హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

IIT Delhi : బీటెక్‌లో ఎనర్జీ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్.. జేఈఈ అడ్వాన్స్‌డ్ స్కోర్స్ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తున్న ఐఐటీ ఢిల్లీ

IIT Delhi : బీటెక్‌లో ఎనర్జీ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్.. జేఈఈ అడ్వాన్స్‌డ్ స్కోర్స్ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తున్న ఐఐటీ ఢిల్లీ

ఐఐటీ ఢిల్లీ

ఐఐటీ ఢిల్లీ

IIT Delhi : ఢిల్లీలోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (Indian Institute of Technology) కొత్త అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది. అదే బీటెక్‌లో ఎనర్జీ ఇంజనీరింగ్ కోర్సు. ఈఈ అడ్వాన్స్‌డ్ 2021 (JEE Advanced 2021) కి అర్హత సాధించిన విద్యార్థులు ఈ కోర్సుకు అర్హులు.

ఇంకా చదవండి ...

టీవలి కాలంలో ఐఐటీ (IIT) సంస్థలు విద్యార్థుల కోసం అత్యుత్తమ కోర్సులను తీసుకొస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా ఐఐటీ ఢిల్లీ (IIT Delhi) ఓ సరికొత్త అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది. ఎనర్జీ ఇంజనీరింగ్‌ ఇన్ బీటెక్ (BTech in Energy Engineering) పేరుతో ఈ ప్రోగ్రామ్‌ను తీసుకొచ్చింది. జేఈఈ అడ్వాన్స్‌డ్ 2021 పరీక్షలో అర్హత సాధించిన విద్యార్థులు ఈ ప్రోగ్రామ్‌లో అడ్మిషన్‌ (Admission) పొందవచ్చు. 2021-2022 అకడమిక్ సెషన్ నుంచి 40 మంది విద్యార్థులతో ఈ ప్రోగ్రామ్‌ను ఐఐటీ ఢిల్లీలోని ఎనర్జీ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ డిపార్ట్‌మెంట్ ( Energy Science and Engineering Department)  ప్రారంభిస్తుంది. ఎనర్జీ ఇంజనీరింగ్‌ బీటెక్ ప్రోగ్రామ్ ద్వారా విద్యార్థులకు ఎనర్జీ రంగానికి సంబంధించి అవసరమైన జ్ఞానం అందించి, నైపుణ్యాల (Skills) ను పెంపొందించడమే ఐఐటీ ఢిల్లీ ముఖ్య ఉద్దేశమని ఎనర్జీ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగం హెడ్ ప్రొఫెసర్ కె.ఏ సుబ్రహ్మణ్యం చెప్పారు.

NIT Warangal: కెరీర్‌కు బూస్టప్.. నిట్ వరంగల్ పైథాన్ ప్రోగ్రామింగ్‌పై ​ఆన్‌లైన్ కోర్స్‌.. వివ‌రాలు ఇవే


ప్రస్తుతం వేగంగా అభివృద్ధి చెందుతున్న రంగాల్లో ఎనర్జీ రంగం కూడా ఒకటని.. ఇందులో అనేక ఉద్యోగావకాశాలు (Job opportunities)  పెరుగుతున్నాయని ఆయన వివరించారు. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని వివిధ ఎనర్జీలు, పర్యావరణ సంబంధిత సవాళ్లను సమూలంగా పరిష్కరించగల మానవ వనరులను అభివృద్ధి (Development) చేయవలసిన అవసరం ఉందని పేర్కొన్నారు.

ఐఐటీ ఢిల్లీ డైరెక్టర్ ప్రొఫెసర్ వి.రాంగోపాల్ రావు మాట్లాడుతూ.. "ఆర్థికాభివృద్ధి, పర్యావరణ స్థిరత్వంపై ప్రతికూల ప్రభావాలు ఉన్నందున ఎనర్జీ రంగం కీలకంగా మారింది. అందువల్ల, ఎనర్జీ సెక్టార్ లో అనేక అవకాశాలు (opportunities) పుట్టుకొస్తున్నాయి. ఇంధన రంగంలో వృత్తిని చేపట్టడానికి మక్కువ ఉన్న విద్యార్థులు, ఐఐటీ ఢిల్లీ ద్వారా అందిస్తున్న కొత్త బీటెక్ ఇన్ ఎనర్జీ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్‌లో చేరవచ్చు.

Amazon Recruitment 2021 : అమెజాన్‌లో ఉద్యోగాలు.. అప్లికేష‌న్ ప్రాసెస్‌, ప‌రీక్ష విధానం వివ‌రాలు


ఈ ఇన్‌స్టిట్యూట్ బలమైన విద్యా, వ్యవస్థాపక సంస్కృతిని కలిగి ఉంది" అని పేర్కొన్నారు.

కెరీర్ అవకాశాల పరంగా.. ఎనర్జీ ఇంజనీరింగ్‌లో బీటెక్ చేశాక అభ్యర్థులు ప్రధాన ఇంధన రంగాలలో సాంకేతిక ఉద్యోగాలు సంపాదించవచ్చు. వాతావరణ మార్పు అంచనా వేసే సంస్థల్లో పనిచేయవచ్చు. సాంప్రదాయ ఎనర్జీని.. క్లీన్ అండ్ రెన్యువబుల్ ఎనర్జీ (Clean and Renewable Energy) గా మార్చే పరిశ్రమలలో కూడా ఉద్యోగ అవకాశాలు అందిపుచ్చుకోవచ్చు. భద్రత, ఇంధన రంగంలో కృత్రిమ మేధస్సు, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (IoT)లో కెరీర్ ఆప్షన్స్ కోసం మాత్రమే కాకుండా అభ్యర్థులు ఎనర్జీ రంగంలో ఉన్నత చదువులు చదవడానికి మొగ్గుచూపుతున్నారని ఐఐటీ ఢిల్లీ తెలిపింది.

Published by:Sharath Chandra
First published:

Tags: EDUCATION, Engineering course, IIT, Jee, New course

ఉత్తమ కథలు