Hiring Intent: ప్రపంచవ్యాప్తంగా లేఆఫ్స్ భయాలతో టాప్ టెక్ కంపెనీల ఉద్యోగులు(Tech companies employees) ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికీ చాలా సంస్థలు ఉద్యోగులను తొలగిస్తున్నాయి. అయితే స్టార్టప్స్‌లో మాత్రం ఇందుకు భిన్నంగా ఉద్యోగాల హవా నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది ఏయే రంగాల స్టార్టప్స్‌లో ఉద్యోగాలకు డిమాండ్ ఉంటుందనే విషయంపై చేసిన ఒక సర్వేలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. ఐటీ(IT), ఏఐ(AI), ఫిన్‌టెక్ స్టార్టప్స్‌లో(Fintech startups) ఉద్యోగాలకు డిమాండ్ ఉంటుందని సర్వే పేర్కొంది.
వివిధ రంగాల్లోని స్టార్టప్‌లలో హైరింగ్ ట్రెండ్(Startup hiring trends) ఎలా నడుస్తుందన్న విషయంపై ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (FICCI) ఇటీవల ఓ సర్వే చేపట్టింది. హెచ్‌ఆర్ సర్వీసెస్‌లో గ్లోబల్ లీడర్‌గా ఉన్న రాండ్‌స్టాడ్ ఇండియా భాగస్వామ్యంతో FICCI ‘స్టార్టప్ హైరింగ్ ట్రెండ్స్’ పేరుతో సర్వే చేపట్టింది. ఐటీ, అగ్రి-టెక్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఫిన్‌టెక్, మాన్యుఫ్యాక్చరింగ్ వంటి రంగాలు అత్యధిక హైరింగ్ ఇంటెంట్ ఉన్న పరిశ్రమలని సర్వే పేర్కొంది.
* రంగాల వారీగా హైరింగ్ ఇంటెండ్
అగ్రిటెక్, AI, మెషిన్ లెర్నింగ్, ఆటోమోటివ్, ఇ-కామర్స్ రంగాల్లో నియామకాలు 11-20% వరకు పెరుగుతాయని సర్వే అంచనా వేసింది. ఇక, ఏరోస్పేస్ & డిఫెన్స్, ఎనర్జీ, హెల్త్ కేర్ రంగాల్లో నియామకాలు 30శాతంపైగా పెరిగే అవకాశం ఉందని పేర్కొంది. ప్రతి రంగంలో నియామక ఇంటెండ్ ఎంత శాతం ఉండే అవకాశం ఉందో సర్వే ప్రత్యేకంగా ప్రస్థావించింది. హెల్త్‌కేర్‌లో 13శాతం, ఐటీ 10శాతం, అగ్రిటెక్ 8శాతం, ఏఐ 7శాతం, ఫిన్‌టెక్ 7 శాతం, మ్యానిఫాక్చరింగ్ రంగంలో 7శాతం నియామకాలు జరిగే అవకాశం ఉన్నట్లు సర్వే అంచనా వేసింది.
ఈ నియామకాలన్నీ జూనియర్, మిడ్-లెవల్ స్థాయిల్లో జరుగుతాయని సర్వే పేర్కొంది. దాదాపు 37% స్టార్టప్‌లు నియామకాల్లో ఎక్కువగా జూనియర్-స్థాయి ఉద్యోగులను తీసుకోవాలని భావిస్తున్నట్లు సర్వే వెల్లడించింది. ఇక మిడ్ లెవల్ ఉద్యోగులను దాదాపు 27 శాతం స్టార్టప్‌లు నియమించుకునే అవకాశం ఉందని సర్వే తెలిపింది. సీనియర్ -లెవల్ పొజిషన్స్‌ను భర్తీ చేయాలనే బలమైన కోరికతో హైదరాబాద్ , పూణే నగరాలు అభివృద్ధి చెందుతున్నాయని, అయితే కోల్‌కతా, బెంగళూరు, ముంబై, చెన్నై, ఢిల్లీ/ఎన్‌సిఆర్‌లలో మిడ్ -లెవల్ నియామకాలు సర్వసాధారణమని సర్వే పేర్కొంది.
Parineeti Chopra | Raghav Chadha:త్వరలోనే ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా బాలీవుడ్ నటి పరిణితిచోప్రా పెళ్లి .. కన్ఫామ్ చేసిన ఎంపీ
* వ్యూహాలను బట్టి హైరింగ్
ఈ సర్వేలో 300కి పైగా స్టార్టప్‌లు పాల్గొన్నాయి. ఇందులో 80 శాతం ఎంట్రీ లెవల్ స్టార్టప్‌లు (20 మందిలోపు ఉద్యోగులు) ఈ ఏడాది తమ వర్క్‌ఫోర్స్‌ను విస్తరించేందుకు చురుకుగా ప్రయత్నిస్తున్నాయని సర్వే పేర్కొంది. కొత్త ప్రాజెక్ట్ ఆర్డర్స్, పెట్టుబడిదారుల నుంచి అదనపు నిధులు, విస్తరణ వ్యూహాలను బట్టి తమ నియామక ప్రక్రియ ఉంటుందని 92 శాతం స్టార్టప్‌లు పేర్కొన్నట్లు సర్వే తెలింది.
* సాంకేతికత కీలకం
రాండ్‌స్టాండ్ ఇండియా సీఈవో విశ్వనాథ్ PS మాట్లాడుతూ.. రిక్రూట్‌మెంట్ ప్రక్రియను మరింత సమర్థవంతంగా నిర్వహించడంలో సాంకేతికత కీలక పాత్ర పోషిస్తుందన్నారు. రిక్రూటర్స్ అధిక వాల్యూమ్ యాక్టివిటీస్‌లను ఎదుర్కోవటానికి AI లేదా MLని ఉపయోగించే అవకాశం ఉందన్నారు. ప్రపంచవ్యాప్తంగా 88% వ్యాపారాలు ఇప్పటికే AIని ఉపయోగిస్తున్నాయని తెలిపారు. ‘ChatGPTని ఉద్యోగ వివరణలు, ఉత్పాదక ఇంటర్వ్యూ ప్రశ్నలు, సమర్థవంతమైన కమ్యూనికేషన్‌ను మెరుగుపరచడానికి ఉపయోగించే అవకాశం ఉంది. కాబట్టి సాంకేతికత ఒక ఎనేబుల్‌గా ఉంటుందని నేను భావిస్తున్నాను, అయితే అదే సమయంలో, మానవ కనెక్షన్ కూడా అంతే ముఖ్యమైనది.’అని విశ్వనాథ్ పేర్కొన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Ai jobs, Career and Courses, IT jobs, JOBS, Startups