హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

IT Employees: ఐటీ ఉద్యోగుల‌కు అల‌ర్ట్‌.. స్టార్ట‌ప్‌లో ఉద్యోగ సంక్షోభం.. జీతాలు త‌గ్గే చాన్స్ ఉందా?

IT Employees: ఐటీ ఉద్యోగుల‌కు అల‌ర్ట్‌.. స్టార్ట‌ప్‌లో ఉద్యోగ సంక్షోభం.. జీతాలు త‌గ్గే చాన్స్ ఉందా?

(ప్ర‌తీకాత్మ‌క చిత్రం)

(ప్ర‌తీకాత్మ‌క చిత్రం)

IT Employees | ప్ర‌స్తుతం ఐటీ సెక్టార్‌లో ఉద్యోగుల తొలగింపు సీజన్ కొన‌సాగుతోంది. క‌రోనా త‌రువాత దెబ్బ‌తిన్న ఆర్థిక స్థితిత కార‌ణంగా ప‌లు కార‌ణాల‌తో కంపెనీలను, ముఖ్యంగా స్టార్టప్‌లను దెబ్బతిన్నాయి. దీంతో ఉద్యోగుల తొల‌గింపు పెరిగింది. ముఖ్యంగా దేశంలో స్టార్టప్‌ కంపెనీల్లో ఉద్యోగ సంక్షోభం మొదలైంది.

ఇంకా చదవండి ...

ప్ర‌స్తుతం ఐటీ సెక్టార్‌ (IT Sector) లో ఉద్యోగుల తొలగింపు సీజన్ కొన‌సాగుతోంది. క‌రోనా త‌రువాత దెబ్బ‌తిన్న ఆర్థిక స్థితిత కార‌ణంగా ప‌లు కార‌ణాల‌తో కంపెనీలను, ముఖ్యంగా స్టార్టప్‌లను దెబ్బతిన్నాయి. దీంతో ఉద్యోగుల తొల‌గింపు పెరిగింది. ముఖ్యంగా దేశంలో స్టార్టప్‌ కంపెనీ (Startup Companies) ల్లో ఉద్యోగ సంక్షోభం మొదలైంది. పలు ఎడ్యుటెక్‌ స్టార్టప్‌ కంపెనీల్లో ఒకేసారి వందల మంది ఉద్యోగులను తొలగిస్తున్నారు. అదే సమయంలో ఐటీ రంగంలోని ప్రముఖ కంపెనీలు భారీ వేతనాలతో ఉద్యోగులను నియమించుకొంటున్నాయి. ప‌లు చిన్నా, పెద్ద ఐటీ సంస్థ‌ల‌తోపాటు స్టార్ట‌ఫ్ కంపెనీలు, సాంకేతిక రంగంలో పనిచేస్తున్న 15,000 మంది వ్యక్తులు మే నెలలో ప్రపంచవ్యాప్తంగా తమ ఉద్యోగాన్ని కోల్పోయారు. లేఆఫ్ అగ్రిగేటర్ layoffs.fyi ప్రకారం, ఈ నెలలో 15,000 కంటే ఎక్కువ మంది టెక్ కార్మికులు తమ ఉద్యోగాలు కోల్పోయారు.

New Course: 5జీ టెక్నాలజీస్‌పై స్పెష‌ల్ కోర్సు.. ఐఐఎస్‌సీ బెంగళూరు స్పెష‌ల్‌ ప్రోగ్రామ్

పెద్ద కంపెనీల్లో భారీగా రిక్రూట్‌మెంట్‌

మ‌రోవైపు పుల్‌స్టాక్‌ డెవలపర్‌ ఉద్యోగానికైతే ఏకంగా 70-120 శాతం పెరుగుదలతో వేతనాలిస్తున్నాయి. టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌, విప్రో వంటి ప్రముఖ కంపెనీలు ఏడాది కాలంలో సుమారు 2.3 లక్షల మంది ఐటీ ఉద్యోగులను నియమించుకొన్నాయి. ప్రస్తుతానికైతే ఐటీ కంపెనీల్లో ఉద్యోగాలే సురక్షితమని నిపుణులు చెప్తున్నారు. దేశంలో ఐటీ ఉద్యోగుల సంఖ్య ఒక్కసారిగా 400 శాతం పెరిగిందని పలు ఉద్యోగ నియామక సంస్థలు వెల్లడించాయి. అయితే, ఇదే పరిస్థితి మునుముందు ఉండకపోవచ్చనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

SSC Phase-10 Preparation: స్టాఫ్ సెల‌క్ష‌న్ క‌మిష‌న్‌లో 2065 ఉద్యోగాలు.. ప‌రీక్ష విధానం, ప్రిప‌రేష‌న్ టిప్స్ ఫాలో అవ్వండి

పెరిగిన ద్ర‌వ్యోల్బ‌ణం..

ఈ పరిస్థితి మునుముందు కొనసాగే అవకాశం ఉండదని, అమాంతంగా పెరిగిన వేతనాలు ఒక బుడగ లాంటివేనని నిపుణులు చెప్తున్నారు. ఆ బుడగ ఎప్పుడైనా పేలవచ్చని, దాంతో ఉద్యోగుల వేతనాల్లో కోత తప్పదని అంటున్నారు. అమెరికాలో ద్రవ్యోల్బణం పెరిగిపోయి మాంద్యం భయాలు అలముకొంటున్నాయి. దీంతో ఐటీ కంపెనీల షేర్ల విలువ తగ్గుతున్నది. ఇది మన దేశంలోనూ ప్రభావం చూపే అవకాశం ఉన్నదని అంటున్నారు. ఈ పరిస్థితుల దృష్ట్యా ఐటీ కంపెనీల్లో వేతనాల చెల్లింపుల్లో కొంత సర్దుబాటు ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

TSSPDCL Preparation: విద్యుత్ శాఖ‌లో కొలువు కొట్టాలంటే.. ఈ టాపిక్స్‌పై ప‌ట్టు సాధించాలి.. టీఎస్ఎస్‌పీడీసీఎల్‌ ప్రిప‌రేష‌న్ ప్లాన్‌

ఈ నివేదిక‌న‌ను టెక్ క్రంచ్ నివేదించింది. కోవిడ్-19 మహమ్మారి ప్రారంభమైన మార్చి 2020 నుండి, ప్రపంచవ్యాప్తంగా దాదాపు 718 స్టార్టప్‌ల ద్వారా 1.25 లక్షల మంది ఉద్యోగులను తొలగించారు. టెక్ కంపెనీలు పెరుగుతున్న ద్రవ్యోల్బణం, మాంద్యం భయం, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం వంటి బహుళ సమస్యలను ఎదుర్కొంటున్నాయి. భారతదేశంలో, స్టార్టప్‌లు మరియు యునికార్న్‌లు నాన్-పెర్ఫార్మింగ్ వర్టికల్స్‌ను మూసివేసి, మార్కెటింగ్ వ్యయాన్ని తగ్గించి, తాజా నియామకాలను స్తంభింపజేయడంతో 6,000 మందికి పైగా "పునర్నిర్మాణం" మరియు "ఖర్చు తగ్గింపు" పేరుతో తలుపులు చూపించబడ్డాయి.

First published:

Tags: IT Employees, Private Jobs

ఉత్తమ కథలు