Home /News /jobs /

JAMIA HAMDARD INTRODUCES NEW MSC PROGRAMME IN MEDICAL VIROLOGY HERE FULL DETAILS NS GH

Jamia Hamdard New Course: మెడికల్‌ వైరాలజీలో కొత్త ఎమ్మెస్సీ ప్రోగ్రామ్‌.. ప్రకటించిన జామియా హమ్‌దర్ద్ విశ్వవిద్యాలయం‌.. వివరాలివే

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

ఢిల్లీలోని జామియా హమ్‌దర్ద్ యూనివర్సిటీ మరో కొత్త కోర్సును ప్రకటించింది. మెడికల్‌ వైరాలజీ విభాగంలో కొత్త పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సును అందుబాటులోకి తీసుకొచ్చింది. వివరాలు ఇలా ఉన్నాయి.

ప్రస్తుత అవసరాలకు తగ్గట్లు కొత్త కోర్సులను డిజైన్ చేస్తున్నాయి మెడికల్ వర్సిటీలు. తాజాగా ఢిల్లీలోని జామియా హమ్‌దర్ద్ యూనివర్సిటీ మరో కొత్త కోర్సును ప్రకటించింది. మెడికల్‌ వైరాలజీ విభాగంలో కొత్త పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సును అందుబాటులోకి తీసుకొచ్చింది. 2021 -2022 విద్యా సంవత్సరానికిగాను ఈ ఎమ్మెస్సీ ప్రోగ్రామ్‌ను తీసుకొస్తున్నట్లు సంస్థ తెలిపింది. దీని ద్వారా వైరస్‌ బయాలజీలో కొత్త విషయాలు, సెల్యులార్‌ ఫంక్షన్‌ లాంటి వాటిపై మరిన్ని పరిశోధనలు చేయొచ్చని ప్రకటించింది. వైరల్‌ ఇన్ఫెక్షన్‌లో మెథడాలజీ, ట్రీట్‌మెంట్‌ లాంటి వాటిలో కొత్త వివరాలు తీసుకొచ్చేందుకు ఈ ప్రోగ్రామ్‌ తీసుకొస్తున్నారు. ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి సైన్స్‌లో అండర్‌ గ్రాడ్యుయేషన్ డిగ్రీ పూర్తి చేసుకున్న వాళ్లు, మైక్రో బయాలజీ, లైఫ్‌ సైన్సెస్‌, బయో సైన్స్‌, బయోటెక్నాలజీ, బయో కెమిస్ట్రీ, కెమిస్ట్రీ, బీవీఎస్సీ, బీఎస్సీ మెడికల్‌ లేబొరేటరీ టెక్నాలజీ, బయో టెక్నాలజీలో బీటెక్‌, ఎంబీబీఎస్ చేసిన వారు ఎమ్మెస్సీ మెడికల్‌ వైరాలజీ కోర్సుకు అప్లై చేయొచ్చు. అయితే ముందు చెప్పిన కోర్సులు/తరగతుల్లో కనీసం 50 శాతం మార్కులు తెచ్చుకుని ఉండాలి. ఈ కొత్త ఎమ్మెస్సీ ప్రోగ్రామ్‌ కోసం దరఖాస్తు చేసుకోవడానికి ఆఖరి తేదీ సెప్టెంబరు 15.
NEET PG: ఆగస్టు 16 నుంచి నీట్​ పీజీ రిజిస్ట్రేషన్​, ఎడిట్ విండో ప్రారంభం.. పూర్తి వివరాలివే!
IIT Madras: ఐఐటీ మద్రాస్‌ తాజా ప్రకటన.. ఆన్‌లైన్ డేటా సైన్స్ ప్రోగ్రాం తదుపరి బ్యాచ్‌కు దరఖాస్తుల ఆహ్వానం

అభ్యర్థులు jamiahamdard.edu వెబ్‌సైట్‌లోకి వెళ్లి ఆన్‌లైన్‌ అప్లికేషన్‌ను యాక్సెస్‌ చేసి, ఫిల్ చేయొచ్చని విశ్వవిద్యాలయం తెలిపింది. లేదంటే jamiahamdard.nopaperforms.com అడ్మిషన్‌ పోర్టల్‌లో కూడా అప్లై చేయొచ్చు. ఎమ్మెస్సీ వైరాలజీ ప్రోగ్రామ్‌ ద్వారా రీజనింగ్‌, స్కిల్స్‌, అడ్వాన్స్‌డ్‌ నాలెడ్జ్‌ విభాగాలపై దృష్టి సారిస్తున్నట్లు యూనివర్సిటీ పేర్కొంది. వైరాలజీ రీసెర్చి, డయాగ్నసిస్‌, ట్రీట్మెంట్స్‌లో వివిధ మోడల్స్‌, టూల్స్‌ విషయంలో అవగాహన పెంచుకోవడానికి, అదనపు పరిజ్ఞానం కోసం ఈ వైరాలజీ ప్రోగ్రామ్‌ ఉపయోగపడనుంది.

ఈ ఆబ్జెక్టివ్‌ కోర్సులో బేసిక్‌ బయాలజీ, వైరస్ లైఫ్‌ సైకిల్స్‌లో వివిధ దశల ఇన్నోవేటివ్‌ రీసెర్చ్‌ లాంటివి ఉంటాయి. వైరస్‌ల స్ట్రక్చర్‌, ప్రాపర్టీస్‌, న్యూరిసింగ్‌ కమ్యూనికేషన్‌, కొలాబరేషన్‌ ఉన్న శాస్త్రవేత్తలతో దీనిపై శిక్షణ ఉంటుంది అని జామియా హమ్‌దర్ద్ విశ్వవిద్యాలయం చెబుతోంది. కోర్సు నిపుణుల్లో వైరాలజిస్ట్‌లు, మాలిక్యులర్‌ బయోలజిస్ట్‌లు, కంప్యూటేషనల్‌ బయోలజిస్ట్‌లు, ఎపిడమాలజిస్ట్‌లు, క్లీనిషియన్స్‌ ఉంటారు. మరిన్ని వివరాలు విశ్వవిద్యాలయం వెబ్‌సైట్‌లో పూర్తిగా చూడొచ్చు.
Published by:Nikhil Kumar S
First published:

Tags: Medical college, University exams

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు