Home /News /jobs /

IT IS POSSIBLE TO ACHIEVE THE TS SGT JOB MEASURE IF YOU FOLLOW THE TIPS AS MENTIONED BELOW KNR VB

TS SGT Preparation Tips: ఈ టిప్స్ ఫాలో అయితే.. SGT కొలువు సాధించడం సులభమే..!

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ప్రస్తుతం తెలంగాణా లో గురుకుల పోస్టులకు ఆర్థిక శాఖ నుంచి అనుమతి వచ్చిన విషయం తెలిసిందే. త్వరలోనే ఈ నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది. అంతే కాకుండా.. డీఎస్సీ నోటిఫికేషన్ కూడా సాధ్యమైనంత త్వరగా విడుదల చేసే అవకాశం ఉంది. 

    ( P. Srinivas, News 18, Karimnagar)

    ప్రస్తుతం తెలంగాణా లో గురుకుల పోస్టులకు(Telangana Gurukul Posts) ఆర్థిక శాఖ నుంచి అనుమతి వచ్చిన విషయం తెలిసిందే. త్వరలోనే ఈ నోటిఫికేషన్(Notification) వెలువడే అవకాశం ఉంది. అంతే కాకుండా.. డీఎస్సీ నోటిఫికేషన్ కూడా సాధ్యమైనంత త్వరగా విడుదల చేసే అవకాశం ఉంది.  అయితే ప్రైమరీ లెవల్ స్థాయిలో బోధించేందుకు ఎస్జీటీ పరీక్షను నిర్వహిస్తారు. దీనిలో ఎలా విజయం సాధించాలి.. ఉద్యోగం(Job) పొందాలంటే ఎలాంటి స్ట్రాటజీ ఫాలో(Strategy Follow) అవ్వాలి అనే విషయాలను కరీంనగర్ షైన్ తెలంగాణా ఐఏఎస్ అకాడమీ డైరెక్టర్ కరీం రాజు విద్యార్థులకు పలు సూచలను, సలహాలు ఇచ్చారు. వాటి గురించి ఇక్కడ తెలుసుకుందాం.

    SI Prelims Preparation: ఎస్ఐ ప్రిలిమ్స్ లో నెగెటివ్ మార్కులు ఉన్నా.. ఇలా ప్రపేర్ అయితే అర్హత సాధించొచ్చు..


    SGT కొలువు సాధించాలంటే ముందుగా టైమ్ ఎలా వినియోగించుకోవాలో తెలుసుకోవాలి. ఎంత మంచిగా ప్రిపేర్ అయినా.. పరీక్ష హాలులో మాత్రం పరీక్ష జరిగే ఆ 2 నుంచి 3 గంటల సమయం ఎంతో కీలకంగా ఉంటాయి. ఇక స్కూల్ ఆసిస్టెంట్ , పండిత్ పోస్టులకు.. అలాగే SGT పోస్టులకు ఒకే సిలబస్ ఉంటుంది . కాకపోతే ఇక్కడ 4టూ 8వ తరగతి సిలబస్ మాత్రమే ఉంటుంది. పోటీ రీత్యా కూడా SGTకి ఎక్కువ మంది పోటీ పడుతూ ఉంటారు . ఎందుకంటే ఇది టి టి సి, అలాగే టెట్, బియేడ్, డిఎస్పీ వాళ్ళు కూడా రాస్తారు .



    కాబ్బటి ఎక్కువగా పోటీ ఉంటుంది. SGT లో ఎక్కువగా స్కూల్స్ మేనేజమెంట్ కు సంబందించిన సిలబస్ ఉంటుంది. మ్యాథ్స్, సోషల్, సైన్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, అలాగే జనరల్ ఇంగ్లీష్, అండ్ కరెంట్ అఫైర్స్ ఉంటాయి. 100మార్కులు పేపర్ ఉంటుంది. మనము ఎక్కువగా 4తరగతి నుండి 8 తరగతి తెలుగు అకాడమీ బుక్స్ చదివితే సరిపోతుంది. వీటిని గనుక అధ్యయనం చేస్తే మొత్తం కవర్ అవుతుందని అన్నారు . గతంలో కంటే ఈసారి డీఎస్సీ లో చాలా సిలబస్ లో విపరీతమైన మార్పులు వచ్చాయి . గతంలో ఓన్లీ స్కూల్స్ అసిస్టెంట్ వాళ్ళు మాత్రమే డియస్సీ రాసేవారు. కానీ ఇప్పుడు బీఈడీ అర్హత సాధించి.. టెట్ లో క్వాలిఫై అయిన ప్రతీ ఒక్కరూ రాస్తున్నారు. దీంతో పోటీ విపరీతంగా పెరిగిపోయింది.

    Singareni Vacancies: గుడ్ న్యూస్.. సింగరేణిలో మరో ఉద్యోగ నోటిఫికేషన్ జారీ.. 1300 పోస్టులు ఖాళీ..


    ఇంత పోటీ ప్రపంచంలో మనము అందరిలో ముందు ఉండాలంటే ఎక్కువ కష్టపడాలి. కోచింగ్ తీసుకోవాలి. అయితే కోచింగ్ లో కూడా అన్ని చెప్పారు. కాబట్టి సొంతగా ప్రేపరషన్ అనేది కూడా ముఖ్యం. దాదాపు రోజుకు 10 గంటలు చదివితేనే SGT కొట్టగలుగుతారన్నారు. అయితే ప్రతీ గంటకు ప్రిపరేషన్ కొరకు మాత్రమే వినియోగించాలన్నారు. లైబ్రరీ, అలాగే డైలీ న్యూస్ పేపర్.. మార్కెట్ లో దొరికే మంచి పుస్తకాలు, అలాగే ఓల్డ్ మాదిరి ప్రశ్నపత్రాలు.. ఎక్కువగా చదివితే SGT మనదే అంటున్నారు. చాలా మంది కోచింగ్ తీసుకుంటే కొలువు సాధించవచ్చని అనుకుంటారు. కానీ.. అది ఎంత వరకు సాధ్యం కాదని.. కోచింగ్ కేవలం ఒక గైడెన్స్ మాత్రమే అని విద్యార్థులకు సలహా ఇచ్చారు. కోచింగ్ నోట్స్ తో పాటు.. సొంతంగా నోట్స్ తయారు చేసుకుంటూ ప్రిపేర్ అవ్వాలన్నారు.
    Published by:Veera Babu
    First published:

    Tags: Career and Courses, JOBS, Teacher, Teacher jobs

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు