ISRO RECRUITMENT JOB OPPORTUNITIES IN ISRO KNOW ELIGIBILITY AND APPLICATION PROCEDURE EVK
ISRO Recruitment: ఇస్రోలో ఉద్యోగ అవకాశాలు.. అర్హతలు అప్లికేషన్ విధానం..
ప్రతీకాత్మక చిత్రం
Jobs In ISRO | భారత ప్రభుత్వ అంతరిక్ష విభాగానికి చెందిన ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ లో పలు పోస్టుల భర్తీకిన నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్ ద్వారా రీసెర్చ్ విభాగంలో 20 ఖాళీలలను భర్తీ చేయనున్నారు.
భారత ప్రభుత్వ అంతరిక్ష విభాగానికి చెందిన ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (Indian Space Research Organisation)లో పలు పోస్టుల భర్తీకిన నోటిఫికేషన్ (Notification) విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్ ద్వారా రీసెర్చ్ విభాగంలో 20 ఖాళీలలను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు దరఖాస్తు అవసరం లేదు. ఎటువంటి రాత పరీక్ష లేకుండా నేరుగా వాక్ఇన్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఎంపికకూన అభ్యర్థులకు నెలకు రూ.31,000 నుంచి రూ.56,100 వరకు వేతనం అందిస్తారు. నోటిఫికేషన్, వాక్ ఇన్ వివరాల కోసం అధికారిక వెబ్సైట్ https://www.iirs.gov.in/ ను సందర్శించాలి.
అర్హతలు..
ఇస్రోలోని పోస్టులను అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్, ఎమ్మెస్సీ, ఎంఈ/ ఎంటెక్, ఎంప్లాన్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అంతే కాకుండా.. నెట్/గేట్/ఐఐఆర్ఎస్-జెట్ లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఇంటర్వ్యూకు హాజరు అయ్యే అభ్యర్థుల వయసు 28 ఏళ్ల నుంచి 35 వయసు ఉండాలి.
ఎంపిక విధానం..
- ముందుగా అర్హత గల అభ్యర్థులు సంబంధిత తేదీల్లో ఇంటర్వ్యూలకు హాజరు కావాలి.
- ఇంటర్వ్యూ, మెరిట్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.