2020-21 ఏడాదికి గానూ జనవరి 9వ తేదీన జగనన్న అమ్మ ఒడి పథకం రెండో విడత ఆర్థిక సాయం సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా అందివ్వనున్నట్లు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. రెండో ఫేజ్ చెల్లింపుల్లో భాగంగా షెడ్యూల్ ను మంత్రి ప్రకటించారు. ఇప్పటికే పాఠశాలల్లో అర్హులైన విద్యార్థుల తల్లిదండ్రులు, సంరక్షకుల పేర్లు నమోదుచేపట్టామన్నారు. డిసెంబర్ 16న అర్హుల జాబితాను వార్డు, గ్రామ సచివాలయల్లో ప్రదర్శనకు పెడతామన్నారు. చదువుకు పేదరికం అడ్డురాకూడదనే ఉద్దేశంతో సీఎం జగన్మోహన్ రెడ్డి... జగనన్న అమ్మ ఒడి పథకానికి శ్రీకారం చుట్టారన్నారు. ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకూ చదువుతున్న పేద విద్యార్థుల తల్లిదండ్రులకు ఈ పథకం కింద రూ.15 వేల ఆర్థిక సాయం అందిస్తామన్నారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలు, ఎయిడెడ్ అన్ ఎయిడెడ్, ప్రభుత్వ గురుకుల పాఠశాలలో చదివే విద్యార్థులకు ఈ పథకం వర్తింపజేస్తామన్నారు. ఇప్పటికే జగనన్న అమ్మ ఒడి పథకం కింద మొదటి విడతగా 43,54,600లపైగా లబ్ధిదారులకు రూ.6.336 కోట్లు అందజేశామన్నారు. 2020-21 ఏడాదికి గానూ కుల, మత, ప్రాంతాలకు అతీతంగా, పారదర్శకంగా...అవినీతికి ఆస్కారం లేకుండా లబ్ధిదారుల ఎంపిక జరుగుతోందన్నారు. ఇప్పటికే అర్హులైన విద్యార్థులు తల్లిదండ్రులు, సంరక్షకుల పేర్ల నమోదు ప్రక్రియ ఈ నెల 10 తేదీ నుంచి ప్రారంభమైందన్నారు. ఈ నెల 20 వరకూ ఈ నమోదు ప్రక్రియ కొనసాగుతుందన్నారు.
Jagananna Thodu: ‘జగనన్న తోడు’ పథకంలో డబ్బులు పొందాలంటే ఉండాల్సిన అర్హతలు, దరఖాస్తు విధానం
పరిటాల రవి కుటుంబం ఆశలపై నీళ్లు చల్లిన సీఎం జగన్
ఉద్యోగులకు బ్యాడ్ న్యూస్.. 2021 ఏప్రిల్ నుంచి మీ టేక్ హోమ్ జీతం తగ్గబోతోంది..
పాదర్శకంగా ‘జగనన్న అమ్మ ఒడి’ అమలు
అర్హులైన విద్యార్థుల తల్లిదండ్రులు, సంరక్షకులు తమ పేర్లను నమోదు చేసుకునే సమయంలో ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా నెంబరు, రేషన్ కార్డు అందజేయాలని మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. కులం, ప్రాంతం, వివక్ష లేకుండా ఈ పథకం అమలు చేస్తున్నామన్నారు. జనవరి 9వ తేదీన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా జగనన్న అమ్మ ఒడి రెండో విడత ఆర్థికసాయం అందజేస్తామన్నారు. లబ్ధిదారుల ఎంపిక కోసం షెడ్యూల్ రూపొందించామన్నారు.
TATA Cars offers: డిసెంబర్‌లో టాటా కార్ల బంపర్ ఆఫర్.. డిస్కౌంట్ డబ్బులతో బైక్ కూడా కొనొచ్చు
ఇలాంటి లక్షణాలుంటే Demisexual అంటారు.. మీలో ఉన్నాయేమో చెక్ చేసుకోండి
విమానంలో సెక్స్, అమ్మకానికి లో దుస్తులు.. సోషల్ మీడియాలో ఎయిర్ హోస్టెస్ దుమారం
వరుస సంఖ్య తేదీ కార్యక్రమం
డిసెంబర్ 20 వరకు అర్హులై విద్యార్థుల తల్లిదండ్రులు, సంరక్షకుల పేర్ల నమోదు
డిసెంబర్ 16న అర్హులైన విద్యార్థుల తల్లిదండ్రులు, సంరక్షకుల జాబితాలను వార్డు సచివాలయాలు, గ్రామ సచివాయల్లో ప్రదర్శన
డిసెంబర్ 19న ప్రదర్శనకు ఉంచిన జాబితాలో తప్పొప్పుల సవరణ అనంతరం అదే రోజు సాయంత్రం 6 గంటలకు అమ్మ ఒడి పోర్టల్ ప్రదర్శన
డిసెంబర్ 20 నుంచి 24 వరకు సంబంధిత పాఠశాల, కళాశాల ప్రధానోపాధ్యాయులు, ప్రిన్సిపాళ్లతో పాటు వార్డు, గ్రామ సచివాలయాల సిబ్బంది చే సవరించిన జాబితా పరిశీలన
డిసెంబర్ 26న తుది సవరణ అనంతరం జాబితాలను వార్డు, గ్రామ సచివాలయాల్లో ప్రదర్శన
డిసెంబర్ 27, 28 తేదీల్లో తుది సవరణ జాబితాలను గ్రామ, వార్డు సభల్లో ఆమోదం
డిసెంబర్ 29న గ్రామ సభల ద్వారా ఆమోదం పొందిన జాబితాలను ప్రధానోపాధ్యాయులు, ప్రిన్సిపాళ్లచే ఆన్ లైన్లో పొందుపర్చాలి.
డిసెంబర్ 30న ప్రధానోపాధ్యాయులు, ప్రిన్సిపాళ్లు ద్వారా వచ్చిన ఫైనల్ జాబితాలను ఆయా జిల్లా డీఈవోలు.. కలెక్టర్లకు పంపాలని నిర్ణయించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, Navaratnalu