హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Group 4 Notification: గ్రూప్ 4 నోటిఫికేషన్ కు రంగం సిద్ధం.. సమావేశంలో కీలక నిర్ణయాలు..

Group 4 Notification: గ్రూప్ 4 నోటిఫికేషన్ కు రంగం సిద్ధం.. సమావేశంలో కీలక నిర్ణయాలు..

Group 4 Notification: గ్రూప్ 4 నోటిఫికేషన్ కు రంగం సిద్ధం.. సమావేశంలో కీలక నిర్ణయాలు..

Group 4 Notification: గ్రూప్ 4 నోటిఫికేషన్ కు రంగం సిద్ధం.. సమావేశంలో కీలక నిర్ణయాలు..

తెలంగాణలో ఉద్యోగాల జాతర మొదలైంది. ఈ ఏడాది మార్చిలో సీఎం కేసీఆర్ అసెంబ్లీలో 80వేలకు పైగా పోస్టులను భర్తీ చేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిలో భాగంగానే పోలీస్, గ్రూప్ 1 పోస్టులకు నోటిఫికేషన్లు జారీ అయ్యాయి.

  • News18 Telugu
  • Last Updated :
  • Telangana, India

తెలంగాణలో(Telangana) ఉద్యోగాల జాతర మొదలైంది. ఈ ఏడాది మార్చిలో సీఎం కేసీఆర్ అసెంబ్లీలో 80వేలకు పైగా పోస్టులను భర్తీ చేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిలో భాగంగానే పోలీస్, గ్రూప్ 1 పోస్టులకు నోటిఫికేషన్లు(Notifications) జారీ అయ్యాయి. తర్వాత చాలా కాలంగా ఎలాంటి నోటిఫికేషన్లు రాలేదు. ప్రత్యేక అర్హతతో కూడిన ఆరు నుంచి 7 నోటిఫికేషన్ల వరకు టీఎస్పీఎస్సీ విడుదల చేసింది. దీనిలో జనరల్ డిగ్రీతో కూడిన నోటిఫికేషన్లు విడుదల కాలేదు. దీంతో నిరుద్యోగులు నిరాశకు గురయ్యారు. అయితే.. గ్రూప్ 2, 3 పోస్టులకు సంబంధించి రెండు నెలల క్రితం ఆర్థిక శాఖ నుంచి అనుమతులు వచ్చినా.. నోటిఫికేషన్లు మాత్రం రాలేదు. తాజాగా గ్రూప్ 4 కు సంబంధించి 9,168 పోస్టుల భర్తీకి శుక్రవారం ఆర్థికశాఖ అనుమతి ఇచ్చింది. దీంతో ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న నిరుద్యోగులు(Un Employees) సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Huge Vacancies: అతి భారీ నోటిఫికేషన్.. 24 వేల నుంచి 45 వేలకు పెంచిన కానిస్టేబుల్ పోస్టులు..

గ్రూప్ 4 ఉద్యోగాలకు ఈ సారి 10 లక్షల వరకు దరఖాస్తులు వచ్చే అవకాశాలు కనిస్తున్నాయి. ఇక గ్రూప్ 4 పోస్టులకు ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చిన నేపథ్యంలో తెలంగాణ స్టేట్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ) సమావేశమైంది. దీనిలో నోటిఫికేషన్‌, రోస్టర్‌ తదితర అంశాలపై చర్చించింది.గతంలో ఆరు శాతం ఉన్న గిరిజన రిజర్వేషన్లను రాష్ట్ర ప్రభు త్వం 10 శాతానికి పెంచింది. తద్వారా గిరిజనులకు 6 శాతంగా ఉన్న రోస్టర్‌ పాయింట్లు.. ప్రస్తుతం 10 శాతానికి పెరిగాయి. కొత్తగా మారనున్న రిజర్వేషన్లపై టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌ జనార్దన్‌రెడ్డితోపాటు సభ్యులు చర్చించారు. దీనిలో గ్రూప్‌-2, 3, 4 ఉద్యోగాల భర్తీకి టీఎస్‌పీఎస్సీ కసరత్తు చేస్తున్నది. గతంలో గ్రూప్‌-2, 3, 4లో ఉన్న పోస్టులేంటి.. కొత్తగా జతచేసిన పోస్టులెన్ని అనే అంశాలపై చర్చించారు.

మరో సారి వీటిపై సోమవారం ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. అన్ని శాఖల అధికారులు ఇండెంట్లతో సమావేశానికి రావాలని టీఎస్‌పీఎస్సీ ఆదేశించినట్టు తెలిసింది. ఈ సమావేశాల్లోనే గ్రూప్ 2, 3 ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ ఎప్పుడు విడుదల చేసే విషయంపై కూడా చర్చించనున్నారు. అయితే.. ఇటీవల జరిగిన సమావేశంలో రెండు వారాల్లోనే గ్రూప్ 4 నోటిఫికేషన్ విడుదల చేసేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు కమిషన్ కు అధికారులు ఆదేశించారు. ఈ నోటిఫికేషన్ తర్వాత వారం నుంచి 10 రోజుల వరకు గడువు తీసుకొని గ్రూప్ 2 తర్వాత గ్రూప్ 3 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్లను విడుదల చేయనున్నారు. వీటిపై అధికారులు క్షేత్రస్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు.

First published:

Tags: Group 4, Telangana, Telangana government jobs, TSPSC

ఉత్తమ కథలు