తెలంగాణ (Telangana) ఆవిర్భావం తర్వాత తొలిసారిగా గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షను(Preliminary Exam) అధికారులు అక్టోబర్ 16న విజయవంతం పూర్తి చేశారు. ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఈ పరీక్ష నిర్వహించారు. ఇందు కోసం రాష్ట్ర వ్యాప్తంగా 1019 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు అధికారులు. ఎక్కడా పొరబాట్లకు తావివ్వకుండా పకడ్బందీగా పరీక్షలు నిర్వహించారు. 15 నిమిషాల ముందే పరీక్ష కేంద్రాల గేట్లను అధికారులు మూసివేశారు. పరీక్ష నిర్వహణలో తొలిసారి బయోమెట్రిక్(Biometric) విధానాన్ని అమలు చేశారు. ఆలస్యంగా వచ్చిన అభ్యర్థులను పరీక్షకు అనుమతించలేదు. అయితే కొన్ని పరీక్ష కేంద్రాల్లో బయోమెట్రిక్ తీసుకోవడంతో ఆలస్యం ఏర్పడింది. మొదటిసారి ఇలా బయోమెట్రిక్ విధానం తీసుకురావడంతో ఆయా సెంటర్లో అభ్యర్థులు ఇబ్బందులకు గురయ్యారు.
మరో సెంటర్లో ప్రశ్నాపత్రాలను తారుమారు చేసి ఇవ్వండంతో.. అభ్యర్థులు ఆందోళనకు గురయ్యారు. ఆ అభ్యర్థులకు ఒంటి గంట నుంచి 3.30 గంటల వరకు పరీక్ష ను నిర్వహించారు. దీంతో గ్రూప్ 1 రాసిన అభ్యర్థులు ఆందోళనకు గురవుతుండటంతో.. హైదరాబాద్ కలెక్టర్ దీనిపై క్లారిటీ ఇచ్చారు. మొత్తం 503 గ్రూప్-1 ఉద్యోగాల భర్తీకి తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) నోటిఫికేషన్ విడుదల చేయగా.. 3.8 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. దీనిలో దాదాపు 3.20 లక్షల మంది హాల్ టికెట్లను డౌన్ లోడ్ చేసుకున్నారు. 2 లక్షల 86 వేల 51 మంది ప్రిలిమ్స్‌కు హాజరయ్యారు. అంటే 75 శాతం మంది అభ్యర్థులు ఈ పరీక్షకు హాజరయ్యారు. ప్రతిభ ఆధారంగా ప్రిలిమ్స్‌లో క్వాలిఫై అయినవారిని మెయిన్స్‌కు అనుమతించనున్నారు. ఇదిలా ఉండగా.. పరీక్ష విధానం మాత్రం సివిల్స్ లెవల్ ను మించిపోయిందని అభ్యర్థులు తెలిపారు. ప్రశ్నల స్థాయి కఠినంగా ఉందని.. ప్రశ్న చదవడానికే తమకు ఎక్కువ సమయం పట్టిందని వాపోయారు.
అయితే ఈ పరీక్షకు సంబంధించి కట్ ఆఫ్ మార్కులు మాత్రం తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. దాదాపు 90 లేదా 100 మార్కుల వరకు కట్ ఉంటుందని మొదట్లో భావించినా.. పరీక్ష రాసిన తర్వాత ప్రశ్నల సరళిని బట్టి.. దాదాపు 70 నుంచి 80 మార్కుల వరకు కట్ ఆఫ్ ఉంటే అవకాశం కనిపిస్తోంది. జనరల్ కేటగిరీ అభ్యర్థులు 70- 80 మార్కులు, బీసీ అభ్యర్థులకు 65-75, ఎస్సీ అభ్యర్థులకు 64-74, ఎస్టీ అభ్యర్థులకు 50-60 మార్కుల కట్ ఆఫ్ ఉండనుంది. టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష నిర్వహణ అనంతరం.. జవాబు పత్రాలను అత్యంత భారీ భద్రత నడుమ తరలించారు.
TSPSC వెబ్ సైట్ ఓఎమ్మార్ ఆన్సర్ షీట్(OMR Answer Sheets) స్కాన్ చేసి అందుబాటులో ఉంచుతుంది. ఆ తర్వాత ప్రిలిమినరీ పరీక్ష ప్రైమరీ కీ మూడ్రోజుల్లో విడుదల చేస్తుంది. అయితే స్కానింగ్ ప్రాసెస్ కు మాత్రం 8 రోజుల సమయం పడుతుందని కమిషన్ పరీక్ష పూర్తి చేసిన సందర్భంగా పేర్కొన్నారు. అయితే నేటికి ఏడు రోజులు పూర్తయింది. ఇప్పటికే ఓఎంఆర్ పత్రాలను స్కానింగ్ చేసినట్లు తెలుస్తోంది. అక్టోబర్ 29 లేదా అక్టోబర్ 30న ఈ పరీక్షకు సంబంధించి ప్రిలిమినరీ కీతో పాటు.. ఓఎమ్ ఆర్ షీట్లను అందుబాటులో ఉంచనున్నారు. ప్రైమరీ కీపై వచ్చే అభ్యంతరాలు స్వీకరించిన తర్వాత ఫైనల్ కీ రిలీజ్ చేయనున్నారు. ఫైనల్ కీ తర్వాత.. రెండు నెలల్లోపు ప్రిలిమినరీ ఫలితాలను విడుదల చేయనున్నారు. మెయిన్స్ పరీక్ష అనేది ఫిబ్రవరి లేదా మార్చిలో నిర్వహించే ఆలోచనలో టీఎస్పీఎస్సీ ఉంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Career and Courses, Group 1, JOBS, TSPSC