news18-telugu
Updated: October 28, 2020, 2:32 PM IST
ప్రతీకాత్మక చిత్రం
నిరుద్యోగులకు ఇస్రో మరో శుభవార్త చెప్పింది. పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. 7 సైటింస్ట్/ఇంజనీర్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఆయా పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు రూ. 56,100 నుంచి రూ.1,77,500 వరకు వేతనం చెల్లించనున్నట్లు ఇస్రో ప్రకటించింది. BE లేదా B.Tech కోర్సులను మెకానికల్, ఎయిరోస్పేస్ ఇంజినీరింగ్ మరియు ME లేదా MTech కోర్సులను propulsion engineering విభాగంలో పూర్తి చేసిన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఇతర విద్యార్హతల వివరాలను నోటిఫికేషన్ లో చూసుకోవచ్చు.
Official Website-Direct Linkఅభ్యర్థులకు ముఖ్య సూచనలు..
-ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ లో LPSC వెబ్ సైట్ లో దరఖాస్తు చేసుకోవాలి.
-షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులకు వివరాలు మెయిల్ ద్వారానే పంపించబడతాయి. కాబట్టి దరఖాస్తు నింపే సమయంలో మెయిల్ వివరాలను సరిగా ఇవ్వాలి.
-కేవలం ఇండియాకు చెందిన వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. -ప్రతీ పోస్టకు ఓ ప్రత్యేక దరఖాస్తు ఉంటుంది.
-రిజిస్ట్రేషన్ నంబరును ప్రాసెస్ పూర్తయ్యే వరకు భద్రంగా ఉంచుకోవాలి.-దరఖాస్తు దారులు రూ. 250 ఫీజును ఆన్లైన్లో చెల్లించాల్సి ఉంటుంది.
-ఫొటో, సర్టిఫికేట్లను అప్లోడ్ చేసే సమయంలో అవి నోటిఫికేషన్ లో సూచించిన సైజ్ లో ఉన్నాయో.. లేదో అన్న విషయాన్ని సరి చూసుకోవాలి.
Published by:
Nikhil Kumar S
First published:
October 28, 2020, 12:37 PM IST