హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

ISRO Recruitment 2021 : ఇస్రోలో రీసెర్చ్‌ఫెలో ఉద్యోగాలు.. ప‌రీక్ష లేకుండా ఎంపిక‌.. జీతం రూ.31,000

ISRO Recruitment 2021 : ఇస్రోలో రీసెర్చ్‌ఫెలో ఉద్యోగాలు.. ప‌రీక్ష లేకుండా ఎంపిక‌.. జీతం రూ.31,000

(ప్ర‌తీకాత్మ‌క చిత్రం)

(ప్ర‌తీకాత్మ‌క చిత్రం)

ఇస్రో (ISRO)కు చెందిన ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్ (Indian Institute of Remote Sensing)లో ప‌లు పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ (Notification) విడుద‌ల అయ్యింది. ఈ నోటిఫికేష్ ద్వారా ప‌లు విభాగాల్లో 16 జూనియ‌ర్ రీసెర్చ్‌ఫెలో ఉద్యోగాల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. ప‌రీక్ష లేకుండా కేవ‌లం ఇంట‌ర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.

ఇంకా చదవండి ...

ఇస్రో (ISRO)కు చెందిన ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్ (Indian Institute of Remote Sensing)లో ప‌లు పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ (Notification) విడుద‌ల అయ్యింది. ఈ నోటిఫికేష‌న్‌ ద్వారా ప‌లు విభాగాల్లో 16 జూనియ‌ర్ రీసెర్చ్‌ఫెలో ఉద్యోగాల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. ఎంపికైన అభ్య‌ర్థుల‌కు నెల‌కు రూ.31,000 జీతం చెల్లిస్తారు. ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ పూర్తిగా ఆఫ్‌లైన్ ప‌ద్ధ‌తిలో ఉంటుంది. ద‌ర‌ఖాస్తుల పంప‌డం లాంటి విధానం ఏమీ లేదు. నేరుగా అర్హ‌త‌లు ఉన్న అభ్య‌ర్థులు అప్లికేష‌న్ ఫాం ప్రింట్ తీసుకొని ఇస్రో కార్యాల‌యానికి ఇంట‌ర్వ్యూకి వెళ్లాల్సి ఉంటుంది. ఇంట‌ర్వ్యూ (Interview) తేదీలు అక్టోబ‌ర్ 22, 2021 నుంచి అక్టోబ‌ర్ 27, 2021 వ‌ర‌కు నిర్వ‌హిస్తారు. నోటిఫికేష‌న్‌, మ‌రింత స‌మాచారం కోసం అధికారిక వెబ్‌సైట్ https://www.iirs.gov.in/recruitment-walk-in-interview-jrf ను సంద‌ర్శంచాల్సి ఉంటుంది.

అర్హ‌త‌లు..

ఈ నోటిఫికేష‌న్ ద్వారా 16 జూనియ‌ర్ రీసెర్చ్ ఫెలో(జేఆర్ఎఫ్) ఉద్యోగాల‌ను, రెండు రీసెర్చ్ అసోసియేట్(ఆర్ఏ) ఉద్యోగాల‌ను భ‌ర్తీ చేస్తారు. అర్హ‌త‌లు(Eligibility) ఇలా ఉన్నాయి.

పోస్టు పేరుఅర్హతలుఖాళీలు
జేఆర్ఎఫ్-66గుర్తింపు పొందిన యూనివ‌ర్సిటీలో ఎమ్మెస్సీ ఫారెస్టి/ ఎకోల‌జీ/ బీఓటీవై / ఎన్విరాన్‌మెంట‌ల్ సైన్స్‌/ వైల్డ్ లైఫ్/ బ‌యోడైవ‌ర్సిటీ చేసి ఉండాలి. లేదా రిమోట్ సైన్స్‌లో ఎమ్మెసీ, ఎంటెక్ చేసి ఉండాలి.01
జేఆర్ఎఫ్-67రిమోట్ సైన్స్‌లో ఎంఈ, ఎంటెక్ చేసి ఉండాలి. లేదా ఎమ్మెస్సీ ఫిజిక్స్‌, కంప్యూట‌ర్ సైన్స్ చేసి ఉండాలి. లేదా బీఈ/ బీటెక్‌లో ఎల‌క్ట్రానిక్స్ అండ్ క‌మ్యూనికేష‌న్ ఇంజ‌నీరింగ్‌, కంప్యూట‌ర్ సైన్స్ కోర్సులు చేసి ఉండాలి.04
జేఆర్ఎఫ్-68గుర్తింపు పొందిన యూనివ‌ర్సిటీలో ఎమ్మెస్సీ ఫారెస్టి/ ఎకోల‌జీ/ బీఓటీవై / ఎన్విరాన్‌మెంట‌ల్ సైన్స్‌/ వైల్డ్ లైఫ్/ బ‌యోడైవ‌ర్సిటీ చేసి ఉండాలి.01
జేఆర్ఎఫ్-69 గుర్తింపు పొందిన యూనివ‌ర్సిటీలో ఫిజిక్స్‌, అట్మాస్పియరిక్ సైన్స్‌, మెట్రోల‌జీలో ఎమ్మెస్సీ/ ఎంటెక్ పూర్తి చేసి ఉండాలి.02
జేఆర్ఎఫ్-70 గుర్తింపు పొందిన యూనివ‌ర్సిటీలో బాట‌నీ, ఎన్వినరాన్‌మెంట్ సైన్స్‌లో ఎమ్మెస్సీ పూర్తి చేసి ఉండాలి.01
జేఆర్ఎఫ్-71 గుర్తింపు పొందిన యూనివ‌ర్సిటీలో ఫారెస్టీ, ఫిజిక్స్‌, మాథ్స్‌లో ఎమ్మెస్సీ పూర్తి చేసి ఉండాలి.01
జేఆర్ఎఫ్-72 గుర్తింపు పొందిన యూనివ‌ర్సిటీలో బీఈ/ బీటెక్ లేదా ఎమ్మెస్సీ పూర్తి చేసి ఉండాలి.01
జేఆర్ఎఫ్-73 గుర్తింపు పొందిన యూనివ‌ర్సిటీలో ఎమ్మెస్సీ పూర్తి చేసి ఉండాలి. లేదా ఎంటెక్ పూర్తి చేయాలి.01
జేఆర్ఎఫ్-74 గుర్తింపు పొందిన యూనివ‌ర్సిటీలో ఎమ్మెస్సీ పూర్తి చేసి ఉండాలి. లేదా ఎంటెక్ పూర్తి చేయాలి.01
జేఆర్ఎఫ్-75 గుర్తింపు పొందిన యూనివ‌ర్సిటీలో ఎంఈ లేదా ఎంటెక్ పూర్తి చేసి ఉండాలి.01
జేఆర్ఎఫ్-76గుర్తింపు పొందిన యూనివ‌ర్సిటీలో ఎంఈ లేదా ఎంటెక్ పూర్తి చేసి ఉండాలి. లేదా ఎమ్మెస్సీ పూర్తి చేసి ఉండాలి.02


TCS iON Course: టీచ‌ర్ల‌కు గుడ్ న్యూస్‌.. టీసీఎస్ ఐఓఎన్ ద్వారా ఉచిత ఆన్‌లైన్ కోర్స్‌


ఎంపిక విధానం:

1. అభ్య‌ర్థుల‌ను ఇంటర్వ్యూ(Interview) ద్వారా ఎంపిక చేస్తారు.

2. నోటిఫికేష‌న్‌లో అప్లికేష‌న్ ఫాంను నింపి సంబంధిత డాక్యుమెంట్లు తీసుకొని ఇంట‌ర్వ్యూకి వెళ్లాలి.

3. ఇంట‌ర్వ్యూ ద్వారా మెరిట్ అభ్య‌ర్థులు తుది ఎంపిక చేస్తారు.

ద‌ర‌ఖాస్తు విధానం..

- కేవ‌లం ఆఫ్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.

- ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌డానికి ముందుగా ఇస్రో వెబ్‌సైట్‌కి వెళ్లాలి. (నోటిఫికేష‌న్ కోసం క్లిక్ చేయండి)

- నోటిఫికేష‌న్‌లో పూర్తి స‌మాచారం నింపి డాక్యుమెంట్ల‌తో ఇంట‌ర్వ్యూకి వెళ్లాలి.

- ఇంట‌ర్వ్యూ తేదీలు అక్టోబ‌ర్ 22, 2021 నుంచి అక్టోబ‌ర్ 29, 2021 వ‌ర‌కు అవ‌కాశం ఉంది.

First published:

Tags: CAREER, Govt Jobs 2021, ISRO, Job notification

ఉత్తమ కథలు