Home /News /jobs /

ISRO RECRUITMENT 2021 NOTIFICATION RELEASED FOR 8 NEW VACANCIES SALARY UP TO RS 63200 NS

ISRO Recruitment 2021: నిరుద్యోగులకు శుభవార్త.. ఇస్రోలో టెన్త్ అర్హతతో ఉద్యోగాలు.. రూ. 63 వేల వరకు వేతనం

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

నిరుద్యోగులకు ప్రముఖ ఇస్రో(ISRO) సంస్థ శుభవార్త చెప్పింది. పలు ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు సంస్థ నుంచి నోటిఫికేషన్ (Job Notification) విడుదలైంది.

    ఇండియన్ స్పేస్ రిసెర్చ్ ఆర్గనైజేషన్(ISRO) నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. పలు ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు సంస్థ నుంచి తాజాగా నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మోత్తం 8 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఇస్రోకు చెందిన Liquid Propulsion Systems Centre (LPSC)లో ఈ నియామకాలు చేపట్టారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ఆగస్టు 24న ప్రారంభమైంది. దరఖాస్తు చేసుకోవడానికి సెప్టెంబర్ 6ని ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా అప్లై చేసుకోవాలని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు. విభాగాల వారీగా ఖాళీల వివరాలు ఇలా ఉన్నాయి.



























    Name of vacancy Number of vacancies
    హెవీ వెహికిల్ డ్రైవర్(Heavy vehicle driver) 2
    లైట్ వెహికిల్ డ్రైవర్(Light vehicle driver)  2
    కుక్(Cook) 1
    ఫైర్ మాన్ (Fireman)2
    క్యాటరింగ్ అటెండెంట్(Catering attendant) 1

    అభ్యర్థులు గుర్తించుకోవాల్సిన విషయాలు..
    Application begins- 2021 ఆగస్ట్ 24
    Application Last Date- 2021 సెప్టెంబర్ 6
    విద్యార్హతల వివరాలు: టెన్త్ విద్యార్హత కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. అయితే పోస్టుల వారీగా కావాల్సిన అనుభవానికి సంబంధించిన పూర్తి వివరాలను నోటిఫికేషన్లో చూడొచ్చు.
    Application Fee: రూ.150/-
    Salaries Details: పోస్టు ఆధారంగా రూ. 18 వేల నుంచి రూ. 63 వేల వరకు వేతనం చెల్లించనున్నారు.
    Oil India Jobs 2021: ఆయిల్ ఇండియా లిమిటెడ్‌లో 535 ఉద్యోగాలు... ఎలా అప్లై చేయాలో తెలుసుకోండి

    కేవలం ఆన్లైన్ ద్వారా వచ్చే అప్లికేషన్లను మాత్రమే స్వీకరిస్తామని నోటిఫికేషన్లో తెలిపారు. ఆఫ్ లైన్ ద్వారా పంపించే అప్లికేషన్లను పరిగణలోకి తీసుకోమని అధికారులు స్పష్టం చేశారు. దీంతో అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారానే ఆన్లైన్ విధానంలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులు ఈ లింక్ ద్వారా నోటిఫికేషన్ ను చూడొచ్చు. ఇక్కడ క్లిక్ చేసి నేరుగా అప్లై చేసుకోవచ్చు.
    Published by:Nikhil Kumar S
    First published:

    Tags: Government jobs, Govt Jobs 2021, ISRO, Job notification

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు