ఓవైపు కరోనా, మరోవైపు ఉద్యోగుల కొరత ఐటీ కంపెనీలను తీవ్రంగా వేధిస్తోంది. దీంతో టాలెంట్ ఉన్న ఉద్యోగుల కోసం ఐటీ కంపెనీలు వేట మొదలు పెట్టాయి. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్‌తో పాటు నాన్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్‌ను కూడా రిక్రూట్ చేసుకునేందుకు కంపెనీలు మొగ్గు చూపుతున్నాయి. సాధారణంగా 5 శాతం నాన్ టెక్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న స్టూడెంట్స్‌ను కంపెనీలు రిక్రూట్ చేసుకుంటాయి. కానీ.. ప్రస్తుతం కంపెనీల్లో ఇంజనీరింగ్ చదివిన ఉద్యోగుల్లో టాలెంట్ కొరత కారణంగా నాన్ టెక్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న స్టూడెంట్స్‌ను రిక్రూట్ చేసుకోవడానికి కంపెనీలు ముందుకొస్తున్నాయి.
2021 - 22 ఫైనాన్సియల్ ఇయర్లో ఇండియాలో 160,000 నుంచి 200,000 మంది ఫ్రెషర్స్‌ను ఐటీ కంపెనీలు రిక్రూట్ చేసుకోనున్నాయి. కరోనా మహమ్మారి వల్ల చాలామంది క్లయింట్స్ తమ బిజినెస్‌ను డిజిటలైజేషన్ చేస్తుండటంతో ప్రాజెక్ట్స్ పెరుగుతున్నాయి. దీంతో ఐటీ ఉద్యోగులకు డిమాండ్ కూడా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో 20 శాతం వరకు ఎంట్రీ లేవల్ ఉద్యోగాల కోసం నాన్ ఇంజనీరింగ్ బ్యాక్‌గ్రౌండ్ విద్యార్థులనే ఎంపిక చేస్తున్నారని ఇన్ఫోసిస్ కంపెనీ హెచ్ఆర్ హెడ్ రిచార్డ్ లోబో స్పష్టం చేశారు. ఈ సంవత్సరం ఈ 20 శాతం కంటే ఎక్కువే నియామకాలు జరిగే అవకాశం ఉందన్నారు.
‘ఐటీ కంపెనీలు నాన్ ఐటీ బ్యాక్‌గ్రౌండ్ నుంచే ఎక్కువగా ప్రెషర్స్‌ను రిక్రూట్ చేసుకుంటున్నాయి. ఈ సంవత్సరం 30 శాతం కంటే ఎక్కువ నియామకాలు నాన్ ఐటీ బ్యాక్‌గ్రౌండ్ నుంచే జరగనున్నాయి. టెక్నాలజీకి సంబంధించిన నియామకాలు ఎక్కువగా నాన్ ఇంజనీరింగ్ బ్యాక్‌గ్రౌండ్ నుంచే జరుగుతున్నాయి. గత సంవత్సరం అది 5 శాతం ఉండగా.. ఈ సంవత్సరం అది 10 శాతంగా ఉండనుంది..’ అని టీమ్‌లీజ్ డిజిటల్ కంపెనీ వీపీ శివప్రసాద్ తెలిపారు.
ఈ సంవత్సరం ప్రముఖ ఐటీ దిగ్గజం టీసీఎస్ ఇప్పటి వరకు 40,029 మంది కొత్త ఉద్యోగులను నియమించుకుంది. అది కూడా ఈ ఫైనాన్సియల్ సెకండ్ క్వార్టర్ ముగిసే సమయానికే ఎక్కువమంది ఫ్రెషర్స్‌ను నియమించుకోవడం విశేషం. ఇన్ఫోసిస్ ఇప్పటి వరకు 19,998 మంది కొత్త వర్కర్స్‌ను నియమించుకుంది.
ఫైనాన్సియల్ ఇయర్ 2020లో ఇన్ఫోసిస్‌లో నియామకాలు 8142 గా ఉండగా.. ఈ సంవత్సరం ఇప్పటి వరకే 20 వేల మందిని రిక్రూట్ చేసుకుంది. ఇతర ఐటీ సంస్థలు హెచ్‌సీఎల్, విప్రో కూడా ఈసంవత్సరం ఎక్కువ మంది ఫ్రెషర్స్‌ను రిక్రూట్ చేసుకున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: IT Employees, JOBS, Software, Upcoming jobs