Home /News /jobs /

JAMIAS FIRST FEMALE VC NAJMA AKHTAR SELECTED FOR PADMA SHRI GH VB

Padma Sri: జామియా మిలియా వర్సిటీ తొలి మహిళా వీసీకి పద్మశ్రీ.. ఈ సందర్భంగా ఆమె ఏమన్నారంటే..

నజ్మా అక్తర్‌

నజ్మా అక్తర్‌

జామియా మిలియా ఇస్లామియా (Jamila Milia Islamia- JMI) యూనివర్సిటీ మొట్టమొదటి మహిళా వైస్‌ ఛాన్సలర్‌గా నియమితులైన నజ్మా అక్తర్‌ మరో ఘనత సాధించారు. ప్రతిష్ఠాత్మక పద్మశ్రీ అవార్డుకు ఆమె ఎంపికయ్యారు.

జామియా మిలియా ఇస్లామియా (Jamila Milia Islamia- JMI) యూనివర్సిటీ మొట్టమొదటి మహిళా వైస్‌ ఛాన్సలర్‌గా నియమితులైన నజ్మా అక్తర్‌ మరో ఘనత సాధించారు. ప్రతిష్ఠాత్మక పద్మశ్రీ అవార్డుకు ఆమె ఎంపికయ్యారు. సాహిత్యం, విద్యారంగం విభాగంలో ఆమె రాష్ట్రపతి నుంచి ఈ అవార్డు స్వీకరిస్తారు. జామియా మాత్రమే కాదు, సెంట్రల్‌ యూనివర్సిటీలు అన్నింట్లోనూ మొదటి మహిళా వైస్‌ ఛాన్సలర్‌ అయిన నజ్మా అక్తర్‌ 1953లో జన్మించారు. విద్యావేత్తగా ఆమెకు అపారమైన అనుభవం ఉంది. జామియాలో చేరకముందు ఆమె యూనివర్సిటీ ఆఫ్ కశ్మీర్‌ వైస్ ఛాన్సలర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఎడ్యుకేషనల్‌ ప్లానింగ్‌ అండ్‌ అడ్మినిస్ట్రేషన్‌ (NIEPA)లో డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఎడ్యుకేషనల్‌ అడ్మినిస్ట్రేషన్‌ విభాగం అధిపతిగా 15 సంవత్సరాలు సేవలందించారు.

అలహాబాద్‌లో మొట్టమొదటి రాష్ట్ర స్థాయి మేనేజ్‌మెంట్‌ సంస్థను నెలకొల్పడం, సీనియర్‌ అధికారుల కోసం NIEPAలో అంతర్జాతీయ ఎడ్యుకేషన్‌ అడ్మినిస్ట్రేషన్‌ కోర్సు ప్రారంభించడం వంటి వాటి ద్వారా ఆమె ఎంతో పేరు తెచ్చుకున్నారు. ఇందిరా గాంధీ నేషనల్‌ ఒపెన్ యూనివర్సిటీ IGNOUలోనూ ఆమె కీలక బాధ్యతలు నిర్వర్తించారు. ఈ ఓపెన్ యూనివర్సిటీలో ఆమె డిస్టెన్స్‌ మోడ్‌లో విద్యావేత్తలకు కోర్సులు రూపొందించారు.

Padma Awards: లిటరేచర్, ఎడ్యుకేషన్ రంగంలో విదేశీ సంస్కృత పండితులకు పద్మ అవార్డులు.. గ్రహీతలు ఎవరంటే..


ఈ అవార్డును నా సహచరులందరి తరపున తీసుకుంటానని నజ్మా అక్తర్‌ అన్నారు. ‘మా సంస్థకు ఇప్పుడు అవార్డు వచ్చింది. కాబట్టి మా బాధ్యతలు ఇంకా పెరిగాయి. మమ్మల్ని మరింత శ్రమించేలా ఈ అవార్డు ప్రేరణగా నిలుస్తుంది. నా పని గుర్తించిన వారందరికీ నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను, ముఖ్యంగా సెంట్రల్‌ యూనివర్సిటీకి మొట్టమొదటి మహిళా వైస్‌-ఛాన్సలర్‌గా నాకు బాధ్యతలు అప్పగించినందుకు రాష్ట్రపతికి నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను’ అని ఆమె పేర్కొన్నారు.

ఉన్నత విద్యా సంస్థల్లో లింగసమానత్వం కోసం ఆమె ఎంతో కృషి చేస్తున్నారు. మా యూనివర్సిటీలో మహిళల ప్రవేశాలు 50 శాతం ఉండేలా చూడటం తన లక్ష్యమని నజ్మా అన్నారు. అంతే కాదు జామియాలో మెడికల్‌ కాలేజీ ఏర్పాటు చేయాలన్నది తన లక్ష్యమని ఆమె వివరించారు.

అలీగఢ్‌ ముస్లిం యూనివర్సిటీ నుంచి గోల్డ్‌ మెడల్‌ సాధించిన నజ్మా అక్తర్‌, కురుక్షేత్ర యూనివర్సిటీ నుంచి ఎడ్యుకేషన్‌లో PhD చేశారు. యూనివర్సిటీ ఆఫ్‌ వార్‌విక్‌, పారిస్‌లోని యూనెస్కోకు చెందిన ఇంటర్నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆప్‌ ఎడ్యూకేషన్‌ ప్లానింగ్‌ (IIEP)లో ఆమె శిక్షణ పొందారు.

ఈ సంవత్సరం పద్మ అవార్డులకు 128 మందిని ప్రభుత్వం ఎంపిక చేసింది. మొత్తం నలుగురు పద్మవిభూషణ్‌, 17 మంది పద్మభూషణ్‌, 107 మంది పద్మశ్రీ అవార్డులు అందుకోనున్నారు. వీరిలో 34 మంది మహిళలు ఉన్నారు. విదేశీయులు, ఎన్‌ఆర్‌ఐ, పీఐఓ, ఓసీఐ శ్రేణిలో 10 మంది ఉన్నారు. 13 మంది మరణానంతరం ఈ అవార్డుకు ఎంపికయ్యారు.
Published by:Veera Babu
First published:

Tags: Padma Awards

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు