- 2020 జూన్ 8విద్యార్హతలు- వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి.
వయస్సు- 35 ఏళ్లు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగులు, మహిళలకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయస్సులో సడలింపు ఉంటుంది.
దరఖాస్తులు పంపాల్సిన అడ్రస్:
DGM (Personnel & Administration),
The Jute Corporation of India Limited,
15N, Nellie Sengupta Sarani,
Kolkata-700 087

నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Job News: మరిన్ని జాబ్స్ &ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి:

HAL Jobs: హిందుస్తాన్ ఏరోనాటిక్స్‌లో జాబ్స్... నోటిఫికేషన్ వివరాలు ఇవే

UPSC Jobs: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల దరఖాస్తుకు గడువు పెంపు

ECIL Jobs: హైదరాబాద్‌లోని ఈసీఐఎల్‌లో ఉద్యోగాలు... నేరుగా ఇంటర్వ్యూ
Published by: Santhosh Kumar S
First published: June 4, 2020, 2:36 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading