కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖకు చెందిన ప్రభుత్వ రంగ సంస్థ ఐటీఐ లిమిటెడ్‌లో ఉద్యోగాల భర్తీ జరుగుతోంది. మిడిల్, సీనియర్ లెవెల్ మేనేజ్మెంట్లో ఫైనాన్స్ ఎగ్జిక్యూటీవ్, హెచ్ఆర్ ఎగ్జిక్యూటీవ్ ట్రైనీ లాంటి పోస్టులున్నాయి. మొత్తం 84 ఖాళీలను ప్రకటించింది ఐటీఐ లిమిటెడ్. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. దరఖాస్తు ప్రక్రియ గతంలోనే ముగిసింది. కానీ కరోనావైరస్ సంక్షోభం కారణంగా దరఖాస్తు గడువును 2020 మే 5 వరకు పొడిగించారు. ఈ పోస్టులకు సంబంధించిన మరిన్ని వివరాలను http://www.itiltd.in/ వెబ్సైట్లో చూడొచ్చు.
ITI Limited Recruitment 2020: ఖాళీల వివరాలివే...
మొత్తం పోస్టులు- 84
ఫైనాన్స్ ఎగ్జిక్యూటీవ్- 9
ఫైనాన్స్ ఎగ్జిక్యూటీవ్ ట్రైనీ- 8
హెచ్ఆర్ ఎగ్జిక్యూటీవ్ ట్రైనీ- 16
చీఫ్ మేనేజర్ / డిప్యూటీ జనరల్ మేనేజర్ / అడిషనల్ జనరల్ మేనేజర్ (ఆర్ అండ్ డీ)- 1
సీఎంఆర్ / జనరల్ మేనేజర్ / అడిషనల్ మేనేజర్ (లీగల్)- 1
మేనేజర్ / చీఫ్ మేనేజర్ / డిప్యూటీ జనరల్ మేనేజర్ (హెచ్ఆర్)- 8
మేనేజర్ / చీఫ్ మేనేజర్ / డిప్యూటీ జనరల్ మేనేజర్ (ఫైనాన్స్)- 8
మేనేజర్ / చీఫ్ మేనేజర్ / డిప్యూటీ జనరల్ మేనేజర్ (టెక్నికల్)- 8
డిప్యూటీ మేనేజర్ / మేనేజర్ (టెక్నికల్ అసిస్టెంట్ టు సీఎండీ)- 1
మేనేజర్ / చీఫ్ మేనేజర్ / డిప్యూటీ జనరల్ మేనేజర్ (ఆర్ అండ్ డీ)- 4
డిప్యూటీ జనరల్ మేనేజర్ / అడిషనల్ జనరల్ మేనేజర్ (పీఆర్)- 1
జనరల్ మేనేజర్ (ఫైనాన్స్)- 1
జనరల్ మేనేజర్ (హెచ్ఆర్)- 1
చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్-స్టార్టప్ హబ్ (జనరల్ మేనేజర్)- 1
ప్రాజెక్ట్ హెడ్- సెల్ టెక్నాలజీ (అడిషనల్ జనరల్ మేనేజర్)- 1
ప్రాజెక్ట్ హెడ్- డేటా సెంటర్ (అడిషనల్ జనరల్ మేనేజర్)- 1
ITI Limited Recruitment 2020: గుర్తుంచుకోవాల్సిన అంశాలు
దరఖాస్తుకు చివరి తేదీ- 2020 మే 5 సాయంత్రం 5.30 గంటలు
పోస్టులో దరఖాస్తులు పంపడానికి చివరి తేదీ- 2020 మే 9
విద్యార్హతలు- సీఏ / ఐసీడబ్ల్యూఏ, ఎంబీఏ, బీఈ / బీటెక్, పోస్ట్ గ్రాడ్యుయేట్.
ఎంపిక విధానం- దరఖాస్తుల షార్ట్‌లిస్టింగ్, పర్సనల్ ఇంటర్వ్యూ
దరఖాస్తు ఫీజు రూ.300. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు లేదు.
దరఖాస్తు విధానం- http://www.itiltd.in/ వెబ్సైట్లో ఆన్లైన్లో 2020 మే 5 లోగా దరఖాస్తు చేయాలి. దరఖాస్తుల్ని ప్రింట్ తీసి 2020 మే 9 లోగా నోటిఫికేషన్లో వెల్లడించిన అడ్రస్‌కు పంపాలి.
దరఖాస్తులు పంపాల్సిన అడ్రస్:
Additional General Manager,
ITI Limited,
Registered and Corporate Office,
ITI Bhavan, Dooravani Nagar,
Bengaluru-560016
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.