I-T Department Recruitment 2021: నిరుద్యోగులకు శుభవార్త.. ఐటీ శాఖలో ఉద్యోగాలు.. వివరాలివే

ప్రతీకాత్మక చిత్రం

పలు ఉద్యోగాల భర్తీకి ఐటీ శాఖ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

  • Share this:
    ఆదాయ పన్ను శాఖ నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. పలు ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు చీఫ్ కమిషనర్ ఆఫ్ ఇన్ కం ట్యాక్స్, ముంబాయి నోటిఫికేషన్ విడుదల చేశారు. ట్యాక్స్‌ అసిస్టెంట్‌, ఇన్‌కం ట్యాక్స్‌ ఇన్‌స్పెక్టర్‌, ఎంటీఎస్‌ విభాగాల్లో ఈ ఖాళీలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. స్పోర్ట్స్ కోటాలో ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునేందుకు ఆగస్టు 25ను ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా అప్లై చేసుకోవాలని సూచించారు.
    DRDO Jobs 2021: నిరుద్యోగులకు అలర్ట్... డీఆర్‌డీఓలో ఉద్యోగాలు.. ఖాళీల వివరాలు ఇవే
    Free Coaching for IBPS Exams: ఐపీపీఎస్ ఉద్యోగాలకు ఫ్రీ కోచింగ్.. ఇలా అప్లై చేసుకోండి.. పూర్తి వివరాలివే

    ఖాళీలు, విద్యార్హతల వివరాలు..
    మొత్తం 155 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఇందులో ఇన్ కం ట్యాక్స ఇన్స్పెక్టర్ విభాగంలో 8, ట్యాక్స్ అసిస్టెంట్ విభాగంలో 83, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ విభాగంలో 64 ఖాళీలు ఉన్నాయని నోటిఫికేషన్లో తెలిపారు. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ విభాగంలోని పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు టెన్త్ పాసై ఉండాలి. మిగిలిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు తప్పనిసరిగా డిగ్రీ పూర్తిచేసి ఉండాలి. దీంతో పాటు రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడల్లో, యూనివర్సిటీ స్థాయి టోర్నమెంట్లు, రాష్ట్ర స్పోర్ట్స్‌ స్కూల్‌ జట్టులో సభ్యుడై జాతీయ క్రీడల్లో ఏదో ఒకటి పాల్గొని ఉండాలని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు. అభ్యర్థులు ఇతర పూర్తి వివరాలను నోటిఫికేషన్లో చూడొచ్చు.
    Official Website - Direct Link

    వయో పరిమితి..
    ఇన్ కం ట్యాక్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాలకు అప్లై చేయాలనుకుంటున్న వారి వయస్సు 18 నుంచి 30 ఏళ్లు ఉండాలి. ఇన్ కం ట్యాక్స్ అసిస్టెంట్ ఉద్యోగాలకు అప్లై చేయాలనుకుంటున్న వారి వయస్సు 18 నుంచి 27 ఏళ్లు ఉండాలి. మల్టి టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలనుకుంటున్న వారి వయస్సు 18 నుంచి 25 ఏళ్లు ఉండాలి.
    Published by:Nikhil Kumar S
    First published: