IT MAJOR ACCENTURE IS HIRING COMMERCE GRADUATES INVOICE PROCESSING OPERATIONS AND ACCOUNTS PAYABLE PROCESSING IN FINANCE DEPARTMENT HERE THE FULL DETAILS GH SRD
Accenture: నిరుద్యోగులకు యాక్సెంచర్ గుడ్‌న్యూస్.. ఆ సంస్థలో వివిధ విభాగాల్లో ఖాళీలు.. పూర్తి వివరాలివే..!
Accenture
Accenture: టెక్ దిగ్గజం యాక్సెంచర్ (Accenture) నిరుద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పింది. నోయిడా, చెన్నై లొకేషన్లలో కామర్స్ గ్రాడ్యుయేట్లను నియమించుకోనున్నట్లు తెలిపింది.
టెక్ దిగ్గజం యాక్సెంచర్ (Accenture) నిరుద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పింది. నోయిడా, చెన్నై లొకేషన్లలో కామర్స్ గ్రాడ్యుయేట్లను నియమించుకోనున్నట్లు తెలిపింది. తమ ఇన్వాయిస్ ప్రాసెసింగ్ యాక్టివిటీస్, ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో చెల్లింపుల నిర్వహణ కోసం వీరిని ఉపయోగించుకోనున్నట్లు పేర్కొంది. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు కంపెనీ వెబ్సైట్ www.accenture.com/us-en/careers ద్వారా దరఖాస్తు చేసుకోవాలని కోరింది. అయితే ఎంత మందిని రిక్రూట్ చేసుకుంటారనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. కరోనా వైరస్ తగ్గుముఖం పట్టడంతో ఇన్ఫర్మేషన్ రంగంలో నియామకాల జోరు కొనసాగుతోందని చెప్పవచ్చు. ఉద్యోగాలు, అర్హత, అనుభవం వివరాలివే..
* మేనేజ్మెంట్ లెవల్ అనలిస్ట్ (నోయిడా లొకేషన్)
కావాల్సిన నైపుణ్యాలు: ఇన్వాయిస్ ప్రాసెసింగ్ ఆపరేషన్స్‌పై పరిజ్ఞానం ఉండాలి.
అర్హత: కామర్స్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి.
అనుభవం: సంబంధిత విభాగంలో కనీసం 3 నుంచి -5 సంవత్సరాల అనుభవం ఉండాలి.
* ఉద్యోగ బాధ్యతలు
మేనేజ్మెంట్ అనలిస్ట్‌గా సమస్యలను విశ్లేషించి, పరిష్కరించాల్సి ఉంటుంది.
మీ క్లయింట్లు లేదా యాక్సెంచర్ మేనేజ్మెంట్లోని ఫైనాన్షియల్ టీమ్‌తో ఎప్పటికప్పుడు ఇంటరాక్ట్ అవ్వాలి. కంపెనీ యాక్టివిటీస్‌పై, కొత్త అసైన్మెంట్లపై వివరణాత్మక సూచనలు ఇవ్వాల్సి ఉంటుంది. కంపెనీ వ్యాపార కార్యకలాపాలపై బాగా ప్రావీణ్యం కలిగి ఉండాలి. కంపెనీ వాటాదారులతో చర్చలు జరపాలి. ఎంపికైన వారు ఒక టీంలో పనిచేయాల్సి ఉంటుంది. వ్యక్తిగత సహాయకారిగా వ్యవహరించాలి.
* మేనేజ్మెంట్ లెవల్ అసోసియేట్– చెన్నై
కావాల్సిన నైపుణ్యాలు: పే ప్రాసెసింగ్,- అకౌంట్స్ ప్రాసెసింగ్‌పై అవగాహన కలిగి ఉండాలి.
అర్హత: ఏదైనా కామర్స్ సబ్జెక్ట్‌లో బీకామ్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు కనీసం 1 నుంచి -3 సంవత్సరాల అనుభవం.
* ఉద్యోగ బాధ్యతలు
మీ ఉద్యోగ బాధ్యతలో వాణిజ్యానికి సంబంధించిన సాధారణ సమస్యలను పరిష్కరించాల్సి ఉంటుంది. మేనేజ్మెంట్ అసోసియేట్‌గా మీరు మీ టీమ్, సూపర్వైజర్లతో ఎప్పటికప్పుడు ఇంటరాక్ట్ అవ్వాల్సి ఉంటుంది. కంపెనీ కొత్త అసైన్మెంట్లపై వివరణాత్మక సూచనలను అందించాలి. క్లయింట్స్‌తో చర్చలు జరపాలి. కంపెనీ ప్రాథమిక గణాంకాలు, నిబంధనలను బాగా తెలుసుకోవాలి. సంస్థ వాటాదారులతో చర్చలు జరపాలి. ఉద్యోగులు ఒక టీమ్‌గా కలిసి పనిచేయాల్సి ఉంటుంది. కంపెనీ వృద్ది కోసం కొత్త ఎత్తుగడలను రూపొందించాల్సి ఉంటుంది.
Published by:Sridhar Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.