news18-telugu
Updated: June 9, 2020, 10:43 AM IST
ISRO Jobs: ఇస్రోలో ఉద్యోగాలు... దరఖాస్తు చేయడానికి మరో ఛాన్స్
(ప్రతీకాత్మక చిత్రం)
ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్-ISRO గతంలో 55 పోస్టులతో నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు గడువు గతంలోనే ముగిసింది. రాతపరీక్ష జూన్ 7న జరగాల్సి ఉంది. కానీ కరోనా వైరస్ సంక్షోభంతో నియామక ప్రక్రియలో ఆటంకాలు ఎదురయ్యాయి. రాతపరీక్షను వాయిదా వేసింది ఇస్రో. ఇప్పటి వరకు దరఖాస్తు చేయని అభ్యర్థులకు మరో అవకాశం ఇచ్చేందుకు దరఖాస్తు లింక్‌ను మరోసారి యాక్టివేట్ చేసింది ఇస్రో. ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తు చేయొచ్చు. మొత్తం 55 సైంటిస్ట్ / ఇంజనీర్, టెక్నికల్ అసిస్టెంట్, టెక్నీషియన్ బీ పోస్టులున్నాయి. అహ్మదాబాద్‌లోని స్పేస్ అప్లికేషన్ సెంటర్-SAC కోసం ఈ పోస్టుల్ని భర్తీ చేస్తోంది ఇస్రో. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు https://recruitment.sac.gov.in/ వెబ్సైట్లో తెలుసుకోవచ్చు.
ISRO Recruitment 2020: నోటిఫికేషన్ వివరాలివే...
మొత్తం ఖాళీలు- 55
సైంటిస్ట్ / ఇంజనీర్- 21
టెక్నికల్ అసిస్టెంట్- 6
టెక్నీషియన్ బీ - 28 (ఫిట్టర్-6, మెషినిస్ట్-3, ఎలక్ట్రానిక్స్-10, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ-2, ప్లంబర్-1, కార్పెంటర్-1, ఎలక్ట్రీషియన్-1, మెకానికల్-3, కెమికల్-1)
ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం- 2020 మార్చి 14దరఖాస్తుకు చివరి తేదీ- త్వరలో వెల్లడించనున్న ఇస్రో
విద్యార్హత- సైంటిస్ట్ / ఇంజనీర్ పోస్టుకు ఎలక్ట్రానిక్స్‌లో పీహెచ్డీ, ఎంఎస్సీ ఫిజిక్స్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్ ఇంజనీరింగ్, స్ట్రక్చరల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో ఎంఈ లేదా ఎంటెక్. టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులకు ఇంజనీరింగ్‌లో డిప్లొమా ఫస్ట్ క్లాస్‌లో పాస్ కావాలి. టెక్నీషియన్ బీ పోస్టులకు 10వ తరగతి, ఐటీఐ.
వయస్సు- 2020 మార్చి 27 నాటికి 18 నుంచి 25 ఏళ్లు
నోటిఫికేషన్ కోసం
ఇక్కడ క్లిక్ చేయండి.
దరఖాస్తు చేయడానికి
ఇక్కడ క్లిక్ చేయండి.
ఇవి కూడా చదవండి:
IOCL Jobs: ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్లో 1004 ఉద్యోగాలు... నోటిఫికేషన్ వివరాలివే
NTPC Jobs: ఎన్టీపీసీలో ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే
ECIL Jobs: హైదరాబాద్‌లోని ఈసీఐఎల్‌లో 82 ఉద్యోగాలు... నోటిఫికేషన్ వివరాలు ఇవే
Andhra Pradesh Jobs: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలు... పరీక్షలు ఎప్పుడంటే
Published by:
Santhosh Kumar S
First published:
June 9, 2020, 10:43 AM IST