హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Merge Entrance Exams: JEE+NEET=CUET దీనిపై కేంద్ర విద్యాశాఖ మంత్రి క్లారిటీ.. ఏమన్నారంటే..

Merge Entrance Exams: JEE+NEET=CUET దీనిపై కేంద్ర విద్యాశాఖ మంత్రి క్లారిటీ.. ఏమన్నారంటే..

Merge Entrance Exams: JEE+NEET=CUET దీనిపై కేంద్ర విద్యాశాఖ మంత్రి క్లారిటీ.. ఏమన్నారంటే..

Merge Entrance Exams: JEE+NEET=CUET దీనిపై కేంద్ర విద్యాశాఖ మంత్రి క్లారిటీ.. ఏమన్నారంటే..

Merge Entrance Exams: కేంద్ర ప్రభుత్వం (Central Government) విద్యారంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. ఈక్రమంలో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ-2020 (National Education Policy)ను తీసుకొచ్చింది. పూర్తి వివరాలిలా..

  • News18 Telugu
  • Last Updated :
  • Telangana, India

కేంద్ర ప్రభుత్వం (Central Government) విద్యారంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. ఈక్రమంలో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ-2020 (National Education Policy)ను తీసుకొచ్చింది. ఇందులో భాగంగా అండర్ గ్రాడ్యుయేట్ లెవల్‌లో మల్టిపుల్ కోర్సులు చేయడానికి అవకాశం కల్పించడం, మల్టిపుల్ ఎగ్జిట్స్, క్రెడిట్ పాయింట్స్ వంటి వాటిని అమలు చేయాలనుకుంటోంది. అలాగే విద్యార్థులపై పరీక్షల ఒత్తిడి తగ్గించడం కోసం వివిధ ఎంట్రన్స్ ఎగ్జామ్స్‌ను విలీనం చేసి ఒకే ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహించాలని ఇటీవల యూజీసీ (UGC) ఓ ప్రతిపాదన తీసుకొచ్చింది. అయితే ఈ నిర్ణయాన్ని విమర్శిస్తున్నారు కొందరు విద్యారంగ నిపుణులు. ప్రస్తుతం ఒక విద్యార్థి సగటున మూడు లేదా రెండు పరీక్షలకు హాజరవుతున్నారు. దీని వల్ల సమయం వృథా కావడంతో పాటు, వారిపై ఒత్తిడి మరింత ఎక్కువ అవుతుంది. దీంతో ఒకే రకమైన సబ్జెక్ట్స్(Subjects) విద్యార్థులకు వివిధ పరీక్షల స్థానంలో ఉమ్మడిగా ఒకే ప్రవేశ పరీక్ష ఉండేలా యూజీసీ ఆలోచనలు చేసింది. ఈ ప్రక్రియలో భాగంగా సీయూఈటీ, నీట్(NEET), జేఈఈ (JEE) పరీక్షలను ముందుగా విలీనం చేసి ఒకే పరీక్ష నిర్వహించాలని యూజీసీ ఆలోచన.

SBI Jobs: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 665 ఉద్యోగాలు .. దరఖాస్తుకు కొన్ని గంటలే సమయం..

యూజీసీ ప్రాతిపదనపై ఇటీవల ఇన్ఫినిటీలెర్న్ సీఈవో ఉజ్వల్ సింగ్ స్పందించారు. ఎగ్జామ్ ప్యాట్రన్‌ను ఒకే విధంగా మార్పులు చేసిన తరువాత జేఈఈ , నీట్ పరీక్షలను విలీనం చేయాలని చెప్పారు. ప్రస్తుతం నీట్ లో ప్రశ్నల సంఖ్య 200 కాగా, జేఈఈ మెయిన్‌లో 90 మాత్రమే ఉంటాయి. దీంతో ఈ రెండు పరీక్షలను విలీనం చేయాలనుకోవడం చాలా పెద్ద కసరత్తు అవుతుందని, దీని వల్ల విద్యార్థులకు పెద్దగా ప్రయోజనం ఉండదని చెప్పారు.

