Home /News /jobs /

IT JOBS GOOD CHANCE FOR FRESHMEN JOB OPPORTUNITY IN A LEADING IT COMPANY APPLICATION PROCESS EVK

IT Jobs: ఫ్రెష‌ర్స్‌కు గుడ్ చాన్స్‌.. ప్ర‌ముఖ ఐటీ కంపెనీలో జాబ్ చాన్స్‌లు.. అప్లికేష‌న్ ప్రాసెస్‌!

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

IT Jobs | ప్ర‌ముఖ సాఫ్ట్‌వేర్ (Software) కంపెనీ మెక్రోసాఫ్ట్ ఫ్రెష‌ర్స్‌కు గోల్డెన్ చాన్స్ అందిస్తోంది. 2022లో బ్యాచ్ విద్యార్థుల‌కు ఫుల్ టైమ్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఉద్యోగాల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకొనే అవ‌కాశం అందిస్తోంది. ఈ జాబ్స్‌కు ఎలా అప్లై చేసుకోవాలో తెలుసుకోండి.

ఇంకా చదవండి ...
    ప్ర‌ముఖ సాఫ్ట్‌వేర్ (Software) కంపెనీ మెక్రోసాఫ్ట్ ఫ్రెష‌ర్స్‌కు గోల్డెన్ చాన్స్ అందిస్తోంది. కరోనా వైరస్ మహమ్మారి ప్రభావంతో టెక్నాలజీ వినియోగం పెరిగిన సంగతి తెలిసిందే. దీంతో సాఫ్ట్‌వేర్ కంపెనీలకు క్లైంట్లు కూడా పెరుగుతున్నారు. బిజినెస్ పెరుగుతున్నట్టుగా కంపెనీలు జోరుగా నియామకాలు చేపడుతున్నాయి. ఇప్పటికే ఇన్ఫోసిస్ (Infosys) ఈ ఏడాది 55,000 మందిని నియమించుకుంటోంది. ఈ నేప‌థ్యంలో 2022లో బ్యాచ్ విద్యార్థుల‌కు మంచి అవ‌కాశం అందిస్తోంది. వచ్చే ఏడాది అంతకన్నా ఎక్కువగా నియామకాలు ఉంటాయని తెలిపింది. ఇప్పుడు మైక్రోసాఫ్ట్ కూడా నియామకాల జోరును కొనసాగిస్తోంది. బీటెక్, ఎంటెక్, ఎంఎస్ లాంటి కోర్సులు పూర్తి చేసినవారిని ఫుల్ టైమ్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లుగా   నియమించుకుంటోంది. ఈ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది.

    Govt Jobs 2022: ఈ వారం ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సిన ప్ర‌భుత్వ ఉద్యోగాలు.. అర్హ‌త‌లు, వేత‌నం వివ‌రాలు

    అర్హతలు..
    - కంప్యూటర్ సైన్స్‌లో బీటెక్, ఎంటెక్, ఎంఎస్ డిగ్రీ
    - కనీసం 7.5/10 జీపీఏతో 2022 బ్యాచ్‌లో పాస్ కావాలి. అంటే ఫ్రెషర్స్ మాత్రమే దరఖాస్తు చేయాలి.
    - అభ్యర్థులు సింప్లిసిటీ, డ్యూరబిలిటీ, క్వాలిటీ, మెయింటైనెబిలిటీతో సరళంగా కోడ్ రాయగలగాలి. కస్టమర్లను దృష్టిలో పెట్టుకొని పరిష్కారాలు సూచించాలి. మార్పును స్వీకరించగలగాలి. సమయానికి విధులు నిర్వర్తించగలగాలి.

    Jobs in Andhra Pradesh: క‌డ‌ప జిల్లాలో కాంట్రాక్టు ఉద్యోగాలు.. వేత‌నం రూ.15,000.. అర్హ‌త‌లు, అప్లికేష‌న్ విధానం

    ఎలా అప్లై చేసుకోవాలి..

    Step 1- ఈ పోస్టులకు దరఖాస్తు చేయడానికి అభ్యర్థులు  https://careers.microsoft.com/us/en/job/1072686/Software-Engineer-Full-Time-Opportunity లింక్ లోకి వెళ్లాలి.

    Step 2- వివరాలన్నీ చదివిన తర్వాత Apply Now పైన క్లిక్ చేయాలి.

    Step 3- ఆ తర్వాత అభ్యర్థి మైక్రోసాఫ్ట్, లింక్డ్‌ఇన్, పేస్‌బుక్, గూగుల్ లాగిన్ వివరాలతో లాగిన్ చేయాలి.

    Jobs in Telangana: హైద‌రాబాద్ హెచ్ఏఎల్‌లో ఉద్యోగాలు.. వేత‌నం రూ.22,000.. అప్లికేష‌న్ ప్రాసెస్‌

    Step 4- అభ్యర్థి తన వివరాలతో ప్రొఫైల్ క్రియేట్ చేయాలి.

    Step 5- విద్యార్హతల వివరాలు ఎంటర్ చేయాలి.

    ముందుగా ఈ దరఖాస్తులను మైక్రోసాఫ్ట్ పరిశీలించి తర్వాత అభ్యర్థికి సమాచారం అందిస్తుంది. ఆ తర్వాత టెస్ట్ లేదా ఇంటర్వ్యూ ఉంటుంది. ఎంపికైనవారికి హైదరాబాద్, బెంగళూరు, నోయిడాలోని మైక్రోసాఫ్ట్ కార్యాలయాల్లో పోస్టింగ్ లభిస్తుంది. మైక్రోసాఫ్ట్ మాత్రమే కాదు ఇన్ఫోసిస్, టీసీఎస్, విప్రో లాంటి దిగ్గజ ఐటీ కంపెనీలన్నీ ఫ్రెషర్స్‌ని వేల సంఖ్యలో నియమించుకుంటున్నాయి.

    ఐటీ కంపెనీల్లో అవకాశాలు పెరిగిపోతుండటంతో సీనియర్ ఉద్యోగులు ఒక కంపెనీ నుంచి మరో కంపెనీకి వెళ్లిపోతున్నారు. దీంతో భారీగా ఖాళీలు ఏర్పడుతున్నాయి. ఫ్రెషర్స్‌ని నియమించుకొని వారికి శిక్షణ ఇస్తున్నాయి కంపెనీలు.
    Published by:Sharath Chandra
    First published:

    Tags: CAREER, IT jobs, JOBS, Microsoft

    తదుపరి వార్తలు