IT Jobs: ఐటీ రంగంలో ఉద్యోగాల జాతర.. ఉద్యోగులకు భారీ ప్యాకేజీలు, బోనస్​లు.. కారణాలివే!

ప్రతీకాత్మక చిత్రం)

కరోనా ప్రభావం తగ్గడంతో ఇప్పుడిప్పుడే అన్నిరంగాలు కోలుకుంటున్నాయి. దీంతో నియామక ప్రక్రియ జోరందుకుంటోంది. ముఖ్యంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగం నియామకాల్లో దూసుకెళుతోంది.

  • Share this:
కరోనా వైరస్(Coronavirus) ప్రభావం దాదాపు అన్ని రంగాలపై పడింది.చాలా సంస్థలు తమఉద్యోగులను తొలగించాయి, జీతాల్లో కోతలు విధించాయి. అయితే,కరోనా ప్రభావం తగ్గడంతో ఇప్పుడిప్పుడే అన్నిరంగాలు కోలుకుంటున్నాయి. దీంతో నియామక ప్రక్రియ జోరందుకుంటోంది. ముఖ్యంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగం నియామకాల్లో దూసుకెళుతోంది. వైరస్ కారణంగా అన్ని రంగాల పనుతీరుల్లో మార్పులు రావడంతో సాఫ్ట్​వేర్ రంగానికి విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. దీంతో టీసీఎస్(TCS), ఇన్ఫోసిస్(Infosys)​, విప్రో(Wipro) లాంటి దేశంలోని చాలా ఐటీ సంస్థలు ఉద్యోగులను దూకుడుగా నియమించుకుంటున్నాయి. అలాగేఉద్యోగులకు వేతనాలను భారీగా పెంచుతున్నాయి.మూడోవేవ్ హెచ్చరికలు ఉన్న నేపథ్యంలో ఐటీ సంస్థలు (IT Companies) యంగ్ టాలెంట్​ను వేగంగా చేర్చుకుంటున్నాయి. భారీగా ప్యాకేజీలను ఆఫర్ చేస్తున్నాయి.

ఐటీ ఉద్యోగులకు గతంతో పోలిస్తే ఇప్పుడు 400 శాతం డిమాండ్ ఏర్పడిందని ఇన్​డీప్ నివేదిక వెల్లడించింది. గత సంవత్సరం కరోనా మొదటి వేవ్ సమయంలో ఐటీ సంస్థలన్నీ వేచిచూసే ధోరణిని అవలంభించాయి. ఉద్యోగ నియామాలను కొంత కాలం నిలిపివేశాయి. వైరస్ వల్ల అనిశ్చితి కారణంగా గందరగోళంలో పడ్డాయి. అయితే జూన్ తర్వాత నియామకాలను(Job hiring) మళ్లీ ప్రారంభించాయి. 50 శాతం వరకు నియామకాలు చేపట్టాయి. అయితే ఇప్పుడు అన్ని రంగాల్లో సాఫ్ట్​వేర్ అవసరాలు పెరిగిపోవడంతో ఐటీ సంస్థలు తిరిగి నియామక ప్రక్రియ చేపట్టాయి. ఈ తరుణంలోఅప్లికేషన్ డెవలపర్(Application Developer), లీగ్ కన్సల్టెంట్, సేల్స్ ఫోర్స్ డెవలపర్, సైట్ రిలయబులిటీ ఇంజినీర్లకు భారీగా డిమాండ్ పెరిగింది. దాదాపు ఈ ఉద్యోగాల్లో 150 నుంచి 300 శాతం డిమాండ్ పెరిగింది.

TCS Recruitment Drive: మ‌హిళ‌ల కోసం టీసీఎస్ ప్ర‌త్యేక రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌.. ద‌రఖాస్తు చేసుకోండి ఇలా

మహిళల కోసం టీసీఎస్​ స్పెషల్​ రిక్రూట్​మెంట్​ డ్రైవ్..​
ఉద్యోగాల నియామకాలే కాదు ఐటీ సంస్థలు కొత్త చేర్చుకుంటున్న ఉద్యోగులకు భారీగా వేతనాలు ఆఫర్ చేస్తున్నాయి. జాబ్ మారితే గత సంస్థ ఇస్తున్న వేతనం కంటే 70 నుంచి 120 శాతం పెంచి కూడా ఉద్యోగులను చేర్చుకుంటున్నాయి. గత సంవత్సరం ఆఫర్ చేసినదాని కంటే ఇది చాలా ఎక్కువ. అలాగే తమ ఉద్యోగులకు ఐటీ సంస్థలు 20 నుంచి 30 శాతం వరకు ఇంక్రిమెంట్లు సైతం ఇస్తున్నాయి.కెరీర్​లో గ్యాప్ వచ్చిన తర్వాత మళ్లీ ఉద్యోగాలు చేయాలనుకుంటున్న మహిళా ప్రొఫెషనలిస్ట్​ల కోసం రిక్రూట్​మెంట్ డ్రైవ్ చేపట్టనున్నట్టు టాటా కన్సల్టెన్సీస్ సర్వీసెస్ (Tata Consultancy Services) ఇప్పటికే ప్రకటించింది. టాలెంట్, పొటెన్షియల్ ఎప్పటికీ ఉంటాయని, అందుకే టాలెంట్​, అనుభవం ఉండి మహిళా ఐటీ నిపుణులను మళ్లీ ఉద్యోగ అవకాశాలు కల్పించాలని నిర్ణయించుకున్నట్లు టీసీఎస్ వెల్లడించింది. టీసీఎస్​, ఇన్ఫోసిస్​, విప్రోతో పాటు దేశంలో దాదాపు అన్ని ప్రధాన ఐటీ సంస్థలు ఉద్యోగ నియామకాల్లో వేగంగా పెంచాయి.

Telangana Jobs 2021: తెలంగాణలో 172 జూనియర్ పంచాయతీ సెక్రెటరీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

ఐటీ రంగానికి డిమాండ్ పెరగడంతో ఈ సెక్టార్ మొత్తం వేజ్ బిల్ 2022 ఆర్థిక సంవత్సరం నాటికి 1.6 నుంచి 1.7 బిలియన్ డాలర్లకు చేరుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. మంచి స్కిల్ ఉండి సరైన ఉద్యోగం, మంచి జీతం కోసం వేచిచూస్తున్న ఉద్యోగాలకు ఇదే మంచి సమయం. ఐటీ రంగానికి డిమాండ్ పెరగడంతో బెంగళూరు, హైదరాబాద్, చెన్నై లాంటి నగరాల్లో రియల్ ఎస్టేట్​ రంగానికి కూడా మళ్లీ డిమాండ్ పెరిగే అవకాశం కనిపిస్తోంది.
Published by:Sumanth Kanukula
First published: