• HOME
  • »
  • NEWS
  • »
  • JOBS
  • »
  • JC BOSE UNIVERSITY HAS RECORDED HIGHEST SALARY PACKAGE RS 29 92 LAKH AND PARTICIPATION OF COMPANIES FOR PLACEMENT DRIVE NS

Campus Placements: ఆ యూనివర్సిటీ విద్యార్థికి రూ.30 లక్షల ప్యాకేజీ.. కరోనా కాలంలోనూ క్యూ కట్టిన కంపెనీలు.. వివరాలివే

Campus Placements: ఆ యూనివర్సిటీ విద్యార్థికి రూ.30 లక్షల ప్యాకేజీ.. కరోనా కాలంలోనూ క్యూ కట్టిన కంపెనీలు.. వివరాలివే

ప్రతీకాత్మక చిత్రం

హరియాణా రాష్ట్రానికి చెందిన జేసీ బోస్ యూనివర్సిటీ విద్యార్థులు క్యాంపస్ ప్లేస్ మెంట్లలో సత్తా చాటారు. అత్యధిక వేతనాలతో ఉద్యోగాలు సాధించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

  • Share this:
    ఈ కరోనా కాలంలోనూ ఆ యూనివర్సిటీ విద్యార్థులు అద్భుత ప్రతిభ చాటారు. ఏకంగా రూ.29.92 లక్షల ప్యాకేజీ సాధించి సత్తా చాటారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. హరియాణా రాష్ట్రంలోని ఫరియాబాద్ లోని జేసీ బోస్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, వైఎంసీఏ క్యాంపస్ ను 2020-21 విద్యా సంవత్సరంలో నియామకాల కోసం 225 కంపెనీలు సందర్శించాయి. ఈ సందర్భంగా విద్యార్థులకు అత్యధికంగా రూ.29.92 లక్షల ప్యాకేజీని ఆయా కంపెనీలు ఆఫర్ చేశాయి. ఈ ప్లేస్ మెంట్లలో యూనివర్సిటీకి చెందిన 11 మంది విద్యార్థులు ప్రముఖ టెక్నాలజీ కంపెనీ సాంసంగ్ సంస్థలో ఉద్యోగాలకు ఎంపికయ్యారు. మరో ఆరుగురు విద్యార్థులు ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అయిన అమెజాన్ సంస్థ లో ఉద్యోగాలకు ఎంపికయ్యారు. మరో నలుగురు ప్రముఖ టెలికాం కంపెనీ ఎయిర్టెల్ కంపెనీలో ఉద్యోగాలకు, మరో ఇద్దరు Adobe System, BNY Mellon కంపెనీల్లో ఉద్యోగాలకు ఎంపికయ్యారు. Media.net, Squard Stach తదితర కంపెనీల్లో ఒక్కొక్కరు చొప్పున ఉద్యోగాలకు సాధించారు. వీరిలో అత్యధికంగా మీడియా.నెట్ సంస్థ రూ.29.92 లక్షల సాలరీని విద్యార్థులకు ఆఫర్ చేయడం విశేషం.

    ఈ ప్లేస్మెంట్ల రికార్డు గురించి వైస్ ఛాన్స్ లర్ ప్రొఫేసర్ దినేష్ కుమార్ మాట్లాడుతూ.. ఈ కరోనా సమయంలోనూ తమ విద్యార్థులు అంతర్జాతీయంగా ప్రతిభ చాటారని కొనియాడారు. గొప్ప ప్లేస్మెంట్ రికార్డును వారు సాధించి సత్తా చాటారని అభినందించారు. అనేక టాప్ కంపెనీలు తమ యూనివర్సిటీపై నమ్మకం ఉంచి ఫైనల్ సెమిస్టర్ కన్నా ముందే తమ విద్యార్థులను ఉద్యోగాలకు ఎంపిక చేశాయన్నారు. తమ యూనివర్సిటీక చెందిన అనేక మంది విద్యార్థులు అనేక ప్రతిష్టాత్మకమైన కంపెనీల్లో పి చేస్తున్నారన్నారు. Daikin India, Amazon, Samsung తదితర కంపెనీల్లో తమ విద్యార్థులు పని చేయడంపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు.

    యూనివర్సిటీ ప్లేస్మెంట్ ఆఫీసర్ డా. సంజీవ్ కుమార్ మాట్లాడుతూ.. జూన్ 2021లో కోర్సు పూర్తి చేసుకోబోయే విద్యార్థుల్లో 410 మంది ఇప్పటికే ఉద్యోగాలు సాధించారని చెప్పారు. 2019-20 విద్యాసంవత్సరానికి చెందిన వారిలో 402 మంది ఉద్యోగాలు సాధించారన్నారు. 2019-20లో విద్యార్థులు సాధించిన సరాసరి ప్యాకేజీ రూ. 3.78 లక్షలు అని వెల్లడించారు. ఇప్పుడు ఆ యావరేజ్ ప్యాకేజీ రూ. 4 లక్షలకు చేరిందని సంతోషం వ్యక్తం చేశారు.
    Published by:Nikhil Kumar S
    First published: