Home /News /jobs /

IT Jobs: ఐటీ ఉద్యోగుల‌కు విపరీతమైన డిమాండ్.. జాబ్ ఛేంజ్ అయితే 70 శాతం ఇంక్రిమెంట్

IT Jobs: ఐటీ ఉద్యోగుల‌కు విపరీతమైన డిమాండ్.. జాబ్ ఛేంజ్ అయితే 70 శాతం ఇంక్రిమెంట్

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

కరోనా కారణంగా అనేక మంది ఉద్యోగాలు కోల్పోయి రోడ్డున పడ్డా.. ఐటీ ఉద్యోగులకు మాత్రం పరిస్థితి రివర్స్ అయింది. డిమాండ్ విపరీతంగా పెరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి.

తంతే బూరెల బుట్ట‌లో ప‌డ్డ‌ట్టుంది ఐటీ ఉద్యోగుల ప‌రిస్థితి. ఐటీ ఉద్యోగుల‌కు డిమాండ్ అమాంతం పెరిగింది. కోవిడ్ కార‌ణంగావ్యాపార సంస్థ‌ల‌న్నీ డిజిట‌ల్ బాట‌ప‌ట్ట‌డానికి మొగ్గు చూపుతున్నాయి. దీంతో ఐటీ ఉద్యోగులకు డిమాండ్ పెరిగింది. దీంతో దీపం ఉండ‌గానే ఇల్లు చ‌క్క‌పెట్టుకోవాల‌ని ఐటీ నిపుణులు భావిస్తున్నారు. దీంతో కంపెనీ మారేట‌ప్పుడు ఏకంగా 70శాతం ఇంక్రిమెంట్ కోసం డిమాండ్ చేస్తున్నారు. ఈ క్ర‌మంలో వారు కొన్ని ఆఫ‌ర్ల‌ను కూడా వ‌దులుకుంటున్నార‌ని ఐటీ రిక్రూట్‌మెంట్ సంస్థ‌లు చెపుతున్నాయి. అయితే కంపెనీలు సైతం బంప‌ర్ ఆఫ‌ర్ ఇచ్చి మ‌రీ ఐటీ ఉద్యోగుల‌ను ఎగ‌రేసుకుపోతున్నాయట.
IT Jobs: ఈ కోర్సులు చేశారా? ఐటీ కంపెనీల్లో వీరికి భలే డిమాండ్

ఎందుకీ డిమాండ్‌...?
కోవిడ్ మ‌హ‌మ్మారి ప్ర‌పంచం ముఖ‌చిత్రాన్ని మార్చివేసింది. సంప్ర‌దాయ‌బ‌ద్ధంగా వ‌స్తున్న అనేక ప‌ద్ద‌తుల‌ను మార్చుకోవాల్సిన ప‌రిస్థితి వ‌స్తోంది. దీంతో ఇప్పుడంతా ఆన్‌లైన్ బాట ప‌డుతున్నారు. దేశంలోని కార్పొరేట్ కంపెనీల‌న్నీ డిజిట‌ల్ బాట ప‌డుతున్నాయి. త‌మ వ్య‌వ‌హారాల‌న్నీ డిజిటల్ రూపంలో చ‌క్క‌పెట్టుకోవ‌డానికి సిద్ధ‌మ‌వుతున్నాయి. ఈ ప‌రిణామం దేశంలోని టెక్ రంగానికి కొత్త ఊపిరి పోస్తోంది. ఫ‌లితంగా టెక్ ఉద్యోగులు బంప‌ర్ ఆఫ‌ర్లు కొడుతున్నారు. కొత్త ఉద్యోగాల్లో చేరే ఉద్యోగులు.. త‌మ ప్ర‌స్తుత జీతాల కంటే అద‌నంగా 50 నుంచి 70 శాతం ఇంక్రిమెంట్ కోరుకుంటున్నారు. కోవిడ్‌కు ముందు ఈ పెంపు కేవ‌లం 15 నుంచి 30 శాతం మాత్ర‌మే ఉండేద‌ని చెపుతున్నాయి టీమ్‌లీజ్‌, ఏబీసీ క‌న్స‌ల్ టెంట్స్‌, క్యూస్‌, టాగ్డ్‌, రాండ్‌స్టాడ్ లాంటి రిక్రూట్‌మెంట్ కంపెనీలు. అన్ని కార్పొరేట్ కంపెనీలు త‌మ కార్య‌కలాపాల‌ను డిజిట‌ల్ బాట ప‌ట్టిస్తున్నాయి. దీంతో డిజిట‌ల్ ప్ర‌తిభావంతుల‌కు డిమాండ్ పెరిగింది. కోవిడ్ ఈ ఉధృతిని మ‌రింత పెంచింద‌ని విశ్లేషించారు నాస్కామ్ వైస్ ప్రెసిడెంట్ సంగీత గుప్తా.

ఏ రంగంలో డిమాండ్
సాఫ్ వేర్ యాజ్ ఏ స‌ర్వీస్, ఎడ్యు టెక్‌, హెల్త్-టెక్, గేమింగ్, ఇతర ఏఐ విభాగాల్లో ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, ఆటోమేషన్, డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ బ్లాక్‌చెయిన్, సైబర్‌ సెక్యూరిటీ వంటి రంగాలలో అనుభవం ఉన్న ఐటి నిపుణులకు భారీ డిమాండ్ ఉంది. అందుకే ఉద్యోగులు తమ పాత కొలువులు వ‌దులుకొని, కొత్త‌వాటిని ఎంచుకోవ‌డానికి భారీ ఇంక్రిమెంట్ కోరుతున్నారని ప‌రిశ్ర‌మ వ‌ర్గాలు విశ్లేషించాయి.

ఇక దేశంలోని అతిపెద్ద ఐటీ కంపెనీ అయిన టీసీఎస్.. ఏప్రిల్ జూన్ మాసాల మ‌ధ్య‌లో 24,409 మంది ఉద్యోగుల‌ను చేర్చుకుంది. అలాగే 40వేల‌మంది ఫ్రెష‌ర్స్‌ను కూడా ఈ ఏడాది రిక్రూట్ చేసుకోనుంది. అలాగే కాప్ జెమినీ, జెన్‌పాక్ట్‌, ప‌బ్లిసిస్ సాపినెట్ లాంటి ఐటీ సంస్థ‌లు కూడా త‌మ ఉద్యోగుల సంఖ్య‌ను పెంచుకునే దిశ‌గా క‌స‌ర‌త్తు చేస్తున్నాయి. ఇండియాలో 1,25,000 మంది ఉద్యోగులు ఉన్న కాప్ జెమిని.. క్లౌడ్, డిజిటల్, సైబర్‌ సెక్యూరిటీ, AI, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ సొల్యూషన్స్, ఎడ్జ్ కంప్యూటింగ్ 5 జి ఇంజనీరింగ్ నైపుణ్యాలు, డేటా మేనేజ్‌మెంట్, శాప్‌, జావా, మైక్రోసాఫ్ట్, టెస్టింగ్ ఒరాకిల్, రంగాల‌లో అనుభ‌వం ఉన్న ఉద్యోగుల‌ను నియ‌మించుకోనుంది. ప్రపంచవ్యాప్తంగా 90,000 మందికి పైగా ఉద్యోగులున్న జెన్‌పాక్ట్‌లో, క్లౌడ్ ప్రోగ్రామింగ్ నైపుణ్యాలు ఉన్నవారికి ఎక్కువ డిమాండ్ ఉందని దాని గ్లోబల్ హైరింగ్ లీడర్ అఖిలేష్ నాయర్ అన్నారు.

రిక్రూట్‌మెంట్ సంస్థ‌లు బిజీ బిజీ
ఐటీ రంగంలో బూమ్‌కార‌ణంగా దేశంలోని రిక్రూట్‌మెంట్‌సంస్థ‌లు త‌మ క్ల‌యింట్ల‌కు కావాల్సిన ఐటీ రంగ నిపుణుల‌ను ఎంపిక‌చేయ‌డంలో బిజీబిజీగా ఉన్నాయి. రాడ్‌స్టాడ్ సంస్థ త‌న క్ల‌యింట్ అయిన ఓ లాజిస్టిక్ మ‌ల్టీనేష‌న‌ల్ కంపెనీ కోసం ఓ ఉద్యోగి షార్ట్ లిస్ట్ అయ్యాడు. అత‌నికి ప్ర‌స్తుత వేత‌నం కంటే 47శాతం అద‌నంగా ఏడాదికి 15ల‌క్ష‌ల వార్షిక వేతనం ఫిక్స్ అయింది. అయితే ఆ ఉద్యోగి ప్ర‌స్తుతం ప‌నిచేస్తున్న కంపెనీనే పాతిక ల‌క్ష‌ల వార్షిక వేత‌నాన్ని కౌంట‌ర్ ఆఫ‌ర్ ఇచ్చింది.

ఇటీవల కాలంలో ఈ రిక్రూట్‌మెంట్ సంస్థ వ‌ద్ద ఇలాంటి కేసులు క‌నీసం ఓ రెండు డ‌జ‌న్ల అయినా వ‌చ్చి ఉంటాయి. టీమ్‌లీజ్ స‌ర్వీసెస్‌, ఏబీసీ క‌న్స‌ల్టెంట్స్‌, క్యూస్ అండ్ టాగ్డ్ లాంటి రిక్రూట్‌మెంట్ కంపెనీల‌లోనూ ఆఫ‌ర్లు, బంప‌ర్ ఆఫ‌ర్ల క‌థ న‌డుస్తోంది. ఈ ప‌రిస్థిని ఐటీ రంగ ఉద్యోగులు పూర్తిగా స‌ద్వినియోగం చేసుకుంటున్నారు. కొత్త కొలువుల్లో చేరేందుకు భారీ మొత్తాల‌ను డిమాండ్ చేసుకుంటున్నారు... వాటిని అందుకుంటున్నారు కూడా.. అలాగే వారికి స‌రికొత్త ఉద్యోగ‌బాధ్య‌త‌లూ ల‌భిస్తున్నాయ‌ని విశ్లేషించారు టీమ్ లీజ్ స‌హ వ్య‌వ‌స్థాప‌కులు రీతూప‌ర్ణ చ‌క్ర‌వ‌ర్తి.
Published by:Nikhil Kumar S
First published:

Tags: CAREER, Covid jobs, Information Technology, Job notification, JOBS, Software developer

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు