ఐటీ ఉద్యోగం అంటే కేవలం ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లకే అనుకుంటారు చాలా మంది. కానీ నాన్ టెక్నికల్ డిగ్రీ గ్రాడ్యుయేట్లకు కూడా అవకాశాలు కల్పిస్తున్నాయి దిగ్గజ ఐటీ సంస్థలు. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS), ఇన్ఫోసిస్, విప్రో వంటి అనేక ఐటీ దిగ్గజాలు ఫ్రెషర్ల కోసం ఈ ఏడాది పెద్ద ఎత్తున నియామకాలు చేపడుతున్నాయి. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లే కాకుండా బీఎస్సీ, బీఈ, బీసీఏ విద్యార్థులను కూడా నియమించుకుంటున్నాయి. ఈ ఏడాది గ్రాడ్యుయేట్లను నియమించుకుంటున్న అగ్రశ్రేణి టాప్ ఐటీ సంస్థలను పరిశీలిద్దాం.
హెచ్‌సీఎల్
దిగ్గజ ఐటీ సంస్థ హెచ్‌సిఎల్ టెక్నాలజీస్ ఈ ఏడాది పెద్ద ఎత్తున ఫ్రెషర్లను నియమించుకోనుంది. బీఈ, బీటెక్ విద్యార్థులనే కాకుండా ఐటీ లేదా కంప్యూటర్ సైన్స్‌లో బీఎస్సీ లేదా సీఎస్, ఐటీ, సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్‌లో బీవోసీ లేదా బీసీఏ పూర్తి చేసిన ఫ్రెషర్లను రిక్రూట్ చేసుకోనుంది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఆన్‌లైన్ ఆప్టిట్యూడ్ టెస్ట్, ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఎంపికైన వారికి అవసరమైన టెక్నికల్, ప్రాక్టికల్, పర్సనాలిటీ డెవలప్మెంట్ స్కిల్స్‌పై ఆరు నెలల పాటు శిక్షణ ఇస్తారు. అయితే ఎంపికైన అభ్యర్థులు రూ. 1.5 లక్షల ట్రైనింగ్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
టీసీఎస్
టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) కూడా 2020 లేదా 2021 ఏడాదిలో బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్, ఎంసీఏ, ఎంఎస్సీ పూర్తి చేసిన గ్రాడ్యుయేట్లకు నియమించుకోనుంది. ఆసక్తి గల ఫ్రెష్ గ్రాడ్యుయేట్లు నవంబర్ 15లోపు దరఖాస్తు చేసుకోవాలి. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా నియమించుకుంటారు. అయితే దరఖాస్తు చేసుకోబోయే అభ్యర్థులు పదో తరగతి, ఇంటర్మీడియట్, గ్రాడ్యుయేషన్, డిప్లొమా, పోస్ట్ గ్రాడ్యుయేషన్‌లో కనీసం 60 శాతం మార్కులు సాధించి ఉండాలి.
ఇది కూడా చదవండి: Railway Jobs: భారతీయ రైల్వేలో 2,945 పోస్టులు... దరఖాస్తుకు రేపే లాస్ట్ డేట్
విప్రో
విప్రో తన వర్క్ ఇంటిగ్రేటెడ్ లెర్నింగ్ ప్రోగ్రామ్ (WILP) 2022 కింద బీసీఏ, బీఎస్సీ గ్రాడ్యుయేట్లను నియమించుకోనుంది. దరఖాస్తు చేసుకోబోయే అభ్యర్థులు కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్, ఎలక్ట్రానిక్స్, ఫిజిక్స్ విభాగాల్లో కనీసం 60 శాతం మార్కులు సాధించి ఉండాలి. ఆసక్తి గల అభ్యర్థులు wipro.com ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఆన్‌లైన్ టెస్ట్, ఆప్టిట్యూడ్ టెస్ట్, కమ్యూనికేషన్ టెస్ట్, బిజినెస్ డిస్కషన్ రౌండ్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్థులకు మొదటి నాలుగు సంవత్సరాల పాటు నెలకు రూ. 15000 నుంచి రూ. 23000 స్టైపెండ్ అందజేస్తారు. ఆ తర్వాత వారిని సీనియర్ ప్రాజెక్ట్ ఇంజనీర్‌గా నియమిస్తారు.
క్యాప్‌జెమిని
క్యాప్‌జెమిని పూల్ క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా 2021 బ్యాచ్‌కి చెందిన బీఈ, బీటెక్ గ్రాడ్యుయేట్లు, ఎంసీఏ ఫ్రెషర్లను రిక్రూట్ చేసుకోనుంది. ఇన్ఫర్మేషన్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్‌లో ఎంఈ, ఎంటెక్ విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే అభ్యర్థులు డిప్లొమా, గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేట్ పరీక్షల్లో కనీసం 50 శాతం మార్కులను సాధించి ఉండాలి. అభ్యర్థులకు టెక్నికల్ అసెస్‌మెంట్ సూడో-కోడ్, MCQ ఆధారిత ఇంగ్లీష్ కమ్యూనికేషన్ టెస్ట్, గేమ్-బేస్డ్ ఆప్టిట్యూడ్ టెస్ట్, బిహేవియరల్ కాంపిటెన్సీ ప్రొఫైలింగ్, టెక్నికల్ అండ్ హెచ్‌ఆర్ ఇంటర్వ్యూతో సహా అసెస్‌మెంట్ ప్రక్రియ.. ఇలా ఐదు దశల్లో పరీక్ష నిర్వహిస్తారు. వాటిలో ఎంపికైన అభ్యర్థులకు 8-10 వారాల పాటు శిక్షణనిస్తారు. అయితే ఎంపికైన అభ్యర్థులు ‘సర్వీస్ లెవల్ అగ్రిమెంట్’ బాండ్‌పై సంతకం చేయాల్సి ఉంటుంది. కంపెనీ కోరిన ఏ ప్రదేశానికి మారడానికి సిద్ధంగా ఉండాలి.
జెన్‌పాక్ట్
జెన్‌పాక్ట్ ప్రాసెస్ అసోసియేట్ (నాన్ వాయిస్ కస్టమర్ కేర్) పోస్టుల ఫ్రెష్ గ్రాడ్యుయేట్ల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన అభ్యర్థులు, ఇంగ్లిష్‌లో ప్రావీణ్యం ఉన్న వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Infosys, IT jobs, Tata, Upcoming jobs, Wipro