కరోనా (Corona) మహ్మమారి ఐటీ రంగంపై తీవ్ర ప్రభావం చూపింది. కోవిడ్ నేపథ్యంలో టాప్ కంపెనీలు ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశం కల్పించాయి. ప్రస్తుతం వైరస్ నియంత్రణలో ఉండడంతో ఐటీ కంపెనీలు తమ ఉద్యోగులను ఆఫీసులకు రమ్మని కోరుతున్నాయి. అయితే చాలా మంది ఉద్యోగులు ఆఫీసులకు రావడానికి సుముఖంగా లేరు. దీంతో కంపెనీలు భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని దీర్ఘకాలికంగా వర్క్ ఫ్రమ్ హోమ్ (WFH) కొనసాగించడానికి ప్రణాళికలు రచిస్తున్నాయి. ఇప్పటికే టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్‌తో సహా చాలా ఐటీ కంపెనీలు హైబ్రిడ్ మోడల్‌ను ఎంచుకుంటున్నట్లు ప్రకటించాయి.
TS Inter, 10th Results: తెలంగాణ ఇంటర్, పదోతరగతి ఫలితాలపై స్పష్టత.. విడుదల తేదీలు ఇవే!
ప్రముఖ ఐటీ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) రాబోయే రోజుల్లో హైబ్రిడ్ మోడల్ వర్క్ ఎలా ఉండబోతుందనే దానిపై వివరణ ఇచ్చింది. 3E మోడల్(ఎంబ్రేస్, ఎనేబుల్, ఎంపవర్) అవలంభిస్తున్నట్లు టీసీఎస్ పేర్కొంది. భవిష్యత్తులో ఎక్కడి నుంచైనా పని చేసే సౌలభ్యంతో ఇది హైబ్రిడ్ మోడల్‌లో భాగం కానుందని స్పష్టం చేసింది.
టీసీఎస్ 3E విధానం
ఎంబ్రేస్ (Embrace) - ఇంటి నుండి పని చేసే సమయంలో ఉద్యోగానికి పూర్తి సమయం కేటాయించడం సవాల్‌తో కూడుకున్నది. ఇంటి పనులు, పిల్లల చదువు, ఇతర బాధ్యతలు ఉంటాయి. కాబట్టి ఉద్యోగం, ఇంటి పనుల మధ్య స్పష్టమైన విభజన ఉండాలి. దీనికి కొంత నిర్మాణాత్మక ఆలోచనతో ఉండాలి. ప్రాధాన్యతను బట్టి పనులకు సమయం కేటాయించుకుంటే సరిపోతుంది.
ఎనేబుల్(Enable) - ఎక్కడి నుంచైనా పనిచేయడానికి ఉద్యోగులు సిద్ధంగా ఉన్నా.. అక్కడ వాతావరణం ఎలా ఉంటుందో సంస్థలు అంచనా వేసుకోవాలి. ముఖ్యంగా వర్క్, ఎంటర్ ట్రైన్‌మెంట్ మధ్య సమతుల్యతను సంస్థలు కచ్చితంగా నిర్ధారించుకోవాలి. ఉద్యోగులకు పని ఒత్తిడిని తగ్గించడానికి, పనిలో ఆనందాన్ని తీసుకురావడానికి ఐటీ సంస్థలు అనేక కార్యక్రమాలు చేపట్టవచ్చు. తద్వారా అనుకున్న లక్ష్యాన్ని సాధించడానికి మార్గం సుగమమవుతుంది.
ఎంపవర్ (Empower) - వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితం వర్క్ ఫ్రమ్ హోమ్‌కారణంగా రెండు కలిసిపోయాయి. దీంతో అటు సంస్థలు ఇటు ఉద్యోగులు ‘వర్క్ ఫ్రమ్ ఎనీ వేర్’ కోసం కొత్త మార్గాల్లో సాధికారత పొందాలి. వ్యక్తిగత, ఉద్యోగ జీవితానికి మధ్య అంతరాలను తగ్గించడానికి సామాజిక-సాంకేతిక పరిష్కారాలు అవసరం. రిమోట్ పనిని సులభతరం చేయడానికి, ఉద్యోగుల పని ఒత్తిడిని తగ్గించడానికి ఇంటి వద్ద ఉద్యోగ సమయంలో ఫ్లెక్సిబులిటీ ఉండాలి. అదే సమయంలో ఫోకస్, ఉత్పాదకత విషయం కూడా సవాల్‌లాంటిదే. ఇందుకు ఉద్యోగులు స్వీయ క్రమశిక్షణ పాటించాల్సి ఉంటుంది.
ఇన్ఫోసిస్ లాంగ్-టర్మ్ వర్క్ ఫ్రమ్ హోమ్ ప్లాన్
వర్క్ ఫ్రమ్ హోమ్ విషయంలో ఇన్ఫోసిస్ మూడు దశల ప్రణాళికను అవలంభించనుంది. మొదటి దశలో కంపెనీ DC(డెవలప్ మెంట్ సెంటర్స్) ఉన్న నగరాలు లేదా వాటికి సమీపంలో ఉన్న పట్టణాల నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్న ఉద్యోగులను వారానికి రెండుసార్లు కార్యాలయానికి వచ్చేలా ప్రోత్సహించనుంది.
AIIMS Recruitment: మంగళగిరి ఎయిమ్స్‌లో జాబ్స్.. నేరుగా వాక్ ఇన్ ద్వారా ఎంపిక.. అర్హతల వివరాలు
రెండవ దశలో, DC పట్టణాలకు వెలుపల ఉన్న ఉద్యోగులను తమ బేస్ డెవలప్‌మెంట్ కేంద్రాలకు తిరిగి రాగలరో లేదో చూడటానికి రాబోయే కొద్ది నెలల్లో సన్నాహాలు ప్రారంభించనున్నామని కంపెనీ చీఫ్ ఫైనాన్షియల్ (Financial) ఆఫీసర్ నిలంజన్ రాయ్ తెలిపారు. దీర్ఘ కాలంలో కరోనా పరిస్థితులు, క్లయింట్లు, ఇతర విషయాలను పరిగణలోకి తీసుకుని హైబ్రిడ్ మోడల్‌ను అనుసరిస్తామన్నారు.
హైబ్రిడ్ మోడల్ కోసం హెచ్‌సీఎల్ టెక్ ప్లాన్
టెక్ మేజర్ కంపెనీ హెచ్‌సీఎల్ టెక్నాలజీ (Technology) స్ కూడా ప్రస్తుతం హైబ్రిడ్ మోడ్‌తో కొనసాగుతోంది. ఉద్యోగులు, వారి కుటుంబాల భద్రత, శ్రేయస్సు తమ ప్రాధాన్యతలలో ఒకటి అని HCL ప్రతినిధి తెలిపారు. అలాగే వ్యాపార సాధారణ స్థితిని కొనసాగించడానికి, తద్వారా క్లయింట్‌లకు నిరంతరాయమైన సేవలను అందించడానికి కట్టుబడి ఉన్నామని తెలిపారు. ప్రస్తుతం పరిస్థితిని పర్యవేక్షిస్తున్నాం, దీర్ఘకాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని హైబ్రిడ్ మోడల్‌లో పనిచేయడాన్ని నిర్ణయించుకున్నట్లు ఆయన తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Hcl, Infosys, IT Employees