ISRO Jobs: ఇస్రోలో ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే

ISRO Recruitment 2020 | తగిన అర్హతలు ఉన్నవారికి భారత అంతరిక్ష పరిశోధన సంస్థలో వరుసగా ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయి. పలు ఖాళీల భర్తీకి ఇస్రో మరో నోటిఫికేషన్ జారీ చేసింది. పూర్తి వివరాలు తెలుసుకోండి.

news18-telugu
Updated: March 18, 2020, 9:36 AM IST
ISRO Jobs: ఇస్రోలో ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే
ISRO Jobs: ఇస్రోలో ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
ఇండియన్ స్పేస్ రీసెర్చ్ అండ్ ఆర్గనైజేషన్ సెంటర్-ISRO ఉద్యోగాల భర్తీ కోసం మరో నోటిఫికేషన్ జారీ చేసింది. అహ్మదాబాద్‌లోని స్పేస్ అప్లికేషన్ సెంటర్-SAC కోసం మరో నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తం 55 ఖాళీలను ప్రకటించింది. సైంటిస్ట్ / ఇంజనీర్, టెక్నికల్ అసిస్టెంట్, టెక్నీషియన్ బీ పోస్టుల్ని భర్తీ చేస్తోంది ఇస్రో. ఇంజనీర్లు, పోస్ట్ గ్రాడ్యుయేట్స్, టెక్నీషియన్లు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయొచ్చు. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. దరఖాస్తుకు 2020 ఏప్రిల్ 3 చివరి తేదీ. ఆసక్తి గల అభ్యర్థులు https://recruitment.sac.gov.in/ వెబ్‌సైట్‌లో పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.

ISRO Recruitment 2020: నోటిఫికేషన్ వివరాలివే...

మొత్తం ఖాళీలు- 55
సైంటిస్ట్ / ఇంజనీర్- 21
టెక్నికల్ అసిస్టెంట్- 6
టెక్నీషియన్ బీ - 28 (ఫిట్టర్-6, మెషినిస్ట్-3, ఎలక్ట్రానిక్స్-10, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ-2, ప్లంబర్-1, కార్పెంటర్-1, ఎలక్ట్రీషియన్-1, మెకానికల్-3, కెమికల్-1)
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం- 2020 మార్చి 14దరఖాస్తుకు చివరి తేదీ- 2020 ఏప్రిల్ 3 సాయంత్రం 5 గంటలు
విద్యార్హత- సైంటిస్ట్ / ఇంజనీర్ పోస్టుకు ఎలక్ట్రానిక్స్‌లో పీహెచ్‌డీ, ఎంఎస్సీ ఫిజిక్స్, కంప్యూటర్ సైన్స్‌, ఎలక్ట్రానిక్స్, మెకానికల్ ఇంజనీరింగ్‌, స్ట్రక్చరల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో ఎంఈ లేదా ఎంటెక్. టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులకు ఇంజనీరింగ్‌లో డిప్లొమా ఫస్ట్ క్లాస్‌లో పాస్ కావాలి. టెక్నీషియన్ బీ పోస్టులకు 10వ తరగతి, ఐటీఐ.
నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

Job News: మరిన్ని జాబ్స్ &ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి:

TSPSC Jobs: హైదరాబాద్ వాటర్ బోర్డులో జాబ్స్... నేటి నుంచి దరఖాస్తులు

Jobs: ఇండియన్ కోస్ట్ గార్డ్‌లో ఉద్యోగాలు... నేటి నుంచి దరఖాస్తులు

Telangana Jobs: తెలంగాణ మైనారిటీ కాలేజీల్లో జాబ్స్... 1,000 పైగా పోస్టుల భర్తీ
First published: March 18, 2020, 9:36 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading