• HOME
  • »
  • NEWS
  • »
  • JOBS
  • »
  • ISRO RECRUITMENT 2021 ONLINE APPLICATIONS INVITED FOR OFFICER JOBS VACANCIES HERE FULL DETAILS NS

ISRO Recruitment 2021: ఇస్రోలో ఉద్యోగాల భర్తీకి మరో నోటిఫికేషన్.. ఇలా అప్లై చేసుకోండి

ISRO Recruitment 2021: ఇస్రోలో ఉద్యోగాల భర్తీకి మరో నోటిఫికేషన్.. ఇలా అప్లై చేసుకోండి

ప్రతీకాత్మక చిత్రం

ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్-ఇస్రో నిరుద్యోగులకు మరో గుడ్ న్యూస్ చెప్పింది. పలు ఉద్యోగాల భర్తీకి సంస్థ నుంచి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

  • Share this:
    ఇటీవల ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్(ISRO) నుంచి వరుసగా ఉద్యోగ ప్రకటనలు విడుదల అవుతున్నాయి. తాజాగా సంస్థ నుంచి మరో జాబ్స్ నోటిఫికేషన్ విడుదలైంది. ఇస్రోకు చెందిన వివిధ యూనిట్లలో మొత్తం 24 ఖాళీలను భర్తీ చేయడానికి ఈ నోటిఫికేషన్ ను విడుదల చేశారు. అడ్మినిస్ట్రేటీవ్ ఆఫీసర్, అకౌంట్స్ ఆఫీసర్, పర్చేస్ అండ్ స్టోర్స్ ఆఫీసర్ విభాగాల్లో ఈ ఖాళీలను భర్తీ చేస్తున్నారు. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 34 వేల వరకు వేతనం చెల్లించనున్నారు.

    ఎవరు అప్లై చేయాలంటే..
    అడ్మినిస్ట్రేటీవ్ ఆఫీసర్: ఈ విభాగంలో మొత్తం 6 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. ఎంబీఏ చేసి supervisory capacityలో ఏడాది అనుభవం ఉన్న వారు ఈ పోస్టులకు అర్హులు. లేదా పోస్టు గ్రాడ్యుయేషన్ చేసి మూడేళ్ల అనుభవం ఉన్న వారు ఈ ఉద్యోగాలకు అర్హులు. ఇతర పూర్తి వివరాలను నోటిఫికేషన్లో చూడొచ్చు.
    అకౌంట్స్ ఆఫీసర్: ఎంబీఏ విద్యార్హతతో పాటు ఏడాది అనుభవం లేదా ఎంకామ్ తో పాటు మూడేళ్ల అనుభం ఉన్న వారు ఈ ఉద్యోగాలకు అర్హులు. బీకామ్, బీబీఏ, బీబీఎం విద్యార్హతతో ఐదేళ్ల అనుభవం ఉన్న వారు కూడా ఈ ఉద్యోగాలకు అర్హులు. ఫైనాన్స్, అకౌంట్స్, కాస్ట్ అకౌంటింగ్ లో అనుభవం ఉన్న వారు మాత్రమే అర్హులు. ఇతర పూర్తి వివరాలను నోటిఫికేషన్లో చూడొచ్చు.

    Purchase and stores officer: మార్కెటింగ్, మెటీరయల్స్ మేనేజ్మెంట్లో ఎంబీఏ చేసి సూపర్ వైజరీ కెపాసిటీలో ఏడాది అనుభవం ఉన్న వారు ఈ ఉద్యోగానికి అర్హులు. లేదా మెటీరియల్ మేనేజ్మెంట్లో గ్రాడ్యుయేట్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమో చేసిన వారు ఈ ఉద్యోగాలకు అర్హులు. ఇతర పూర్తి అర్హతల వివరాలను నోటిఫికేషన్లో చూడొచ్చు.
    Notification-Direct Link

    ఎలా అప్లై చేయాలంటే..
    అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఇస్రో అధికారిక వెబ్ సైట్లో ఏప్రిల్ 21లోగా అప్లై చేసుకోవాలని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. అయితే అభ్యర్థులు తప్పనిసరిగా నేషనల్ కెరీర్ సర్వీసెస్(NCS) పోర్టల్ లో రిజిస్టర్ అయి ఉండాలి. అభ్యర్థులు రూ. 250ని పరీక్ష ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. అభ్యర్థులు ఈ క్రింది విషయాలను తప్పనిసరిగా తెలుసుకోవాల్సి ఉంటుంది.

    -అప్లికేషన్ ను సబ్మిట్ చేసిన అనంతరం అభ్యర్థులకు రిజిస్ట్రేషన్ నంబరును కేటాయిస్తారు. అభ్యర్థులు ఆ నంబరును తప్పనిసరిగా భద్రపరుచుకోవాల్సి ఉంటుంది.
    -అప్లికేషన్ లో ప్రస్తుతం వాడుకలో ఉన్న ఈ మెయల్ అడ్రస్ ను ఇవ్వాల్సి ఉంటుంది.
    -అప్లై చేసిన అభ్యర్థులకు అహ్మదాబాద్, బెంగళూరు, భోపాల్, చెన్నై, గౌహతి తదితర సిటీల్లో రాత పరీక్షను నిర్వహించనున్నారు.
    -రాత పరీక్షలో అభ్యర్థులు చూపిన ప్రతిభ ఆధారంగా అభ్యర్థులను ఇంటర్వ్యూకు షార్ట్ లిస్ట్ చేస్తారు. సాధారణంగా 1:7 నిష్పత్తిలో షార్ట్ లిస్ట్ చేసే అవకాశం ఉంది.
    Published by:Nikhil Kumar S
    First published:

    అగ్ర కథనాలు