ISRO RECRUITMENT 2021 167 APPRENTICE JOBS ON VSSC KNOW ELIGIBILITY DETAILS EVK
ISRO Recruitment : విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్లో 167 అప్రెంటీస్ ఖాళీలు.. అర్హతలు ఇవే
వీఎస్ఎస్సీ జాబ్స్
ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనేజేషన్ (Indian Space Research Organisation) గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎంపికైన అభ్యర్థులు విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ (Vikram Sarabhai Space Centre)లో పని చేయాల్సి ఉంటుంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకొనేందుకు అక్టోబర్ 8, 2021 వరకు అవకాశం ఉంది.
ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనేజేషన్ (Indian Space Research Organisation) గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎంపికైన అభ్యర్థులు విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ (Vikram Sarabhai Space Centre)లో పని చేయాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్ (Notification) ద్వారా 167 గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు దరఖాస్తు కోసం ఆన్లైన్ (Online) ద్వారా స్వీకరిస్తారు. అప్రెంటీస్ (Apprentice)గా దరఖాస్తు చేసుకోవాలనుకొన్న అభ్యర్థులు కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ పుదుచ్చేరి డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. శిక్షణా సంవత్సరం 2021-2022 చెందిన వారు కూడా దరఖాస్తు చేసుకొనే అవకాశం కల్పిస్తోంది. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.9,000 స్టైఫండ్ కూడా చెల్లిస్తారు.
పోస్టుల సమాచారం..
డిపార్ట్మెంట్
ఖాళీల సంఖ్య
ఏరోనాటికల్ లేదా ఏరోస్పేస్ ఇంజనీరింగ్
15
కెమికల్ ఇంజనీరింగ్
10
సివిల్ ఇంజనీరింగ్
12
కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్
20
ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్
12
ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్
40
మెకానికల్
40
మెటలర్జీ ఇంజనీరింగ్
06
ఫైర్ అండ్ సేఫ్టీ ఇంజనీరింగ్
02
ప్రొడక్షన్ ఇంజనీరింగ్
06
అర్హతలు..
తాజాగా ఇస్రో విడుదల చేసిన అప్రెంటీస్ రిక్రూట్మెంట్ (Recruitment) నోటిఫికేషన్ ఆధారంగా దరఖాస్తు చేసుకొనే అభ్యర్థి బీఈ లేదా బీటెక్ పూర్తి చేసి ఉండాలి. అకాడమిక్లో కనీసం 65% మార్కులు లేదా 6.84 CGPA ఉండాలి.
అంతే కాకుండా క్యాటరింగ్ టెక్నాలజీ లేదా హోటల్ మేనేజ్మెంట్ విభాగంలో 4 పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు AICTE గుర్తింపు పొందిన ఇనిస్టిట్యూట్ నుంచి 60% కంటే తక్కువ మార్కులు లేకుండా హోటల్ మేనేజ్మెంట్ లేదా క్యాటరింగ్ టెక్నాలజీ పూర్తి చేసి ఉండాలి.
ముఖ్యమైన తేదీలు..
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం
సెప్టెంబర్ 24, 2021
దరఖాస్తుకు ఆఖరు తేదీ
అక్టోబర్ 8, 2021
ఎంపిక విధానం..
- పూర్తిగా అభ్యర్థి అకాడమిక్ మెరిట్ (Academic Merit) ఆధారంగా ఎంపిక చేస్తారు.
- ఎంపికైన అభ్యర్థులు దరఖాస్తులో పొందుపరిచిన అర్హతలకు సంబంధించిన డాక్యుమెంట్స్ చూపించాలి.
- తప్పుడు సమచారం ఇస్తే అభ్యర్థిన డిస్క్వాలిఫై (Disqualify) చేస్తారు.
దరఖాస్తు విధానం..
Step 1 : దరఖాస్తుప్రక్రియ పూర్తిగా ఆన్లైన్ ద్వారా ఉంటుంది.
Step 2 : ముందుగా అధికారిక వెబ్సైట్ https://rmt.vssc.gov.in/GA2021/display/advtGA.htm ను సందర్శించాలి.
Step 3 : అనంతరం నోటిఫికేషన్ సంబంధింత సమాచారం పూర్తిగా చదవాలి.
Step 4 : వివరాలు పూర్తిగా చదివిన తరువాత APPLY ఆప్షన్ క్లిక్ చేసి దరఖాస్తు నింపాల.
Step 5 : దరఖాస్తులో కచ్చితంగా సరైన మెయిల్ ఐడీ ఇవ్వాలి.
Step 6 : సెలక్షన్ సమాచారం మెయిల్ ద్వారా అందిస్తారు. కావును సరైన మెయిల్ ఐడీ (Mail Id) ఇవ్వాలి.
Step 7 : దరఖాస్తుకు అక్టోబర్ 8, 2021 వరకు అవకాశం ఉంది.
Published by:Sharath Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.