‘పరీక్షల విలీనం తరువాత కూడా విద్యార్థులు తప్పనిసరిగా ఒక పరీక్ష రాయాలి. ప్రస్తుతం కూడా ఒక పరీక్ష రాస్తున్నారు. కేవలం మెడికల్, ఇంజనీరింగ్ పరీక్షలకు హాజరవుతున్న కొద్ది మంది విద్యార్థుల కోసం అన్ని పరీక్షలను విలీనం చేయాలనుకోవడం మంచిది కాదు. నీట్ పరీక్ష రోజునే ఆఫ్‌లైన్ మోడ్‌లో JEE మెయిన్‌ను నిర్వహించడంపై ఎన్‌టీఏ దృష్టిపెట్టాలి. ఇది విద్యార్థులకు కచ్చితమైన ర్యాంకింగ్‌ను ఇస్తుంది.’ అని ఉజ్వల్ సింగ్ అభిప్రాయపడ్డారు. దీనిలోపై ప్రముఖ విద్యారంగ నిపుణుడు, FIITJEE హెడ్ రమేష్ బట్లీష్ కూడా ఇదే విషయంపై స్పందించారు. సీయూఈటీ, నీట్, జేఈఈ పరీక్షల ప్రస్తుత లెవల్స్ వేటికవే భిన్నంగా ఉన్నాయని, కాబట్టి ఈ పరీక్షల ద్వారా అడ్మిషన్లు చేపట్టే సంస్థలు పరీక్షల విలీనంపై ముందుగా స్పందించాలని చెప్పారు. మరోపక్క ఇప్పటికీ కరోనా మహమ్మారి పూర్తిగా తొలగిపోలేదు. ఇలాంటి సమయంలో పరీక్షల విధానంలో ఏమైనా పెద్ద మార్పులు చోటుచేసుకుంటే, అది విద్యార్థులపై తీవ్ర ప్రభావం చూపనుందని రమేష్ అభిప్రాయపడ్డారు.

ఇది చదవండి: IIITDMలో ఘనంగా నాలుగో స్నాతకోత్సవ వేడుకలు..టాపర్స్‌కు గోల్డ్‌మెడల్స్‌తో సత్కారం..!

తాజగా దీనిపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ క్లారిటీ ఇచ్చారు. JEE మెయిన్, నీట్ లను కామన్ యూనివర్సిటీ Entrance టెస్టు (CUET)లో విలీనం చేసే ప్రక్రియ మరో రెండేళ్ల వరకు ఉండదని స్పష్టం చేశారు. తాజాగా కేంద్ర మంత్రి ఈ ప్రకటనతో పేరెంట్స్, విద్యార్థులు ఊపిరిపీల్చకున్నారు. అన్ని ప్రవేశ పరీక్షల్లో ఒకే సబ్జెక్టులు ఉన్నందున ప్రత్యేకంగా JEE మెయిన్, నీట్ అవసరం లేదని, వాటిని సీయూఈటీలో విలీనం చేస్తామని యూజీసీ చైర్మన్ గత నెలలో ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిపై వివిధ విభాగాల విద్యా నిపుణులు భిన్నాభిప్రాయంలు వ్యక్తం చేశారు. ఈ విలీనం వల్ల ఎంత లాభం ఉందో.. అంతే నష్టం కూడా ఉందనేది వారి వాదన. అయితే ఇటీవల ఈ ప్రతిపాదనపై లోతుగా అధ్యయనం చేయడానికి యూజీసీ ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ కూడా రెండేళ్ల వరకు వాయిదా పడినట్లే.

Published by:Veera Babu
First published:

Tags: Career and Courses, CUCET 2022, CUET 2022, Jee main 2022, JOBS, NEET 2022

ఉత్తమ కథలు