మేనేజ్మెంట్ కోర్సులు (Management Courses) చదవాలనుకునే విద్యార్థుల (Students)కు గుడ్‌న్యూస్ చెప్పింది బెంగళూరు కేంద్రంగా పనిచేసే జగదీష్ సేత్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్(JAGSoM). కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ-2020కి అనుగుణంగా ఈ సంస్థ ఫుల్ టైమ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్ ప్రారంభించింది. రెండు సంవత్సరాల PGDM ప్రోగ్రామ్స్, డ్యుయల్ డిగ్రీ ఇంటర్నేషనల్ MBA ప్రోగ్రామ్ కోర్సులకు ఇన్స్టిట్యూట్ అడ్మిషన్లను కూడా ప్రారంభించింది. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన విద్యార్థులతో పాటు మెరిట్ స్టూడెంట్స్‌కు ఏకంగా రూ.2.64 కోట్ల విలువైన స్కాలర్షిప్లను ప్రకటించింది.
* కెరీర్ అవకాశాలు
ఇన్స్టిట్యూట్ PGDM ప్రోగ్రామ్ పాఠ్యాంశాలను 4.0 ఫీచర్‌తో పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా 'లెర్నింగ్ బై సాల్వింగ్' అనే స్పెషల్ టీచింగ్ మోడ్‌లో డెలివరీ చేయనున్నారు. PGDM ప్రోగ్రామ్ పూర్తి చేసిన తరువాత మార్టెక్, సేల్స్ అండ్ సర్వీస్, ఫిన్‌టెక్, క్యాపిటల్ మార్కెట్స్, బ్యాంకింగ్, బిజినెస్ అనలిటిక్స్, హెచ్ఆర్-డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ వంటి రంగాల్లో కెరీర్ అవకాశాలు పొందుతారు.
* ఫస్ట్ ఇయర్ గ్రేటర్ ముంబై క్యాంపస్‌లో
ఈ సంస్థ ఇంటర్నేషనల్ MBA కోర్సును కూడా ఆఫర్ చేస్తోంది. ఇది మేనేజ్మెంట్లో టూ ఇయర్స్ డ్యుయల్ డిగ్రీ మాస్టర్స్ ప్రోగ్రామ్. మొదటి సంవత్సరం తరగతులను ఇన్ స్టిట్యూట్‌కు చెందిన గ్రేటర్ ముంబై క్యాంపస్‌లో నిర్వహించనున్నారు. రెండో సంవత్సరం ప్రోగ్రామ్‌ను ఇన్స్టిట్యూట్కు చెందిన స్టేట్ యూనివర్సిటీ ఆఫ్ న్యూయార్క్, అల్బానీ (USA), యూనివర్సిటీ ఆఫ్ వోలోన్గాంగ్, సిడ్నీ బిజినెస్ స్కూల్, ఫ్రాన్స్‌లోని కెడ్జ్ బిజినెస్ స్కూల్ వంటి ఏదో ఒక దాంట్లో నిర్వహించనున్నారు.
* గ్లోబల్ ఎక్స్పోజర్ లక్ష్యంగా..
న్యూ-ఏజ్ కంపెనీలలో భవిష్యత్ కెరీర్ కోసం లెర్నర్స్ను ‘టీ-షేప్’ నిపుణులుగా మార్చడం, అందుకు అవసరమైన గ్లోబల్ ఎక్స్పోజర్ను అందించడమే ఈ కోర్సుల లక్ష్యమని ఇన్స్టిట్యూట్ పేర్కొంది. ఫక్షనాలిటీ, స్పెషాలిటీ లేదా క్రమశిక్షణ పరంగా ఇన్డెప్త్తో కోర్ ఏరియా వెలుపల విస్తృతంగా పని చేసే సామర్థ్యం ఉన్న వారిని టీ షేప్ నిపుణులు అంటారు.
ఇది కూడా చదవండి : టెలికాం రంగంలో కొలువులే కొలువులు.. 5G రాకతో రానున్న ఉద్యోగాలెన్నో తెలుసా?
జగదీష్ సేత్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ పేరు గతంలో IFIM ఇన్స్టిట్యూట్గా ఉండేది. ఇక్కడ విద్యార్థులు వృత్తిపరమైన లక్ష్యాలకు అనుగుణంగా కెరీర్ ఆప్షన్ సెలక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే పరిశ్రమ అవసరాలకు సరిపోయే సామర్థ్యాలు, నైపుణ్యాలను విద్యార్థులు పొందవచ్చు. టాలెంట్ ఉన్న విద్యార్థులకు ఆర్థిక సాయంగా స్కాలర్షిప్స్ కూడా అందుబాటులో ఉన్నాయని సంస్థ చైర్మన్ సంజయ్ పడోడ్ తెలిపారు. ఆర్థికంగా వెనుకబడి, ప్రతిభావంతులైన విద్యార్థులకు ట్యూషన్, బోర్డింగ్, లాడ్జింగ్ను కవర్ చేసే మెరిట్ స్కాలర్షిప్లను మంజూరు చేస్తామని చెప్పారు. JAGSoM గత సంవత్సరం వరకు రూ.1.5 కోట్ల విలువైన స్కాలర్షిప్లను అందించిందన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Career and Courses, EDUCATION, JOBS, Scholarship