• HOME
  • »
  • NEWS
  • »
  • JOBS
  • »
  • ISRO RECRUITMENT 2021 VSSC HAS INVITED APPLICATIONS FOR 19 NEW VACANCIES FOR ENGINEERS POSTGRADUATES AND DOCTORAL DEGREE HOLDERS NS

ISRO Recruitment 2021: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఇస్రోలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. వివరాలివే

ISRO Recruitment 2021: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఇస్రోలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. వివరాలివే

ప్రతీకాత్మక చిత్రం

ఇస్రో నుంచి ఉద్యోగాల భర్తీకి మరో నోటిఫికేషన్ విడుదలైంది. జూనియర్ రీసెర్చ్ ఫెలో(JRF), సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్(SPA), రీసెర్చ్ అసోసియేట్(RA) విభాగాల్లో ఖాళీలను భర్తీ దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు.

  • Share this:
    నిరుద్యోగులకు ప్రముఖ ఇండియన్ స్టేట్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ శుభవార్త చెప్పింది. పలు ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు సంస్థ నుంచి నోటిఫికేషన్ విడులైంది. సంస్థకు చెందిన విక్రమ్ సారాబాయి స్పేస్ సెంటర్ లో ఈ నియామకాలు చేపట్టారు. ఇంజనీర్స్, పోస్టుగ్రాడ్యుయేట్స్, డాక్టోరియల్ డిగ్రీ చేసిన వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేయొచ్చు. జూనియర్ రీసెర్చ్ ఫెలో, సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్ అండ్ రీసెర్చ్ అసోసియేట్ విభాగాల్లో ఈ నియామకాలు చేపట్టారు.
    జూనియర్ రీసెర్చ్ ఫెలో ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు రూ. 31 వేల వరకు వేతనం చెల్లించనున్నారు. సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్ ఉద్యోగాలకు ఎంపికైన
    వారికి నెలకు రూ. 42 వేలు, రీసెర్చ్ అసోసియేట్ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు రూ. 47 వేలు వేతనంగా చెల్లించనున్నారు.

    అర్హతల వివరాలు..
    -ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 19 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. ఇందులో 16 జూనియర్ రీసెర్చ్ ఫెలో, ఒక పోస్టు ప్రాజెక్టు సీనియర్ అసోసియేట్, మరో రెండు ఖాళీలు రీసెర్చ్ అసోసియేట్ విభాగంలో ఉన్నాయి.
    -మెటీరియల్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ లో ఎంటెక్ చేసిన వారి కోసం రెండు JRF ఖాళీలు ఉన్నాయి.
    -కెమికల్ ఇంజనీరింగ్ లో బీటెక్, ఎంటెక్ చేసిన వారి కోసం మూడు జేఆర్ఎఫ్ ఖాళీలు ఉన్నాయి. ఎమ్మెస్సీ కెమిస్ట్రీ చేసిన వారు కూడా ఈ ఉద్యోగాలకు అప్లై చేయొచ్చు.
    - embedded systems, VLSI, microelectronics, VLSI, microelectronicsలో బీటెక్, ఎంటెక్ చేసిన వారి కోసం జేఆర్ఎఫ్ విభాగంలో ఓ ఖాళీ ఉంది.

    -embedded polymer engineering/rubber technology లో ఎంటెక్, బీటెక్ చేసిన వారి కోసం జేఆర్ఎఫ్ విభాగంలో ఒక ఖాళీ ఉంది.
    -ఎయిరోస్పేస్ లేదా మెకానికల్ ఇంజనీరింగ్ లో బీటెక్, ఎంటెక్ చేసిన వారి కోసం జేఆర్ఎఫ్ విభాగంలో రెండు ఖాళీలు ఉన్నాయి.
    -డిజైన్, థర్మల్, స్ట్రక్చరల్, మెకానికల్ ఇంజనీరింగ్ లో బీటెక్, ఎంటెక్ చేసిన వారి కోసం ఒక జేఆర్ఎఫ్ ఖాళీ ఉంది.
    -ఫిజిక్స్ లో ఎమ్మెస్సీ చేసిన వారి కోసం ఒక ఖాళీ, కెమిస్ట్రీలో ఎమ్మెస్సీ చేసిన వారి కోసం 4 జేఆర్ఎఫ్ ఖాళీలు ఉన్నాయి.
    -PhD చేసిన వారు సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్, రీసెర్చ్ అసోసియేట్ ఉద్యోగాలకు అప్లై చేసేందుకు అర్హులు. ఇతర వివరాలను నోటిఫికేషన్లో చూడొచ్చు.
    Notification&Application-Direct Link

    ఎలా అప్లై చేయాలంటే..
    జూనియర్ రీసెర్చ్ ఫెలో, సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్ ఖాళీలకు అప్లై చేయాలనుకుంటున్న అభ్యర్థులు VSSC వెబ్ సైట్లో ఏప్రిల్ 9లోగా అప్లై చేయాలని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. రీసెర్చ్ అసోసియేట్ ఉద్యోగాలకు అప్లై చేయాలనుకుంటున్న అభ్యర్థులు అప్లికేషన్ ఫామ్ ను ఈ మెయిల్ ద్వారా పంపించాల్సి ఉంటుంది. ఇతర పూర్తి వివరాలను నోటిఫికేషన్లో చూడొచ్చు.
    Published by:Nikhil Kumar S
    First published:

    అగ్ర కథనాలు