Jobs in India: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. కరోనా తర్వాత జోరుగా సాగుతున్న నియామకాలు.. ఈ రంగాల్లో అత్యధికం

ప్రతీకాత్మక చిత్రం

భారతదేశంలో ఉద్యోగ నియామకాలు(Jobs) కరోనా(Corona) ముందునాటి స్థాయి కంటే ఎక్కువగా నమోదవుతున్నాయి. ముఖ్యంగా ఐటీ(IT), రిటైల్స్ ఇతర రంగాల్లో నియామకాల సంఖ్య గరిష్టస్థాయిను తాకుతోంది. భారతదేశంలోని జాబ్ మార్కెట్(Job Market) వరుసగా మూడవ నెలలో అత్యధిక నియామకాలతో రికార్డులను నెలకొల్పడం విశేషం.

  • Share this:
భారతదేశంలో(India) ఉద్యోగ నియామకాలు (Jobs) కరోనా (Corona) ముందునాటి స్థాయి కంటే ఎక్కువగా నమోదవుతున్నాయి. ముఖ్యంగా ఐటీ (IT), రిటైల్స్ ఇతర రంగాల్లో నియామకాల సంఖ్య గరిష్టస్థాయిను తాకుతోంది. భారతదేశంలోని జాబ్ మార్కెట్ (Job Market) వరుసగా మూడవ నెలలో అత్యధిక నియామకాలతో రికార్డులను నెలకొల్పడం విశేషం. నౌకరీ జాబ్‌స్పీక్ (Naukri JobSpeak) తాజా నివేదిక ప్రకారం.. గత ఏడాది సెప్టెంబర్ తో పోలిస్తే ఈ ఏడాది సెప్టెంబర్ నెలలో ఉపాధి రంగం 57 శాతం వృద్ధిని నమోదు చేసింది. నౌక్రి జాబ్‌స్పీక్ ఇండెక్స్ 2,753 జాబ్ పోస్టింగ్‌లతో ట్రెండింగ్‌లో ఉందని నివేదిక తెలిపింది. ఈ స్థాయిలో జాబ్ పోస్టింగులు ఉండటం ఇదే తొలిసారి అని నివేదిక వెల్లడించింది. అయితే ఈ ఇండెక్స్ సెప్టెంబరు 2019లో నమోదైన ఇండెక్స్‌ కంటే 21 శాతం పెరిగింది. నౌక్రి జాబ్‌స్పీక్ అనేది నెలవారీ సూచిక కాగా దాన్ని ప్రతి నెలా ప్రచురిస్తారు. నౌకరీ.కామ్ వెబ్‌సైట్‌లోని ఉద్యోగ జాబితాల ఆధారంగా నియామక కార్యకలాపాలను లెక్కిస్తారు.

ఏయే రంగాలు మెరుగైన వృద్ధిని నమోదు చేశాయి?
కేవలం ఐటీ మాత్రమే కాదు, చాలా రంగాలు ఇయర్-ఆన్-ఇయర్ వృద్ధిని కనబరచాయని నివేదిక పేర్కొంది. నివేదిక ప్రకారం ఐటీ రంగం 138 శాతంతో అత్యధిక వృద్ధిని నమోదు చేసింది. 82 శాతం వృద్ధితో హాస్పిటాలిటీ రెండో స్థానం దక్కించుకుంది. డిజిటల్ సేవలు మరింత అధునాతనంగా మారుతున్న ప్రస్తుత సమయంలో టెక్ నిపుణులకు డిమాండ్‌ పెరుగుతోంది. 2021 సెప్టెంబర్‌లో ఐటీ-సాఫ్ట్‌వేర్/సాఫ్ట్‌వేర్ సేవల విభాగంలో నియామకాలు 138 శాతం పెరిగాయని నౌక్రీ జాబ్‌స్పీక్ నివేదించింది. కోవిడ్-19 కారణంగా ఎక్కువగా ప్రభావితమైన రంగాలు సెప్టెంబర్‌లో వృద్ధిని సాధించాయని నివేదిక వివరించింది. వీటిలో హాస్పిటాలిటీ (82 శాతం), రిటైల్ (70 శాతం) రంగాలు ఉన్నాయి.

