Home /News /jobs /

IT MAJOR CAPGEMINI HAS INVITED APPLICATIONS FROM ENGINEERING AND MCA FRESHERS BATCH 2021 FOR THE POOLED CAMPUS DRIVE GH SSR

Capgemini Recruitment: బీటెక్, ఎంసీఏ ఫ్రెషర్స్‌కు గుడ్ న్యూస్.. ఉద్యోగావకాశం మీకోసం..

Capgemini Recruitment: బీటెక్, ఎంసీఏ ఫ్రెషర్స్‌కు గుడ్ న్యూస్.. ఉద్యోగావకాశం మీకోసం..

Capgemini Recruitment: బీటెక్, ఎంసీఏ ఫ్రెషర్స్‌కు గుడ్ న్యూస్.. ఉద్యోగావకాశం మీకోసం..

సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల కోసం ఎంతగానో ఎదురుచూస్తుంటారు ఇంజనీరింగ్ పట్టభద్రులు. ఏదైనా MNC కంపెనీలో నియామకాలు జరుగుతున్నాయంటే తప్పనిసరిగా దరఖాస్తు చేసుకుంటారు. ప్రస్తుతం ఇలాంటి తరుణమే వచ్చింది. ప్రముఖ టెక్ దిగ్గజం క్యాప్ జెమిని ఇంజనీరింగ్, ఎంసీఏ ఫ్రెషర్స్ కోసం నియామకాలు చేపట్టింది.

ఇంకా చదవండి ...
సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల కోసం ఎంతగానో ఎదురుచూస్తుంటారు ఇంజనీరింగ్ పట్టభద్రులు. ఏదైనా MNC కంపెనీలో నియామకాలు జరుగుతున్నాయంటే తప్పనిసరిగా దరఖాస్తు చేసుకుంటారు. ప్రస్తుతం ఇలాంటి తరుణమే వచ్చింది. ప్రముఖ టెక్ దిగ్గజం క్యాప్ జెమిని ఇంజనీరింగ్, ఎంసీఏ ఫ్రెషర్స్ కోసం నియామకాలు చేపట్టింది. క్యాంపస్ డ్రైవ్ (Pooled Campus Drive 2021) కోసం దరఖాస్తులను ఆహ్వానించింది.

2021లో ఇంజనీరింగ్, ఎంసీఏ పూర్తి చేసిన పట్టభద్రులు అక్టోబరు 15 లోపు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. నమోదు చేసుకున్న అభ్యర్థులకు వచ్చే నెల రెండో వారం నుంచి అసెస్మెంట్ టెస్ట్ నిర్వహిస్తారు. ఇందుకోసం క్యాప్ జెమిని అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి.

* అర్హత..
బీటెక్, ఎంసీఏ పట్టభద్రులు మాత్రమే ఈ నియామకాలకు అర్హులు. 2021లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసినవారు లేదా గ్రాడ్యుయేషన్ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు ఈ డ్రైవ్ కు దరఖాస్తు చేసుకోవచ్చు. విద్యార్థులు కనీసం 50 శాతం కంటే ఎక్కువ మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఎంఈ లేదా ఎంటెక్ పూర్తి చేసినవారు కూడా అప్లై చేసుకోవచ్చు. అయితే వారు ఐటీ, ఇన్ఫర్మేషన్ సైన్స్, కంప్యూటర్ సైన్స్ విభాగాలకు చెందినవారై ఉండాలి. విజయవంతంగా నియామక ప్రక్రియను పూర్తి చేసినవారికి ట్రైనింగ్ ప్రొగ్రాం ఉంటుందని క్యాప్ జెమిని ఓ ప్రకటనలో తెలిపింది.

"మా నియామక ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసినవారికి క్యాప్ జెమినిలో 8 నుంచి 10 వారాల పాటు సెంట్రల్ ట్రైనింగ్ ప్రొగ్రాం ద్వారా శిక్షణ ఇస్తాం. మా ట్రైనింగ్ లో 2.0 మోడల్ క్లాస్, ప్రత్యేకమైన లెర్నింగ్ అనుభూతిని పొందుతారు. అంతేకాకుండా ఈ ట్రైనింగ్ మీలోని సామర్థ్యాన్ని మరింత వెలికితీస్తుంది" అని క్యాప్ జెమిని స్పష్టం చేసింది.

వర్క్, కెరీర్ స్వభావం వేగంగా మారుతోందని, విద్యార్హతలతో పాటు సరైన నైపుణ్యాలు కూడా అంతే అవసరమని పేర్కొంది. నూతన టెక్నాలజీలపై పనిచేసే అభిరుచి, తగిన నైపుణ్యం, విషయసాధన ఉంటే భవిష్యత్తు సుగమం చేసుకోవడానికి క్యాప్ జెమిని సరైన ప్రదేశమని, కెరీర్ కు ఊతమిస్తుందని తెలిపింది.

ఇది కూడా చదవండి: ONGC Recruitment 2021: ఓఎన్‌జీసీలో 309 ఉద్యోగాలు... ఆ డిగ్రీ ఉంటే చాలు

ప్రపంచ వ్యాప్తంగా 50 దేశాల్లో 2,90,000 మంది ఉద్యోగులు ఈ టెక్ కంపెనీలో పనిచేస్తున్నారు. ఒక్క భారత్ లోని 13 విభిన్న ప్రదేశాల్లో 1,50,000 మంది టీమ్ మెంబర్స్ విధులను నిర్వర్తిస్తున్నారు. ఈ క్యాంపస్ డ్రైవ్ కు సంబంధించి మరిన్ని వివరాల కోసం క్యాప్ జెమిని అధికారిక పోర్టల్ సందర్శించి.. రిజిస్టర్ చేసుకోవాలి.
Published by:Sambasiva Reddy
First published:

Tags: Engineering, JOBS, Mca, Software, Upcoming jobs

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు