• HOME
  • »
  • NEWS
  • »
  • JOBS
  • »
  • ISRO RECRUITMENT 2020 INDIAN SPACE RESEARCH ORGANISATION RELEASED NOTIFICATION FOR 18 POSTS SS

ISRO Jobs: ఇస్రోలో ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే

ISRO Jobs: ఇస్రోలో ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే

ISRO Jobs: ఇస్రోలో ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే (ప్రతీకాత్మక చిత్రం)

ISRO recruitment 2020 | ఇస్రోలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఖాళీల వివరాలు తెలుసుకోండి.

  • Share this:
    ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్-ISRO లో ఉద్యోగాలు చేయాలనుకునేవారికి గుడ్ న్యూస్. మరో జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్-IIRS కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది ఇస్రో. జూనియర్ రీసెర్చ్ ఫెలో, రీసెర్చ్ అసోసియేట్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 18 పోస్టులున్నాయి. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్, ఫిజిక్స్, సివిల్ ఇంజనీరింగ్, ఫారెస్ట్రీ, ఎకాలజీ, ఎన్విరాన్‌మెంటల్ సైన్స్ లాంటి అంశాల్లో బీటెక్, బీఈ, ఎంఎస్సీ, ఎంటెక్, ఎంఈ లాంటి కోర్సులు పూర్తి చేసినవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేయొచ్చు. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ఆగస్ట్ 17న ప్రారంభమైంది. అప్లై చేయడానికి ఆగస్ట్ 31 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://www.iirs.gov.in/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు.

    Railway Jobs: రైల్వేలో 4499 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్... ఖాళీల వివరాలివే

    DRDO Jobs: గుడ్ న్యూస్... డీఆర్‌డీఓలో 311 ఉద్యోగాలకు గడువు పెంపు

    ISRO recruitment 2020: నోటిఫికేషన్ వివరాలు ఇవే...


    మొత్తం ఖాళీలు- 18
    జూనియర్ రీసెర్చ్ ఫెలో- 17
    రీసెర్చ్ అసోసియేట్- 1
    దరఖాస్తు ప్రారంభం- 2020 ఆగస్ట్ 17
    దరఖాస్తుకు చివరి తేదీ- 2020 ఆగస్ట్ 31
    వేతనం- జూనియర్ రీసెర్చ్ ఫెలో పోస్టుకు రూ.31,000. రీసెర్చ్ అసోసియేట్ పోస్టుకు రూ.54,000
    ఎంపిక విధానం- దరఖాస్తుల షార్ట్‌లిస్టింగ్, వీడియో ఇంటర్వ్యూ.
    Published by:Santhosh Kumar S
    First published:

    అగ్ర కథనాలు