తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన Telangana State Southern Power Distribution Company Limited (TSSPDCL) 1000 జూనియర్ లైన్ మెన్ పోస్టుల భర్తీకి త్వరలోనే కొత్త నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఇటీవల జూనియర్ లైన్ మెన్ ఉద్యోగాల భర్తీకి అధికారులు ఇటీవల జాబ్ నోటిఫికేషన్
విడుదల చేశారు. ఈ ఉద్యోగాలకు (Jobs) దరఖాస్తు పక్రియ మే 19 నుంచి ప్రారంభం కాగా.. జూన్ 8 వరకు దరఖాస్తులను ఆహ్వానించారు. తర్వాత అభ్యర్థులకు జులై 17న రాత పరీక్ష నిర్వహించారు. ఐతే ఈ పరీక్షకు(Exam) హాజరైన అభ్యర్ధుల్లో కొంతమంది వద్ద నుంచి రాష్ట్ర విద్యుత్ సంస్థలకు చెందిన కొందరు ఉద్యోగులు డబ్బులు వసూలు చేసి మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. దీనిపై విచారణ చేపట్టి.. నోటిఫికేషన్ ను రద్దు చేశారు. దీనిలో 181 మందికి ఐదుగురు ఉద్యోగులు సమాధానాలు చేరవేసినట్లు రాచకొండ పోలీస్ బృందం విచారణలో తెలియజేశారు.
ఆ ఐదుగురిని ఉద్యోగం నుంచి సస్పెండ్ చేశారు. ఇప్పటికే సబ్ ఇంజనీర్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు సోమవారం నియామక పత్రాలను అందజేయడంతో, ఈ పోస్టుల భర్తీ ప్రక్రియ దాదాపుగా ముగిసినట్లైంది. అయితే గతంలో రద్దైన ఈ వెయ్యి పోస్టుల లైన్ మెన్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ జారీపై సంస్థ యాజమాన్యం కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. నవంబర్ నెలాఖరులోగా.. లేదా వచ్చే నెల మొదటి వారంలో ఈ పోస్టులకు నోటిఫికేషన్ రానుంది. అయితే రద్దైన నోటఫికేషన్ కు సంబంధించి అప్లికేషన్ ఫీజు చెల్లించిన వాళ్లు ఈ కొత్త నోటిఫికేషన్ విడుదల తర్వాత మళ్లీ పీజులు చెల్లించి దరఖాస్తు చేసుకోవాలని అధికార వర్గాలు చెబుతున్నాయి.
జిల్లాల వారీగా పోస్టుల వివరాలు..
జిల్లా | ఖాళీలు |
మహబూబ్ నగర్ | 43 |
నారాయణపేట్ | 18 |
వనపర్తి | 19 |
నాగర్ కర్నూల్ | 31 |
గద్వాల్ | 13 |
నల్లగొండ | 61 |
సూర్యాపేట్ | 48 |
యాదాద్రి | 44 |
మెదక్ | 27 |
సిద్దిపేట | 39 |
సంగారెడ్డి | 56 |
వికారాబాద్ | 26 |
మేడ్చెల్ | 75 |
హబ్సీగూడా | 87 |
సైబర్‌సిటీ | 45 |
రాజేంద్రనగర్ | 48 |
సరూర్‌నగర్ | 48 |
బంజారాహిల్స్ | 67 |
సికింద్రాబాద్ | 75 |
హైదరాబాద్ సౌత్ | 59 |
హైదరాబాద్ సెంట్రల్ | 66 |
ఎస్‌సీఏడీఏ | 05 |
విద్యార్హతల వివరాలు:
టెన్త్ తో పాటు ఐటీఐలో ఎలక్ట్రికల్ ట్రేడ్, వైర్‌మెన్ లేదా ఎలక్ట్రికల్ ట్రేడ్ లో ఇంటర్ ఒకేషనల్ కోర్సు పాసైన అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చని ఇంతక ముందు జారీ చేసిన నోటిఫికేషన్లో స్పష్టం చేశారు అధికారులు.
వయో పరిమితి:
ఈ ఉద్యోగాలకు దరఖాస్తుదారుల వయస్సు 18-35 ఏళ్లు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఐదేళ్ల పాటు వయో పరిమితిలో సడలింపు ఇచ్చారు.
దరఖాస్తు ఫీజు: ప్రతీ అభ్యర్థులు అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు కింద రూ.200 చెల్లించాల్సి ఉంటుంది. ఎగ్జామ్ పీజు కింద రూ.120 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు ఎగ్జామ్ ఫీజు చెల్లింపులో మినహాయింపు ఇచ్చారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: JOBS, Telangana government jobs, TSSPDCL