కరోనా (Corona) సమయంలో చాలా బిజినెస్‌లు (Business) తీవ్ర ఒడిదొడుకులు ఎదుర్కొన్నాయి. ఐటీ సంస్థలదీ (IT Companies) అదే పరిస్థితి. అయితే కొవిడ్ తగ్గుముఖం పట్టాక ఐటీ కంపెనీలు ఉద్యోగులను (Jobs) భారీగా నియమించుకున్నాయి. చాలా కంపెనీలు వర్క్‌ఫోర్స్ పెంచుకున్నాయి. కానీ ఆ జోరు ఇప్పుడు కనిపించడం లేదు. ఆర్థిక మాంద్యం ప్రభావంతో ఐటీ కంపెనీలు తమ విధానాలు మార్చుకుంటున్నాయి. ఖర్చును తగ్గించుకునే మార్గాలను అన్వేషిస్తున్నాయి. ఇటీవల ఇండియన్ ఐటీ కంపెనీలు పోస్ట్ చేసిన రిజల్ట్స్ ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. దేశంలోని 10 అతిపెద్ద IT సేవల సంస్థల్లో ఐదు కంపెనీలు సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికంలో సేల్స్, సపోర్టింగ్ స్టాఫ్ తగ్గినట్లు నివేదించాయి. చాలా కంపెనీలు నాన్ రెవెన్యూ జనరేటింగ్ ఉద్యోగులను వదిలివేసి, రిక్రూట్‌మెంట్లను అనధికారికంగా నిలిపేశాయి.
వర్క్‌ఫోర్స్ తగ్గింపు
దేశంలోని నాలుగు, ఐదో స్థానంలో ఉండే విప్రో లిమిటెడ్, టెక్ మహీంద్రా జులై- సెప్టెంబర్ త్రైమాసికంలో వరుసగా సేల్స్, సపోర్టింగ్ స్టాఫ్, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ల సంఖ్య తగ్గినట్లు చూపాయి. L&T కింద ఉన్న మూడు IT సంస్థలలో అతి చిన్నది, హైదరాబాద్‌కు చెందిన Cyient Ltd కూడా తాజా త్రైమాసికంలో సేల్స్, సిబ్బందిని కుదించింది. పదో స్థానంలోని Zensar Ltd కూడా వర్క్‌ఫోర్స్‌ను తగ్గించింది. 2020 ఏప్రిల్-జూన్ తర్వాత ఏదైనా పెద్ద ఐటీ సంస్థలో ఉద్యోగుల సంఖ్య వరుసగా తగ్గడం ఇదే తొలిసారి.
ఆర్థిక మాంద్యం ప్రభావంతో మారుతున్న విధానాలు
బిజినెస్ ఆన్‌లైన్‌లోకి మారడంతో కరోనా సమయంలో ఐటీ సేవల సంస్థలు నియామకాల జోరు పెంచాయి. 2020 జూలై, 2022 సెప్టెంబర్ మధ్య 10 అతిపెద్ద IT సంస్థలు తమ వర్క్‌ఫోర్స్‌లో దాదాపు మూడింట ఒకవంతు లేదా అర మిలియన్ మందిని చేర్చుకున్నట్లు మింట్ రిపోర్ట్ పేర్కొంటోంది. సెప్టెంబరు 30 చివరి నాటికి 10 అతిపెద్ద IT సంస్థలలో మొత్తం 1.74 మిలియన్ల సిబ్బంది ఉన్నట్లు సమాచారం. కానీ రాబోయే మాంద్యం, క్షీణిస్తున్న లాభాలతో కొన్ని సాంకేతిక సేవల సంస్థల విధానాన్ని మార్చుకుంటున్నాయి.
విప్రోలో అనుమతి తప్పనిసరి
విప్రో తన ఫెసిలిటీస్ మేనేజ్‌మెంట్ గ్రూప్‌లోని 250 మందిలో 130 మందిని రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ అయిన CBREకి “రీబ్యాడ్జ్” చేసింది. దీంతో పెద్ద క్యాంపస్‌లను నిర్వహించే ఈ సిబ్బంది రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ పేరోల్ కిందకు వస్తారని ఓ ఎగ్జిక్యూటివ్ చెప్పారు. అదనంగా కంపెనీలోని ఏ విభాగంలోనైనా 10,000 డాలర్ల కంటే ఎక్కువ ఖర్చు చేసే ఏదైనా వస్తువు కోసం CEO ఆఫీస్ ఆమోదం పొందాల్సి ఉంటుందని వివరించారు. ఖర్చును తగ్గించుకునే పనిలో భాగంగా విప్రో ఈ చర్యలు తీసుకుంటోందని పేర్కొన్నారు. విప్రో ఆపరేటింగ్ మార్జిన్ సెప్టెంబర్ త్రైమాసికం చివరి నాటికి 15.1%గా ఉంది, 2020 జూన్ చివరి నాటికి 19.2% నుంచి 410 బేసిస్ పాయింట్లను తగ్గించింది.
పొజిషన్లు భర్తీ చేయని టెక్ మహీంద్రా
టెక్ మహీంద్రా ప్రాఫిటబిలిటీ తాజా త్రైమాసికం చివరిలో 11.4%గా పేర్కొంది. అదే 2020 జూన్ చివరిలో 10.1%గా ఉంది. కానీ జూన్ త్రైమాసికం చివరిలో దాని నిర్వహణ మార్జిన్ గరిష్టంగా 15.2%కి చేరుకుంది. దీంతో కంపెనీ ఖర్చులను తగ్గించే మార్గాలను అన్వేషిస్తోంది. ప్రస్తుతానికి చాలా ప్రాజెక్ట్‌లలో పొజిషన్లు తిరిగి భర్తీ చేయడం లేదని టెక్ మహీంద్రా ఎగ్జిక్యూటివ్ చెప్పారు. సెప్టెంబర్ త్రైమాసికం చివరి నాటికి టెక్ మహీంద్రా 163,912 మంది సిబ్బందిలో 53% మంది సాఫ్ట్‌వేర్ నిపుణులుగా ఉన్నారు. 42% మంది BPO నిపుణులు. మిగిలిన వారు సేల్స్, సహాయక సిబ్బంది.
ఆచితూచి వ్యవహరిస్తున్న ఐటీ కంపెనీలు
మూడు అతిపెద్ద ఐటీ సేవల సంస్థలైన- టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ లిమిటెడ్, ఇన్ఫోసిస్ లిమిటెడ్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ లిమిటెడ్‌లలో నియామకాల వేగం కూడా రెండేళ్లలో జులై- సెప్టెంబర్‌లో అత్యంత నెమ్మదిగా ఉంది. IT సంస్థలలో మొత్తం ఖర్చులలో సిబ్బంది ఖర్చులు 55-65% వరకు ఉంటాయి. ఈ కారణంగా కొన్ని సంస్థలు అనుభవజ్ఞులైన నిపుణులను నియమించుకోవడంలో ఆచితూచి అడుగులు వేస్తున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Career and Courses, IT jobs, JOBS