IT JOBS JOBS IN IT SECTOR WITH INTERMEDIATE QUALIFICATION HERE ARE FULL DETAILS RA
IT Jobs : ఇంటర్‌తోనే ఐటీ జాబ్స్.. ఈ కోర్సు నేర్చుకోండి..
ఇంటర్‌తో ఐటీ ఉద్యోగాలు
9 నెలల శిక్షణ అనంతరం ఐటీ ఉద్యోగం చేయొచ్చు. కోర్సు ఫీజు 2 లక్షలు ఉంటుంది. పన్నులు కూడా అదనంగా ఉంటాయి. అయితే, ఫీజు కోసం రుణాలు కూడా ఇస్తుంటాయి కొన్ని బ్యాంకులు. కోర్సు పూర్తై జాబ్ వచ్చాక ఈఎంఐ ద్వారా బ్యాంకు రుణాలు తీర్చుకోవచ్చు.
చాలామంది ఐటీ ఉద్యోగం చేయడమనేది ఓ కల. ఇది చేయాలంటే ఇంటర్ తర్వాత ఎంసెట్ రాసి బీటెక్ వంటి కోర్సులు చేస్తేనే సాధ్యమని అనుకుంటారు. కానీ, కొన్ని సంస్థలు వీటికోసం ప్రత్యేక కోర్సులు నేర్పించి ఐటీ ఉద్యోగాలు కల్పిస్తాయి. కేవలం ఇంటర్ అర్హతతోనే ఈ కోర్సుల్లో జాయిన్ అవ్వొచ్చు. 9 నెలల శిక్షణ అనంతరం ఐటీ ఉద్యోగం చేయొచ్చు. కోర్సు ఫీజు 2 లక్షలు ఉంటుంది. పన్నులు కూడా అదనంగా ఉంటాయి. అయితే, ఫీజు కోసం రుణాలు కూడా ఇస్తుంటాయి కొన్ని బ్యాంకులు. కోర్సు పూర్తై జాబ్ వచ్చాక ఈఎంఐ ద్వారా బ్యాంకు రుణాలు తీర్చుకోవచ్చు.
కోర్సు పూర్తి వివరాలు..
కోర్సు పేరు : టెక్ బీ
శిక్షణ : 9 నెలలు
అర్హత : ఇంటర్ ఎంపీసీ/ఎంఈసీలో కనీసం 60శాతం మార్కులు (2018, 2019లో ఇంటర్ పూర్తి చేసి ఉండాలి)
ఆన్ లైన్ గడువు : మే 3, 2019
దరఖాస్తు చేసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి.. https://bit.ly/2Vg6jou
ఈమెయిల్ : tssvijayawada@hcl.com
వెబ్సైట్ : www.hcltechbees.com
అభ్యర్థుల ఎంపిక : ప్రవేశపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా..
ఎంపికైనవారికి స్టైఫండ్: నెలకు రూ.10వేలు
కోర్సు ఫీ : రూ.2 లక్షలు + పన్నులు అదనం(బ్యాంకు రుణసదుపాయం ఉంటుంది. శిక్షణ తర్వాత హెచ్‌సీఎల్‌లో విధులు చేపట్టిన మొదటి సంవత్సరం నుంచి ఈఎంఐ చెల్లింపు ఉంటుంది)
ఉద్యోగాలు : అప్లికేషన్ అండ్ ఇన్‌ఫ్ట్రాస్ట్రక్చర్ సపోర్ట్, టెస్టింగ్ అండ్ సీఏడీ సపోర్ట్ రంగాల్లో ప్రవేశస్థాయి ఉద్యోగాలు..
వేతనం : శిక్షణ పూర్తి చేశాక ఏడాది 2.0 నుంచి 2.2 లక్షల వేతనం..
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.