YUVIKA 2020: విద్యార్థులకు ఇస్రో నుంచి అద్భుతమైన అవకాశం

YUva VIgyani KAryakram (YUVIKA) 2020 | అహ్మదాబాద్, బెంగళూరు, షిల్లాంగ్, తిరువనంతపురం కేంద్రాల్లో 'యంగ్ సైంటిస్ట్ ప్రోగ్రామ్ 2020' జరుగుతుంది. ఎంపికైనవారికి ఇస్రో గెస్ట్ హౌజ్ లేదా హాస్టళ్లలో వసతి సౌకర్యాలు ఉంటాయి. రవాణా ఖర్చులు, కోర్స్ మెటీరియల్, వసతి ఖర్చులన్నీ ఇస్రోనే భరిస్తుంది.

news18-telugu
Updated: January 28, 2020, 12:20 PM IST
YUVIKA 2020: విద్యార్థులకు ఇస్రో నుంచి అద్భుతమైన అవకాశం
YUVIKA 2020: విద్యార్థులకు ఇస్రో నుంచి అద్భుతమైన అవకాశం (image: ISRO)
  • Share this:
ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్-ISRO పాఠశాల విద్యార్థినీ విద్యార్థులకు అద్భుతమైన అవకాశాన్ని అందిస్తోంది. గత ఏడాది లాగానే ఈసారి కూడా 'యువికా-యువ విజ్ఞాని కార్యక్రమం' పేరుతో స్కూల్ విద్యార్థులకు యువ శాస్త్రవేత్త కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. 2020 మేలో ఈ ప్రత్యేక కార్యక్రమం జరగనుంది. అంతరిక్ష సాంకేతికత, అంతరిక్ష శాస్త్ర విజ్ఞానం, స్పేస్ అప్లికేషన్స్ లాంటి అంశాల్లో విజ్ఞానం పొందేందుకు ఈ కార్యక్రమం ఉపయోగపడుతుంది. అంతరిక్ష పరిశోధనలపై విద్యార్థినీవిద్యార్థుల్లో ఉన్న ఆసక్తిని గుర్తించి, వారిలోని ప్రతిభను వెలికితీసేందుకు ఇస్రో ఈ కార్యక్రమం నిర్వహిస్తోంది. ఇస్రోకు చెందిన అహ్మదాబాద్, బెంగళూరు, షిల్లాంగ్, తిరువనంతపురం కేంద్రాల్లో 'యంగ్ సైంటిస్ట్ ప్రోగ్రామ్ 2020' జరుగుతుంది. ఎంపికైనవారికి ఇస్రో గెస్ట్ హౌజ్ లేదా హాస్టళ్లలో వసతి సౌకర్యాలు ఉంటాయి. రవాణా ఖర్చులు, కోర్స్ మెటీరియల్, వసతి ఖర్చులన్నీ ఇస్రోనే భరిస్తుంది.

వేసవి సెలవుల్లో 2020 మే 11 నుంచి 22 వరకు రెండు వారాల పాటు జరిగే కార్యక్రమంలో ప్రముఖ శాస్త్రవేత్తలు తమ అనుభవాలను పంచుకుంటారు. ల్యాబ్ విజిట్స్ ఉంటాయి. నిపుణులతో చర్చావేదికల్లో పాల్గొనొచ్చు. ఇస్రో నిర్వహించే ఈ కార్యక్రమానికి ప్రతీ రాష్ట్రం, కేంద్ర పాలిత ప్రాంతం నుంచి ముగ్గురు విద్యార్థుల చొప్పున ఎంపిక చేస్తారు. సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ, స్టేట్ సిలబస్ స్కూళ్లల్లో చదివే విద్యార్థులకు మాత్రమే అవకాశం. ఇందులో పాల్గొనాలనుకునే విద్యార్థులు 2020 ఫిబ్రవరి 3 నుంచి 24 వరకు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.

YUva VIgyani KAryakram (YUVIKA) 2020: గుర్తుంచుకోవాల్సిన అంశాలు



ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం- 2020 ఫిబ్రవరి 3 సాయంత్రం 5 గంటలు
దరఖాస్తుకు చివరి తేదీ- 2020 ఫిబ్రవరి 24 సాయంత్రం 6 గంటలు


ఎంపికైన అభ్యర్థుల జాబితా ప్రకటన- 2020 మార్చి 2
ఎంపికైనవారు సర్టిఫికెట్లు అప్‌లోడ్ చేయడానికి చివరి తేదీ- 2020 మార్చి 23సర్టిఫికెట్ వెరిఫికేషన్ తర్వాత తుది జాబితా విడుదల- 2020 మార్చి 30
అర్హత- 2019-20 విద్యాసంవత్సరంలో 9వ తరగతి చదువుతున్నవారు మాత్రమే దరఖాస్తు చేయాలి.
వెయిటేజీ- 8వ తరగతిలో సాధించిన మార్కులను బట్టి 60% వెయిటేజీ, 2016 నుంచి జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో ఎస్సే రైటింగ్, చర్చా కార్యక్రమాల్లో ప్రతిభ సాధించినవారికి 10% వరకు వెయిటేజీ, జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో క్రీడల్లో ప్రతిభ సాధించినవారికి 5% వెయిటేజీ, గ్రామీణ ప్రాంతాల్లో చదివే వారికి 15% వెయిటేజీ ఉంటుంది.
ఈ ప్రోగ్రామ్‌కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే yuvika2020@isro.gov.in ఇమెయిల్ ఐడీ లేదా 080 2217 2269 ఫోన్ నెంబర్‌లో సంప్రదించొచ్చు.
మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి:

SBI Jobs: ఎస్‌బీఐలో 7870 ఉద్యోగాలకు అప్లై చేయండి ఇలా...

Indian Army SSC Recruitment 2020: ఆర్మీలో 191 ఉద్యోగాలు... పెళ్లికాని యువతీయువకులకు అవకాశం

Reliance Jio Jobs: రిలయెన్స్ జియోలో ఉద్యోగాలు కావాలా? ఈ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి
First published: January 28, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు