హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Intermediate Students: ఇంటర్ తర్వాత ఏం చేయాలి..? విద్యార్థులు తప్పక తెలుసుకోవాల్సినవి ఇవే..

Intermediate Students: ఇంటర్ తర్వాత ఏం చేయాలి..? విద్యార్థులు తప్పక తెలుసుకోవాల్సినవి ఇవే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

వివిధ రాష్ట్రాలు మరియు కళాశాలల ప్రకారం వారి ఫీజులు భిన్నంగా ఉంటాయి. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్మీడియట్ పరీక్షలు జరుగుతున్న విషయం తెలిసిందే. తర్వాత ఏ కోర్సులు తీసుకోవాలనే వాటిని అవగాహన చాలా మందికి ఉండదు.

  • News18 Telugu
  • Last Updated :
  • Telangana, India

పాఠశాలలో ఎక్కువగా విద్యార్థులు అయినా.. విద్యార్థుల తల్లిదండ్రలు అయినా.. దృష్టి పెట్టే తరగతి 10వ స్టాండర్డ్. దీనిపైనే ఆ పాఠశాల(School) యాజమాన్యం కూడా ఎక్కువగా శ్రద్ధ చూపుతాయి. తర్వాత 11, 12 తరగతులకు కూడా విద్యార్థి ఎంచుకునే కోర్సును బట్టి.. భవిష్యత్ అనేది ఉంటుంది. ఇక 12 తర్వాత ఏ కోర్సు తీసుకోవాలి.. దేని ద్వారా భవిష్యత్(Future) మంచిగా ఉంటుంది అనే ప్రశ్న తరచుగా తలెత్తుతుంది. ఇందులో స్ట్రీమ్, చాయిస్, ఇంట్రెస్ట్(Interest) మొదలైనవాటితో పాటు ఆ కోర్సు ఫీజు(Fee) ఎంత అనేది మరో అంశం కూడా పనిచేస్తుంది. కొన్నిసార్లు తల్లిదండ్రులు అధిక ఫీజులు భరించే పరిస్థితి ఉండదు. కొంతమంది ఆర్థిక స్థోమత కారణంగా తమ పిల్లలను ఉన్నత చదువులు చదివించలేక తక్కువ ఫీజు ఉన్న కోర్సుకు తమ పిల్లలను మార్చాలనకుంటారు.

Jobs In Metro Rail: మెట్రో రైల్ లో ఉద్యోగాలు .. జీతం రూ.25వేలు..

వివిధ రాష్ట్రాలు మరియు కళాశాలల ప్రకారం వారి ఫీజులు భిన్నంగా ఉంటాయి. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్మీడియట్ పరీక్షలు జరుగుతున్న విషయం తెలిసిందే. తర్వాత ఏ కోర్సులు తీసుకోవాలనే వాటిని అవగాహన చాలా మందికి ఉండదు. అయితే.. మంచి పేరు ఉన్న కాళేజీల్లో విద్యార్థులు అడ్మిషన్ ఫీజు పొందాలంటే.. రూ.లక్ష వరకు చెల్లించాల్సి ఉంటుంది. తక్కువ ఫీజుతో డిగ్రీలు పూర్తి చేయాలనుకుంటే.. BA, B.Sc లేదా B.Com వంటి కోర్సులో ప్రవేశం పొందవచ్చు.

మంచి గవర్నమెంట్ కాలేజీలో అడ్మిషన్ వస్తే ఫీజులు కూడా తగ్గుతాయి. ఇక్కడి నుంచి చేసిన కోర్సు విలువ కూడా బాగుంటుంది. ఉదాహరణకు ఢిల్లీ విశ్వవిద్యాలయం, అలహాబాద్ విశ్వవిద్యాలయం మరియు బనారస్ హిందూ విశ్వవిద్యాలయం నుండి ఏదైనా స్ట్రీమ్‌లో చేసిన అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులు చాలా విలువైనవి. అయితే.. ఇక్కడ ప్రవేశానికి అభ్యర్థులు ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణులు కావాలి. సీట్ల కోసం చాలా పోటీ ఉంటుంది. ప్రవేశం అంత సులభం కాదు.

Staff Selection Commission: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి 5369 పోస్టులు.. దరఖాస్తులకు కొన్ని గంటలే సమయం..

తక్కువ డబ్బుతో మంచి విశ్వవిద్యాలయం నుండి కోర్సు చేయడానికి ఏకైక మంత్రం హార్డ్ వర్క్. దీంతో పాటు.. ప్రవేశ పరీక్ష కూడా క్లియర్ చేయడం ముఖ్యం. UG కోర్సు అనేది ఫీజు , కళాశాల మరియు స్ట్రీమ్ వంటి అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది . రూ. 5 వేల నుంచి 70 వేల రూపాయల వరకు బీఏ. రూ. 8 వేల నుంచి రూ. లక్ష వరకు బీఎస్సీ, రూ. 10 వేల నుంచి రూ.70 వేల వరకు ఫీజు చెల్లించి బీకామ్ పూర్తి చేయవచ్చు. నిర్ణీత ఫీజు గురించి ఇక్కడ చెప్పడం అనేది ఒక్కో యూనివర్సిటీ నిబంధనలు వేర్వేరుగా ఉన్నందున ఆ కోర్సుల ఫీజు ఎంత అనేది చెప్పలేము.

ఒక్కో యూనివర్సిటీ, కాలేజీల్లో వేర్వేరుగా ఉంటాయి. కాలేజీలో కోర్సులో జాయిన్ అయ్యే ముందు ఇవన్నీ తెలుసుకుంటే మంచిది. డిగ్రీతో పాటు కొన్ని డిప్లొమా మరియు దూరవిద్యా కోర్సులు కూడా ఈ ఫీజు విధానంలో చేయవచ్చు. ఏ కోర్సు తీసుకోవాలన్నా దానిలో మీ ఆసక్తికి అనుగుణంగా ఉంటుంది. ఆ కోర్సుకు సంబంధించి ట్రెండ్ లేదా జీతం చూసి కోర్సును ఎంచుకోవద్దు. ఎందుకంటే మీ ఆలోచనా విధానం మీరు ఎంచుకున్న కోర్సు వైపు లేనప్పుడు మీరు దాని నుండి భవిష్యత్తును ఎలా తయారు చేసుకోలేరు. అందువల్ల.. కోర్సును జాగ్రత్తగా ఎంపిక చేసుకోవాలి. కొన్ని ప్రాంతాలలో తప్ప.. ప్రభుత్వ కళాశాలల నుండి మంచి కోర్సులు చేయవచ్చని గుర్తుంచుకోండి.

First published:

Tags: Career and Courses, Intermediate jobs, JOBS

ఉత్తమ కథలు