కరోనా తీవ్రత తగ్గడంతో దేశవ్యాప్తంగా అనేక హోటళ్లు, ఫిజికల్ స్టోర్స్ పూర్తి స్థాయిలో నడుస్తున్నాయి. దీనివల్లహాస్సిటాలిటీ, టూరిజం రంగాల్లోఉద్యోగ నియామకాలు పెరిగిపోతున్నాయి. మరోవైపు, విద్యా రంగంలో నియామకాల సంఖ్య ఎగబాకుతోంది. ఎడ్యుకేషన్ సెక్టార్ సెప్టెంబర్ 2021లో 53 శాతం వృద్ధిని సాధించింది. దాంతో సెప్టెంబర్ 2019లో నమోదైన 32 శాతం నియామకాలను ఇది అధికమించినట్లయింది. ఇదే కాలంలో బీఎఫ్‌ఎస్‌ఐ 43 శాతం, రియల్ ఎస్టేట్ 39 శాతం, టెలికాం 37 శాతం, బీమా 29 శాతం, మెడికల్/హెల్త్‌కేర్ 26 శాతం వృద్ధిని సాధించాయని నివేదిక పేర్కొంది.

ఏ నగరాలు అధిక నియామక రేట్లు నమోదు చేశాయి?
సెప్టెంబర్‌లో 88 శాతం వార్షిక వృద్ధిని నమోదు చేయడం ద్వారా దేశవ్యాప్తంగా మెట్రో నగరాలు మెరుగైన వృద్ధిని సాధించాయి. 30 శాతం వార్షిక వృద్ధితో టైర్ 2 నగరాలు తర్వాతి స్థానంలో ఉన్నాయి.2020లో లాక్‌డౌన్ ప్రభావం, నియామకాల నిలిపివేత ప్రభావం మెట్రోలను అతలాకుతలం చేసింది. కానీ ఇవి ఇప్పుడు తిరిగి పుంజుకున్నాయి. టైర్ 2 నగరాలతో పోలిస్తే మెట్రో నగరాలు సెప్టెంబర్ 2021లో ఏటా 2 రెట్లు పెరుగుతోందని నౌక్రి జాబ్‌స్పీక్ వెల్లడించింది. నౌక్రి.కామ్ వెబ్‌సైట్‌ డేటా ప్రకారం.. సెప్టెంబర్‌లో బెంగళూరు 133 శాతం, హైదరాబాద్ 110 శాతం, పూణె 95 శాతం, చెన్నై 85 శాతం వార్షిక వృద్ధిని నమోదు చేశాయి.

ఎక్స్​పీరియన్స్​ లెవల్​లో పెరిగిన నియామకాలు
గతేడాది పోలిస్తే సెప్టెంబర్‌లో అన్ని ఎక్స్​పీరియన్స్ లెవెల్స్ లలో నియామకాలు పెరిగాయి. కరోనా తగ్గుముఖం పట్టడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. 8-12 ఏళ్ల అనుభవం ఉన్న సీనియర్ ప్రొఫెషనల్స్‌కు డిమాండ్ పెరుగుతూనే ఉంది. సెప్టెంబర్ 2020తో పోలిస్తే సెప్టెంబర్ 2021లో సీనియర్ ప్రొఫెషనల్స్‌ డిమాండ్ లో 75 శాతం పెరుగుదల కనిపించింది. అలాగే 0-3 సంవత్సరాలు అనుభవం ఉన్న ఫ్రెషర్స్​కు54 శాతం, 4-7 ఏళ్ల ఎక్స్పీరియన్స్ ఉన్న ప్రొఫెషనల్స్‌కు 65 శాతం, 13 ఏళ్ల ఎక్స్పీరియన్స్ ఉన్న ప్రొఫెషనల్స్‌కు 47 శాతం డిమాండ్ పెరిగింది.
Published by:Nikhil Kumar S
First published: