హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

అప్పటి వరకు ఐటీ ఉద్యోగులకు Work From Home.. క్లారిటీ ఇచ్చిన డిప్యూటీ సీఎం

అప్పటి వరకు ఐటీ ఉద్యోగులకు Work From Home.. క్లారిటీ ఇచ్చిన డిప్యూటీ సీఎం

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

కరోనా కేసులు పెరుగుతుండడం.. సెకండ్ వచ్చే ప్రమాదం ఉందన్న హెచ్చరికల నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తమ రాష్ట్రంలో ఐటీ సెక్టార్ లో వర్క్ ఫ్రం హోం మరిన్ని నెలల పాటు కొనసాగుతుందని ప్రకటించింది.

కరోనా కేసులు పెరుగుతుండడం.. సెకండ్ వచ్చే ప్రమాదం ఉందన్న హెచ్చరికల నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తమ రాష్ట్రంలో ఐటీ సెక్టార్ లో వర్క్ ఫ్రం హోం మరిన్ని నెలల పాటు కొనసాగుతుందని ప్రకటించింది. ఈ మేరకు ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఐటీ మంత్రి అశ్వత్ నారాయణ్ తాజాగా కీలక ప్రకటన చేశారు. ఈ కరోనా మహమ్మారి మరి కొన్ని నెలల పాటు ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో ఐటీ ఉద్యోగులు, కంపెనీలకు ఈ విషయాన్ని తెలుపుతున్నామన్నారు. లాక్ డౌన్ ప్రారంభం నుంచి ఐటీ, ఐటీ ఆధారిత కంపెనీలు వర్క్ ఫ్రం కారణంగా విధులు నిర్వర్తించేందుకు కేంద్రం అనుమతులు ఇచ్చింది. తాజాగా మార్చ్ 2021 వరకు దాన్ని పొడిగించింది. బెంగళూరు మహానగరం ఐటీకి దేశంలోనే పేరు గాంచింది. అయితే వర్క్ ఫ్రం హోం నేపథ్యంలో ఐటీ ఉద్యోగులెవరూ బయటకు రావడం లేదు. దీంతో క్యాబ్ లు, హోటళ్లు సరిగా నడవక పోవడంతో అనేక మంది ఉపాధి కోల్పాయారు. ముఖ్యంగా క్యాబ్ లు, ప్రైవేటు వాహనాలు నడిపే వారి పరిస్థితి దారుణంగా తయారైంది.

ఇదిలా ఉంటే.. కరోనా దెబ్బకు దాదాపు అన్ని రంగాలు కుదేలయ్యాయి. అనేక మంది ఉపాధి, ఉద్యోగాలు కోల్పోయి రోడ్డున పడ్డారు. లాక్ డౌన్ సమయంలో కొత్త నియామకాలు అసలు జరగలేదు. దీంతో ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వారు తీవ్ర నిరాశకు గురయ్యారు. అయితే ప్రస్తుతం అన్ లాక్ నేపథ్యంలో మళ్లీ పరిస్థితులు సాధారణ స్థితికి చేరుతున్నాయి. ఈ నేపథ్యంలో మళ్లీ ఉద్యోగావకాశాలు పెరుగుతున్నాయని తాజా నివేదిక తెలిపింది. అయితే కరోనా దెబ్బకు గతేడాది కంటే 6 శాతం నియామకాలు తగ్గాయని నివేదిక వెల్లడించింది. ఈ మేరకు Monster Employment Report 2020 వెల్లడించింది. ఈ నివేదిక ప్రకారం.. ఈ ఏడాది మొదటి త్రైమార్షికంలో గతేడాదికంటే 9 శాతం కన్నా అధికంగా నియామకాలు జరిగాయని తేలింది. అయితే కరోనా నేపథ్యంలో నియామకాలు తగ్గడంతో ఈ ఏడాది చివరి నాటికి ఆ గతేడాదితో పోల్చితే నియామకాలు 6 శాతం తగ్గినట్లుగా నమోదైంది.

అయితే గత కొన్ని నెలలుగా నియామకాలు మళ్లీ పెరిగాయి. దీంతో రానున్న కొత్త ఏడాది 2021లో మంచి ఉద్యోగవకాశాలు ఉంటాయని నివేదిక వెల్లడించింది. కరోనా విజృంభించిన సమయం ఏప్రిల్-జూలై మధ్యలో బీపీఓ, ఐటీఈఎస్ ఉద్యోగాలు 48 శాతం తగ్గాయని పేర్కొంది. బ్యాంకింగ్, ఫైనాన్సియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ రంగాల్లో సైతం 48 శాతం తగ్గాని తెలిపింది. ప్రొడక్షన్, మానుఫాక్చరింగ్ రంగాల్లో 46 శాతం, ట్రావెల్ మరియూ టూరిజం రంగాల్లో 76 శాతం తగ్గుదల నమోదైందని వెల్లడించింది.

First published:

Tags: IT Employees, Karnataka, Work From Home

ఉత్తమ కథలు