హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

ISRO Recruitment 2021: ఇస్రోలో భారీ వేతనంతో ఉద్యోగాలు.. దరఖాస్తుకు మరో రెండు రోజులే ఛాన్స్.. ఇలా అప్లై చేయండి

ISRO Recruitment 2021: ఇస్రోలో భారీ వేతనంతో ఉద్యోగాలు.. దరఖాస్తుకు మరో రెండు రోజులే ఛాన్స్.. ఇలా అప్లై చేయండి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ ఇస్రో(ISRO) పలు ఖాళీ భర్తీకి నోటిఫికేషన్(Job Notification) విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునేందుకు నవంబర్ 20ని ఆఖరి తేదీగా నిర్ణయించారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్-ఇస్రో(ISRO) నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. పలు ఉద్యోగాలను(Jobs) భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు సంస్థ నుంచి నోటిఫికేషన్(Job Notification) విడుదలైంది. మొత్తం 6 ఖాళీలను భర్తీ చేయున్నట్లు నోటిఫికేషన్లో(Notification) పేర్కొన్నారు. జూనియర్ ట్రాన్స్ లేషన్(Translation) ఆఫీసర్ విభాగంలో ఈ ఖాళీలను భర్తీ చేస్తున్నారు. ఎంపికైన అభ్యర్థులు ఇస్రో(ISRO)కు చెందిన హ్యూమన్ స్పేస్ ఫైట్ సెంటర్(HSFC) లో పని చేయాల్సి ఉంటుంది. అయితే తాత్కాలిక పద్ధతిలో ఈ నియామకాలను(Recruitment) చేపట్టినట్లు నోటిఫికేషన్లో తెలిపారు. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.1,12,400 వేతనం చెల్లించనున్నట్లు నోటిఫికేషన్లో స్పష్టం చేశారు.

ఎవరు అప్లై చేయాలంటే..

-అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి హిందీలో మాస్టర్ డిగ్రీ చేసి ఉండాలి. అభ్యర్థుల డిగ్రీ లెవల్ లో ఇంగ్లిష్ కంపల్సరీ లేదా ఎలెక్టివ్ సబ్జెక్ట్(Elective Subject) అయి ఉండాలి.

-గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి మాస్టర్ డిగ్రీ చేసిన అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు. డిగ్రీలో హిందీ కంపల్సరీ లేదా ఎలెక్టివ్ సబ్జెక్ట్ అయి ఉండాలి.

-ఇంగ్లిష్, హిందీ కాకుండా ఇతర సబ్జెక్టులో మాస్టర్ డిగ్రీ చేసిన అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు. డిగ్రీలో హిందీ మీడియం ఉండి ఇంగ్లిష్ కంపల్సరీ లేదా ఎలక్టివ్ సబ్జెక్ట్ అయి ఉండాలి.

AP Postal Circle Jobs: ఏపీలో టెన్త్, ఇంటర్ అర్హతతో పోస్టల్ జాబ్స్.. దరఖాస్తుకు మరికొన్ని రోజులే ఛాన్స్.. ఇలా అప్లై చేయండి

-హిందీ లేదా ఇంగ్లిష్ లో కాకుండా ఇతర సబ్జెక్టులో మాస్టర్ డిగ్రీ చేసిన అభ్యర్థులు సైతం ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. డిగ్రీ స్థాయిలో హందీ మీడియంలో చదివి ఉండాలి. లేదా హిందీ కంపల్సరీ లేదా ఎలెక్టివ్ సబ్జెక్ట్ అయి ఉండాలి.

-హిందీ లేదా ఇంగ్లిష్ కాకుండా ఇతర సబ్జెక్టులో మాస్టర్ డిగ్రీ చేసిన అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. హిందీ మరియు ఇంగ్లిష్ కంపల్సరీ లేదా ఎలెక్టీవ్ సబ్జెక్టులు అయి ఉండాలి. డిగ్రీ స్థాయిలో ఆ సబ్జెక్టులు కంపల్సరీ లేదా ఎలెక్టివ్ అయి ఉండాలి.

-ఈ విద్యార్హతలతో పాటు అభ్యర్థులు హిందీ నుంచి ఇంగ్లిష్, ఇంగ్లిష్ నుంచి హిందీ భాషకు ట్రాన్స్ లేషన్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి. లేదా ట్రాన్స్ లేషన్ లో రెండేళ్ల అనుభవం ఉండాలి. అభ్యర్థులు ఇతర పూర్తి విద్యార్హతల వివరాలను నోటిఫికేషన్లో చూడొచ్చు.

NTPC Recruitment 2021: బీటెక్ చేసిన వారికి శుభవార్త.. రూ. 60 వేల వేతనంతో NTPCలో ఉద్యోగాలు.. ఇలా అప్లై చేయండి

ఎలా అప్లై చేయాలంటే..

-అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో ఇస్రో అధికారిక వెబ్ సైట్లో (https://www.isro.gov.in/)అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.

-ఈ ఖాళీలకు దరఖాస్తుల ప్రక్రియ ఈ నెల 30న ప్రారంభమైంది. దరఖాస్తులకు నవంబర్ 20ని ఆఖరి తేదీగా నిర్ణయించారు.

-అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా అప్లై చేయాల్సి ఉంటుంది.

-దరఖాస్తు చేసే సమయంలో అభ్యర్థులు రూ. 250 పరీక్ష ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది.

-రాత పరీక్షలో అభ్యర్థులు సాధించిన మార్కుల ఆధారంగా ఎంపిక ఉంటుందని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు.

-అభ్యర్థులు ఇతర పూర్తి వివరాలను నోటిఫికేషన్లో చూడొచ్చు.

First published:

Tags: Career and Courses, Central Government Jobs, ISRO, Private Jobs

ఉత్తమ కథలు