అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు గుడ్ న్యూస్. మేనేజ్‌మెంట్ కోర్సులు చేయాలనుకుంటున్న వారికోసం జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ (JNU) 2023-24 అకడమిక్ సెషన్ MBA ప్రోగ్రామ్స్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించింది. అర్హులైన అభ్యర్థులు జేఎన్‌యూ అధికారిక వెబ్‌సైట్ jnuee.jnu.ac.in ద్వారా అప్లై చేసుకోవచ్చు. ఇందుకు చివరి తేదీ 2023 మార్చి 15గా నిర్ణయించారు. అయితే అభ్యర్థులు గేట్-2022 పాసై ఉండాలి.
జేఎన్‌యూ ఎంబీఏ ప్రోగ్రామ్స్ కోసం అప్లై చేసుకోవాలంటే జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అభ్యర్థులు కనీసం 50% మార్కులతో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ డిగ్రీ లేదా అందుకు సమానమైన కోర్సు చేసి ఉండాలి. ఇక, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులు కనీసం 45% మార్కులతో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
* అందుబాటులో ఉన్న ఎంబీఏ కోర్సులు
అకౌంటింగ్ అండ్ ఫైనాన్స్
మార్కెటింగ్
ఆర్గనైజేషన్ బిహేవియర్ అండ్ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్‌మెంట్
ఎంటర్ ప్రెన్యూయర్‌షిప్
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మేనేజ్‌మెంట్
ఆపరేషన్స్ మేనేజ్‌మెంట్ అండ్ క్వాంటిటేటివ్ టెక్నిక్స్
స్ట్రాటజిక్ మేనేజ్‌మెంట్
ఎకనామిక్స్ అండ్ పబ్లిక్ పాలసీ
కాంటెంపరరీ ఇష్యూస్ ఇన్ మేనేజ్‌మెంట్
ప్రతి కోర్సులో కేవలం 75 సీట్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి.
* ఎంపిక ప్రక్రియ
అభ్యర్థుల ఎంపిక రెండు దశల్లో జరుగుతుంది క్యాట్- 2022, గ్రూప్ డిస్కషన్/పర్సనల్ ఇంటర్వ్యూ రౌండ్ ద్వారా అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేయనున్నారు. JNU ఎంబీఏ కోర్సుల్లో అడ్మిషన్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి అర్హులైన అభ్యర్థులు తప్పనిసరిగా CAT 2022లో చెల్లుబాటు అయ్యే స్కోర్ పొంది ఉండాలి.
ఇది కూడా చదవండి : నిరుద్యోగులకు అలర్ట్.. ఈ జాబ్స్‌కు అప్లై చేసుకున్నారో లేదో చెక్ చేయండి..
* అప్లికేషన్ ప్రాసెస్
ముందుగా జేఎన్‌యూ అధికారిక వెబ్‌సైట్ jnuee.jnu.ac.inను విజిట్ చేయాలి. హోమ్ పేజీలో అడ్మిషన్ సెక్షన్‌పై క్లిక్ చేయాలి. అక్కడ అందుబాటులో ఉన్న ఆన్‌లైన్ ఎంబీఏ అడ్మిషన్ లింక్‌పై క్లిక్ చేయాలి.
దీంతో కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అక్కడ ఇంపార్టెంట్ లింక్స్ సెక్షన్ లోకి వెళ్లి, ఎంబీఏ ప్రోగ్రామ్స్ సెషన్ 2023-25 అనే లింక్‌పై క్లిక్ చేయాలి.
న్యూ యూజర్ అయితే అకౌంట్ క్రియేట్ చేసి, రీ లాగిన్ అవ్వండి. దీంతో అప్లికేషన్ ఫారమ్ ఓపెన్ అవుతుంది.
అవసరమైన వివరాలతో అప్లికేషన్ ఫారమ్‌ను ఫిల్‌అప్ చేయండి. ఆ తరువాత అవసరమైన డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేయండి.
అప్లికేషన్‌ను క్రాస్ చెక్ చేసి పేమెంట్ చేయండి. చివరగా అప్లికేషన్‌ను సబ్‌మిట్ చేయండి. భవిష్యత్ అవసరాల కోసం ఈ డాక్యుమెంట్‌ను సేవ్ చేసుకోండి.
* రిజిస్ట్రేషన్ ఫీజు
జనరల్/ఓబీసీ అభ్యర్థులు రిజిస్ట్రేషన్ ఫీజుగా రూ.2,000 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులైతే రూ.1,000 పేమెంట్ చేయాలి. అప్లికేషన్ ఫీజును డెబిట్/క్రెడిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ ద్వారా ఆన్‌లైన్‌లో మాత్రమే చెల్లించాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Career and Courses, EDUCATION, JNU, JOBS, Mba