హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

ITBP Constable Recruitment 2022: ఐటీబీపీ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. అర్హత ప్రమాణాలు, ఎంపిక ప్రక్రియ, ఇతర వివరాలు ఇవే..

ITBP Constable Recruitment 2022: ఐటీబీపీ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. అర్హత ప్రమాణాలు, ఎంపిక ప్రక్రియ, ఇతర వివరాలు ఇవే..

ITBP Constable Recruitment 2022

ITBP Constable Recruitment 2022

ITBP: ఐటీబీపీ కానిస్టేబుల్ పరీక్ష మొత్తం 100 మార్కులకు ఉంటుంది. జనరల్ నాలెడ్జ్, ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్, అనలిటికల్ ఆప్టిట్యూడ్, బేసిక్ నాలెడ్జ్ ఇన్ ఇంగ్లీష్, అండ్ హిందీ సబ్జెక్టుల నుంచి 25 చొప్పున ప్రశ్నలు ఉంటాయి.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

భారత రక్షణ దళాల్లోని ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ (ITBP) విభాగంలో కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత ఉన్న అభ్యర్థులు ఐటీబీపీ అధికారిక వెబ్‌సైట్ recruitment.itbpolice.nic.in ద్వారా ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా గ్రూప్- సీ, నాన్ గెజిటెడ్ (నాన్- మినిస్టీరియల్) కానిస్టేబుల్(యానిమల్ ట్రాన్స్ ఫోర్ట్) పోస్టులు భర్తీ చేయనున్నారు. మొత్తం 52 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ (Notification) జారీ చేశారు. రిజిస్ట్రేషన్ (Registration) ప్రక్రియ ఇప్పటికే (2022, ఆగస్టు 29) ప్రారంభం కాగా, దరఖాస్తులు సమర్పించడానికి చివరి తేదీ 2022, సెప్టెంబర్ 27.


* ఐటీబీపీ కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్- 2022: ముఖ్యమైన తేదీలు


ఆన్‌లైన్ అప్లికేషన్స్ ప్రారంభ తేదీ- 2022, ఆగస్టు 29


దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేదీ- 2022, సెప్టెంబర్ 27


* ఐటీబీపీ రిక్రూట్‌మెంట్-2022: ఖాళీల వివరాలు


కానిస్టేబుల్ (యానిమల్ ట్రాన్స్‌పోర్ట్): 52 పోస్టులు (పురుషులు: 44, స్త్రీలు: 8)


** అర్హత ప్రమాణాలు


* ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్
కానిస్టేబుల్ పోస్టుకు దరఖాస్తు చేసుకోవాలంటే అభ్యర్థులు, గుర్తింపు పొందిన బోర్డు నుంచి పదో తరగతి పూర్తి చేసి ఉండాలి. లేదా అందుకు సమానమైన కోర్సు చేసి ఉండాలి.


* వయోపరిమితి

కానిస్టేబుల్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు తప్పనిసరిగా 18- 25 సంవత్సరాల మధ్య ఉండాలి.


* పే స్కేల్

7వ సీపీసీ ప్రకారం.. పే మ్యాట్రిక్స్‌ ఇన్ లెవల్- 3: రూ.21700-69100


* అప్లికేషన్ ఫీజు

జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ.100 అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. అదే ఎస్సీ, ఎస్టీ, ఎక్స్‌సర్వీస్‌ మెన్, మహిళా అభ్యర్థులైతే ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.


* ఎంపిక ప్రక్రియ

ఐటీబీపీ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ ఆరు దశల్లో ఉంటుంది.


- ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్


-ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్


- రాత పరీక్ష


-స్కిల్ టెస్ట్


-డాక్యుమెంటేషన్


- డీటైల్డ్ మెడికల్ ఎగ్జామినేషన్ అండ్ రివ్యూ మెడికల్ ఎగ్జామినేషన్* అప్లికేషన్ ప్రాసెస్


స్టెప్-1: ఐటీబీపీ అధికారిక వెబ్‌సైట్ itbpolice.nic.in ను సందర్శించాలి.


స్టెప్-2: హోమ్ పేజీలో లాగిన్ ఆప్షన్‌పై క్లిక్ చేయండి


స్టెప్-3: ఆ తరువాత కొత్త పేజీ స్క్రీన్‌పై డిస్‌ప్లే అవుతుంది


స్టెప్ -4: మీరు ఇప్పటికే రిజిస్టర్ అయి ఉంటే.. రిజిస్ట్రర్ నంబర్‌తో లాగిన్ కావచ్చు. మీరు కొత్త అభ్యర్థి అయితే, ముందుగా రిజిస్టర్ అవ్వండి


స్టెప్-5: అప్లికేషన్ ఫారమ్‌ను నింపండి.


స్టెప్-6: చివరగా అప్లికేషన్ ఫీజు చెల్లించి, దరఖాస్తును సబ్‌మిట్ చేయండి.


* పరీక్ష విధానం

ఐటీబీపీ కానిస్టేబుల్ పరీక్ష మొత్తం 100 మార్కులకు ఉంటుంది. జనరల్ నాలెడ్జ్, ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్, అనలిటికల్ ఆప్టిట్యూడ్, బేసిక్ నాలెడ్జ్ ఇన్ ఇంగ్లీష్, అండ్ హిందీ సబ్జెక్టుల నుంచి 25 చొప్పున ప్రశ్నలు ఉంటాయి.

Published by:Sridhar Reddy
First published:

Tags: Career and Courses, Central Government Jobs, Itbp, JOBS

ఉత్తమ కథలు