ఇటీవల తెలంగాణలో టీఎస్పీఎస్సీ(TSPSC) నుంచి అతి పెద్ద నోటిఫికేషన్(Notification) గ్రూప్ 4 విడుదలైన సంగతి తెలిసిందే. దీనిలో మొత్తం 9,168 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. నాలుగు విభాగాల్లో ఈ ఖాళీలను భర్తీ చేస్తారు. జూనియర్ అసిస్టెంట్(Junior Assistant), జూనియర్ అకౌంటెంట్(Junior Accountant), జూనియర్ ఆడిటర్(Junior Auditor) అండ్ వార్డు ఆఫీసర్ ఉద్యోగాలు(Ward Officer Jobs) దీనిలో ఉన్నాయి. TSPSC ప్రకటించిన వెబ్ నోట్ లో మొత్తం 25 డిపార్ట్ మెంట్లో ఖాళీలను చూపించారు. దీనిలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్ మెంట్ విభాగంలో 2701 పోస్టులు ఉన్నాయి. వీటిలో వార్డు ఆఫీసర్ ఉద్యోగాలు దాదాపు 2,242 పోస్టులు ఉన్నాయి. అయితే ఇటీవల వీఆర్ఓ వ్యవస్థను రద్దు చేయగా.. అందులో 380 ఉద్యోగాలను వీఆర్ఓలకు కేటాయించారు. అవి కాకుండా.. మిగిలిన 1,862 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు సమాచారం. ఈ వార్డు ఆఫీసర్ పోస్టులు జిల్లాల వారీగా ఖాళీలు ఇలా ఉన్నాయి.
జిల్లా | పోస్టులు | వీఆర్ఓలకు కేటాయించ పోస్టులు | ఖాళీలు |
ఆదిలాబాద్ | 42 | 0 | 42 |
భద్రాద్రి కొత్తగూడెం | 65 | 7 | 58 |
హన్మకొండ | 37 | 0 | 37 |
జగిత్యాల | 100 | 12 | 88 |
జనగాం | 27 | 7 | 20 |
భూపాలపల్లి | 28 | 7 | 21 |
జోగులాంబ గద్వాల | 48 | 8 | 40 |
కామారెడ్డి | 58 | 14 | 44 |
కరీంనగర్ | 72 | 15 | 57 |
ఖమ్మం | 72 | 21 | 54 |
అసిఫాబాద్ | 26 | 0 | 26 |
మహబూబా బాద్ | 50 | 9 | 41 |
మహబూబ్ నగర్ | 72 | 20 | 52 |
మంచిర్యాల | 127 | 30 | 97 |
మెదక్ | 43 | 7 | 36 |
మేడ్చల్ మల్కాజ్ గిరి | 199 | 0 | 199 |
నాగర్ కర్నూల్ | 35 | 0 | 35 |
నల్గొండ | 120 | 30 | 90 |
నారాయణపేట | 19 | 05 | 14 |
నిర్మల్ | 52 | 5 | 47 |
నిజామాబాద్ | 111 | 27 | 84 |
పెద్దపల్లి | 72 | 18 | 54 |
రాజన్న సిరిసిల్ల | 45 | 9 | 36 |
రంగారెడ్డి | 248 | 42 | 206 |
సంగారెడ్డి | 124 | 28 | 96 |
సిద్దిపేట | 64 | 12 | 52 |
సూర్యాపేట | 90 | 18 | 72 |
వికారాబాద్ | 72 | 15 | 57 |
వనపర్తి | 49 | 0 | 49 |
వరంగల్ | 14 | 3 | 11 |
యాదాద్రి భువనగిరి | 58 | 11 | 47 |
మొత్తం | 2242 | 380 | 1862 |
మొత్తం 31 జిల్లాల్లో ఈ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. హైదరాబాద్ , ములుగు జిల్లాల్లో ఎలాంటి వార్డు ఆఫీసర్ ఉద్యోగాలు లేవు.
హైదరాబాద్ జీహెచ్ఎంసీ పరిధిలోకి రావడంతో పాటు ఎటువంటి మున్సిపాలిటీ కలిగి లేదు కావునా.. దీనిలో వార్డు ఆఫీసర్ ఉద్యోగాలు లేవు. అలాగే ములుగు జిల్లాలో కూడా ఎటువంటి మున్సిపాలిటీలు లేవు కావునా.. వార్డు ఆఫీసర్ ఉద్యోగాలు లేవు. మొత్తం వార్డు ఆఫీసర్ ఉద్యోగాలు 2,242 పోస్టులు ఉండగా.. దీనిలో 380 పోస్టుల్లో వీఆర్ఓలకు కేటాయించగా.. 1862 ఖాళీ పోస్టులు ఉన్నాయి. పైన పేర్కొన్న ఖాళీ పోస్టుల్లో రంగారెడ్డి జిల్లాలో (206) అత్యధికంగా వార్డు ఆఫీసర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అతి తక్కువగా వరంగల్ జిల్లాలో (11) ఉన్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Group 4, JOBS, Telangana government jobs, TSPSC